Thursday, 10 December 2015

రేడియోధెరపీ చికిత్స - పనితీరు

మామూలుగా జీవకణాలు విభజించబడి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి ఓ క్రమ పద్ధతిలో శరర అవయవాల నిర్మాణానికి సహకరిస్తాయి. జీవకణాలు వాటి పెరుగుదలను అరికట్టలేనప్పుడు కేన్సర్ వ్యాధి పెరుగుతుంది. ఈ అసాధారణ కణాలు త్వరగా విభజించబడి కణముల సముదాయంగా మారి కణతిగా ఏర్పడుతుంది. ఈ కణాలే చుట్టూ ఉన్న అవయవాలు, శరీరభాగాల్లోకి వ్యాప్తి చెందుతాయి.

         కేన్సర్ కణాలు పునరుత్పత్తికి మూలభాగమైన డీఎన్ఏను రేడియేషన్ ద్వారా చంపగలుగుతున్నాము. అవి చచ్చిపోయినందువల్ల అవి విభజించబడవు. ఆ విధంగా వాటి పెరుగుదల ఆగిపోయి కణితి కుచించుకుపోతుంది. త్వరగాను, అతిగాను పెరిగే కణాల మీదే రేడియేషన్ బాగా పనిచేస్తుంది.

No comments:

Post a Comment