సిగరెట్
పొగతోనే కాదు..ఇప్పుడు మరో దానితోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే. సిగరెట్
పొగతో క్యాన్సర్ వస్తుందని తెలిసిందే. అదే కాదు.. ఇళ్లల్లో వెలిగించే
అగరొత్తుల పొగకూడా ఆరోగ్యానికి హానికరమేనట. చక్కని వాసనతో మనసుకు ప్రశాంతత
కలిగిస్తుందని అగరబత్తీల పొగను పదే పదే పీలిస్తే… కేన్సర్ వస్తుందని
హెచ్చరిస్తున్నారు. ఆ పొగ ఊపిరితిత్తులలోకి ప్రమాదకరమైన రసాయనాలను
చేరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అగరుబత్తీలు, వాటి నుంచి వెలువడే
పొగతో కలిగే పరిణామాలపై తొలిసారి చైనా పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.
అగరొత్తుల పొగలో మొత్తం 64 రకాల రసాయనాలు
ఉన్నట్లు తేల్చారు. వీటిలో చాలా మటుకు హానికరం కాకపోయినా.. కొన్ని మాత్రం
కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని సౌత్ చైనా
వర్సిటీ పరిశోధకుడు రోంగ్ జో వివరించారు. అగరబత్తీల నుంచి వచ్చే పొగతో పాటు
గాలిలో కలిసిన రసాయనాలు ఊపిరితిత్తులలోకి చేరి వాపునకు దారితీస్తాయని,
దీంతో ఊపిరితిత్తుల కేన్సర్, చైల్డ్ హుడ్ లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్ కు
కారణమవుతుందని వారు తెలిపారు.
No comments:
Post a Comment