Thursday, 17 December 2015

కేన్సర్‌ కణితిపై నేరుగా దాడిచేసే 'బయోజెల్‌'




  కేన్సర్‌ను సమర్ధంగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా బయోజెల్‌ను త యారుచేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శరీరంలో సహజంగా తయారయ్యే టి లింపోసైట్లకు దన్నుగా ఈ జెల్‌ను లింపోసైట్లను కృత్రిమంగా తయారు చేసేలా తయారుచేశారు. ఈ బయోజెల్‌లో యాంటీ కేన్సర్‌ ఏజెంట్లను పొందుపరిచి శరీరంలోకి ఇంజెక్ట్‌ చేయవచ్చన్నారు. ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది నేరుగా కేన్సర్‌ కణితిని చేరుకుంటుందని చెప్పారు. 
 
ఆపై ఇందులోని యాంటీ కేన్సర్‌ ఏజెంట్లు కణితిపై దాడి చేసి కేన్సర్‌ కణాలను నిర్మూలిస్తాయని వారు వివరించారు. బయోజెల్‌ను ఇప్పటికే లేబ రేటరీలో పరీక్షించి సంతృప్తి చెందినట్లు మాంట్రియల్‌ వర్సీటీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ సరికొత్త బయోజెల్‌ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో, శరీర ఉష్ణోగ్రత వద్ద జెల్‌గా మారుతుందన్నారు. ప్రస్తుతం కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మందులు తొలుత రక్తప్రవాహంలోకి చేరి అక్కడినుంచి శరీరం మొత్తాన్ని చుట్టివస్తాయి. ఆపై కేన్సర్‌ కణితిపై దాడి చేస్తాయన్నారు. అయితే, తాజాగా అభివృద్ధి చేసిన ఈ తెలివైన జెల్‌ శరీరంలోకి వెళ్లీవెళ్లగానే నేరుగా కేన్సర్‌ కణితి వద్దకు వెలుతుందని చెప్పారు. 

No comments:

Post a Comment