Sunday, 27 December 2015

గర్భాశయ కేన్సర్ గుర్తింపు ఇక మరింత సులభం

గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను గుర్తించేందుకు అత్యంత సులభతర, ఏమాత్రం ఖర్చులేని పద్ధతిని ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ వైద్యులు ఆవిష్కరించారు. అందరికీ అందుబాటులో ఉండే వెనిగర్‌ను ఉపయోగించి గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఉందోలేదో గుర్తించవచ్చని ఆ సంస్థ వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం గర్భాశయ సైటాలజీ, పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా గర్భాశయ ముఖద్వారం కేన్సర్‌ను గుర్తిస్తున్నారు. అయితే.. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదేకాక, కేన్సర్ ఉందో లేదో గుర్తించేందుకు నిపుణుల అవసరం ఉంటుంది. కానీ, ‘టాటా’ సంస్థ రూపొందించిన విధానంతో ఆరోగ్య కార్యకర్తలు కూడా కేన్సర్‌ను గుర్తించవచ్చు. ఈ పద్ధతిలో 4 శాతం ఆసిటిక్ ఆసిడ్ (వీఐఏ)ను ఉపయోగిస్తారు.

No comments:

Post a Comment