ప్రపంచంలో కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్యను చూసినప్పుడు,
ప్రతి 13వ కొత్త కేన్సర్ కేసు భారతదేశం నుంచి నమోదవుతోందని అమెరికాకు
చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ తమ అధ్యయనంలో
తేలిందని వెల్లడించింది. కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారతదేశంలో క్రమంగా
పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రజల్లో ఈ వ్యాధి
పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేషనల్ కేన్సర్
ఇనిస్టిట్యూట్ తెలిపింది.
భారతదేశంలో సుమారు
1.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని
చెప్పారు. ఈ కేసుల్లోనూ ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్, సర్వికల్ కేన్సర్,
ఓరల్ కేన్సర్ అగ్రభాగాన ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధిని తొలిదశలో
గుర్తిస్తే నయం చేయడం సాధ్యమేనని చెప్పారు.
No comments:
Post a Comment