Thursday, 31 December 2015

సీతాఫలంతో కేన్సర్ కు చెక్

తిన్న వెంటనే శక్తినిచ్చే ఫలం సీతాఫలం. దగ్గు, జలుబు దరిచేరవు. కేన్సర్ కణాలతోనూ పోరాడుతుంది. కండరాలకు బలాన్నిస్తుంది. సీతాఫలం తింటే విటమిన్ సీ పెరిగి, రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. లివర్ కేన్సర్, మెదడులో ట్యూమర్స్, బ్రెస్ట్ కేన్సర్ రాకుండా నివారిస్తుంది. సీతాఫలంలో బీ6 విటమిన్ అధికంగా ఉంటుంది.

ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది. సీతాఫలాలు ఎక్కువగా తింటే ఎనీమియాను నివారించవచ్చు, కళ్ల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల సౌందర్యానికి సీతాఫలమే మంచి మందు. ఇన్ని రకాల రోగాలను నివారించే సీతాఫలాన్ని వెంటనే తిందామా మరి.

‘సీతాఫలం’ ఆరోగ్యానికి హితం


Custard Apple
సీతాఫలాల సీజన్‌ కొనసాగుతోంది  మార్కెట్లో విరివిగా ఈ పండ్లు దొరుకుతున్నాయి. ఇంతకీ సీతాఫలంమనకు ఎలాంటి ఫలాన్నిస్తుందో తెలుసుకుందాం. తిన్న వెంటనే శక్తినిచ్చే పండు సీతాఫలం ఒక్కటే . కండరాలకు బలాన్నిస్తుంది. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. కేన్సర్‌కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. ఈ పండ్లలో బి6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. దంతాలకు మంచి ఆహారం. దంతాల్లోని నొప్పిని నివారిస్తుంది. వాంతులు రాకుండా చేసే గుణం సీతాఫలాలకుంది.ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది. సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. గుండెకు మంచిది, డయాబెటిస్‌ దరి చేరనివ్వదు. జీర్ణక్రియమెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగాఉపయోగపడతాయి. చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది. మరి ఇంకే ముంది…. ఎంచక్కా సీత ఫలం తిందామా మరి. 
- See more at: http://www.toofandaily.com/custard-apple-good-for-health/#sthash.8te3Ui01.dpuf

‘సీతాఫలం’ ఆరోగ్యానికి హితం


Custard Apple
సీతాఫలాల సీజన్‌ కొనసాగుతోంది  మార్కెట్లో విరివిగా ఈ పండ్లు దొరుకుతున్నాయి. ఇంతకీ సీతాఫలంమనకు ఎలాంటి ఫలాన్నిస్తుందో తెలుసుకుందాం. తిన్న వెంటనే శక్తినిచ్చే పండు సీతాఫలం ఒక్కటే . కండరాలకు బలాన్నిస్తుంది. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. కేన్సర్‌కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. ఈ పండ్లలో బి6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. దంతాలకు మంచి ఆహారం. దంతాల్లోని నొప్పిని నివారిస్తుంది. వాంతులు రాకుండా చేసే గుణం సీతాఫలాలకుంది.ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది. సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. గుండెకు మంచిది, డయాబెటిస్‌ దరి చేరనివ్వదు. జీర్ణక్రియమెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగాఉపయోగపడతాయి. చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది. మరి ఇంకే ముంది…. ఎంచక్కా సీత ఫలం తిందామా మరి. 
- See more at: http://www.toofandaily.com/custard-apple-good-for-health/#sthash.8te3Ui01.dpuf

‘సీతాఫలం’ ఆరోగ్యానికి హితం


Custard Apple
సీతాఫలాల సీజన్‌ కొనసాగుతోంది  మార్కెట్లో విరివిగా ఈ పండ్లు దొరుకుతున్నాయి. ఇంతకీ సీతాఫలంమనకు ఎలాంటి ఫలాన్నిస్తుందో తెలుసుకుందాం. తిన్న వెంటనే శక్తినిచ్చే పండు సీతాఫలం ఒక్కటే . కండరాలకు బలాన్నిస్తుంది. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. కేన్సర్‌కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. ఈ పండ్లలో బి6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. దంతాలకు మంచి ఆహారం. దంతాల్లోని నొప్పిని నివారిస్తుంది. వాంతులు రాకుండా చేసే గుణం సీతాఫలాలకుంది.ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది. సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. గుండెకు మంచిది, డయాబెటిస్‌ దరి చేరనివ్వదు. జీర్ణక్రియమెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగాఉపయోగపడతాయి. చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది. మరి ఇంకే ముంది…. ఎంచక్కా సీత ఫలం తిందామా మరి. 
- See more at: http://www.toofandaily.com/custard-apple-good-for-health/#sthash.8te3Ui01.dpuf

‘సీతాఫలం’ ఆరోగ్యానికి హితం


Custard Apple
సీతాఫలాల సీజన్‌ కొనసాగుతోంది  మార్కెట్లో విరివిగా ఈ పండ్లు దొరుకుతున్నాయి. ఇంతకీ సీతాఫలంమనకు ఎలాంటి ఫలాన్నిస్తుందో తెలుసుకుందాం. తిన్న వెంటనే శక్తినిచ్చే పండు సీతాఫలం ఒక్కటే . కండరాలకు బలాన్నిస్తుంది. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. కేన్సర్‌కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. ఈ పండ్లలో బి6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. దంతాలకు మంచి ఆహారం. దంతాల్లోని నొప్పిని నివారిస్తుంది. వాంతులు రాకుండా చేసే గుణం సీతాఫలాలకుంది.ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది. సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. గుండెకు మంచిది, డయాబెటిస్‌ దరి చేరనివ్వదు. జీర్ణక్రియమెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగాఉపయోగపడతాయి. చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది. మరి ఇంకే ముంది…. ఎంచక్కా సీత ఫలం తిందామా మరి. 
- See more at: http://www.toofandaily.com/custard-apple-good-for-health/#sthash.8te3Ui01.dpuf

కొబ్బరి నీళ్లతో కేన్సర్ కు చెక్


 

కొబ్బరి బోండాం ఫుల్ ఎనర్జీని కలిగివుంటుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మినరల్స్ ఉన్నాయి. ఇవి అలసటను దూరం చేసి మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి. ఎనర్జీ కలిగిన ఈ కొబ్బరి బొండాం వంద గ్రాముల నీటిలో 312 మిల్లీ గ్రాముల పొటాషియం, 30 మిల్లీ గ్రాముల మ్యాగ్నీషియం ఉన్నాయి. ఇవి ధాతువుల్ని ఎముకలకు, కండరాలకు అందించడం ద్వారా కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శరీరానికి ఉత్సాహం లభిస్తుంది.
 
తెల్లవారుజామున పరగడుపున కొబ్బరి బొండాం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలంటే రోజూ ఓ కొబ్బరి బొండాంను తీసుకోవడం మంచిది. అలాగే కామెర్లకు కూడా కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి. కొబ్బరిబొండాంలో కొవ్వు శాతం తక్కువ. డయాబెటిస్‌ను నియంత్రించే శక్తి ఎక్కువ. ఇంకా కేన్సర్ రాకుండా నిరోధిస్తుంది. వైరస్‌తో పోరాడే శక్తి కొబ్బరి నీళ్లకుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

 






Wednesday, 30 December 2015

బ్రెస్ట్ కేన్సర్ కు నూతన ఔషధం

సాధారణంగా మహిళలలో వచ్చే బ్రెస్ట్ కేన్సర్ నివారణకు ఔషధాన్ని కనుగొన్నట్లు ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. అనాస్ట్రోజోల్ గా పిలవబడే ఈ ఔషధంలో బ్రెస్ట్ కేన్సర్ ను నివారించే గుణం ఉందని పరిశోధక్లు పేర్కొన్నారు.అంతర్జాతీయ పరిశోధనలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన ప్రొపెసర్ క్రిస్టోబెల్ సాండర్స్  నేతృత్వంలో పరిశోధకుల బృందం ఈ ఔషధాన్ని తయారుచేసింది.



ఈ పరిశోదనలో బ్రెస్ట్ కేన్సర్ బాధిత కుటుంబాలనుంచి వచ్చిన వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.
ఈ పరిశోధన ప్రకారం అనాస్ట్రోజోల్ ఔషధాన్ని తీసుకున్న మహిళకు ఐదుసంవత్సరాలలో మళ్లీ కేన్సర్ వచ్చే అవకాశం 50 శాతం వరకూ తగ్గుతుందని వెల్లడయింది. ఈ ఔషధంతో భవిష్యత్తులో తరాల మహిళలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

పుట్టుమచ్చలతో కేన్సర్ గుర్తింపు


 
.  పుట్టుమచ్చలతో కేన్సర్‌ ముప్పును పసిగట్టవచ్చా.. అంటే అవుననే శాస్త్రవేత్తలు జవాబిస్తున్నారు. శరీరంపై వం దకు మించి పుట్టమచ్చలు ఉంటే కేన్సర్‌ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. కుడిచేతిపై పదకొండు.. అంతకంటే ఎక్కువ మచ్చలుంటే శరీరంపై మొత్తం వందకు పైగా మచ్చలు ఉంటాయని పరిశోధనలో తేలిందట.
ఇలాంటి వారికి చర్మ కేన్సర్‌ వచ్చే ప్రమాదం సగటు కన్నా ఎక్కువని కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు స్పష్టం చేశారు. ఇలాంటి పరిశోధన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇకపై పుట్టుమచ్చల నిపుణులకు గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు. రోగులంతా డాక్టర్ల దగ్గరకు వెళ్లడం మానేసి మచ్చలు లెక్కపెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
.
 

Tuesday, 29 December 2015

బంగాళాదుంపలతో జీర్ణాశయ కేన్సర్ దూరం

potato may pack cancer prevention
కూరగాయలతో కేన్సర్ ముప్పు నుంచి జయించవచ్చని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ముఖ్యంగా ఆలు గడ్డలతో జీర్ణాశయ కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చని వారు వెల్లడించారు. బీజింగ్‌లోని జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు.
ముఖ్యంగా పళ్లు, ఆకుపచ్చ, పసుపు రంగు కూరగాయల వల్ల జీర్ణాశయంలో ఒక రక్షణ పొర ఏర్పడుతుందని, వీటితో పాటు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి జీర్ణాశయంలో ఒత్తిడిని తీవ్రంగా తగ్గిస్తుంది చెప్పారు. ప్రధానంగా ఆలుగడ్డ వంటి తెలుపు రంగు కూరగాయలతో ఈ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.

మన వంటింట్లోనే కేన్సర్ నివారిణి



మనం వంటల్లో వాడే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కేన్సర్ కు నివారిణిగా వెల్లుల్లి అద్భతంగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు. అలాగే శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను అరికట్టి, గుండెపోటు కూడా రాకుండా చేస్తోందంటున్నారు. రోజూ నాలుగు వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి, కాసేపయ్యాక తింటే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.

వెల్లుల్లిలో ఉండే ఆయోజేన్ రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే వాటిలో ఉండే అలిసిస్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశం లేకుండా చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అలీల్ సల్ఫైడ్ లు కొన్ని రకాల కేన్సర్లకు నివారిణిగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Monday, 28 December 2015

కేన్సర్ రోగులకి శుభవార్త


కేన్సర్ కు కీమోథెరపీ లేదంటే శస్త్ర చికిత్సలు చేయాల్సిందే. కీమోథెరపీ, శస్త్రచికిత్సల వల్ల రోగకారక కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇకపై అలాంటి బాధఉండదని, కేన్సర్ కోసం సరైన మందు కనుక్కున్నామని అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. దీనికి ఏజీ-221 అని నామకరణం చేశారు.

కేన్సర్ రోగుల్లో ఐడీహెచ్ 2 అనే ఉత్పరివర్తన జన్యువులుంటాయని, అది 2-హైడ్రాక్సీగ్లుటరేట్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుందని మెమోరియల్ స్లోన్ కెట్టరిగ్ కేన్సర్ సెంటర్ ఆంకాలజిస్టు ఐటన్ ఎం. స్టీన్ తెలిపారు. ఆ ప్రోటీన్ తెల్ల రక్తకణాల అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆయన చెప్పారు. అలా అడ్డుకునే ప్రోటీన్ ను నిరోధించి తెల్లరక్తకణాల సాధారణ అభివృద్ధికి ఏజీ-221 దోహదపడుతుందని ఆయన వివరించారు.

ఇవి తింటే కేన్సర్‌ దూరం

పొగతాగే అలవాటు ఉన్న వారు లంగ్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? రోజూ ఎనిమిది రకాల ఫ్రూట్స్‌ తీసుకోవాలి. ప్రతిరోజూ రకరకాల ఫ్రూట్స్‌ తీసుకుంటే లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 23 శాతం మేర తగ్గుతాయి. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో వెల్లడయింది. రోజూ ఐదు రకాల పళ్లు, కూరగాయలు తీసుకుంటే రూన్సర్‌ రాకుండా నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.

యూర్‌పలోని ఒక సంస్థ పలు దేశాలలో లంగ్‌ క్యాన్సర్‌పై పరిశోధనలు నిర్వహించింది. ఇందులో ఎక్కువ ఫ్రూట్స్‌ తీసుకోవడమే కాకుండా, రకరకాల కూరగాయలు తీసుకునే వారిలో కూడా లంగ్‌ క్యాన్సర్‌ రిస్క్‌ చాలా వరకు తక్కువగా ఉందని వెల్లడయింది. పొగతాగే అలవాటు మానుకోలేకపోతే ఫ్రూట్స్‌నైనా ఎక్కువగా తినండి.

కేన్సర్ కు సులువయిన చికిత్స…



images (4)

ప్రాణాంతక కేన్సర్‌కు తీవ్రమైన రేడియో ధార్మిక పదార్థాలను వాడే కీమోథెరపీ చికిత్స వల్ల జుట్టు రాలిపోవడం, శరీరం బలహీనపడటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా కాకుండా రేడియో ధార్మిక పదార్థాలు కేన్సర్ కణాలపై మాత్రమే పనిచేయగలిగే ఓ వినూత్న పద్ధతిని ప్రతిపాదించారు అమెరికా, కెనెడాల్లోని శాస్త్రవేత్తల బృందం. కీమోథెరపీ మందుల్ని అతిసూక్ష్మమైన బెలూన్లలో నింపి శరీరంలోకి పంపించడం… అవి కేన్సర్ కణాల వద్దకు చేరుకోగానే.. లేజర్ కిరణాలతో వాటిని పేల్చేసి మందులు ఆ ప్రాంతంలో మాత్రమే విడుదలయ్యేలా చేయడమే ఈ కొత్త పద్ధతి.
 అలాగే లేజర్ ను ఆపేసిన వెంటనే నానో బెలూన్లు కేన్సర్ కణాల పెరుగుదలకు తోడ్పడే ప్రొటీన్లు, కణాలను సేకరించి మూసుకుపోతాయి. తర్వాత వాటిని సేకరించి వ్యాధి స్థితిని తెలుసుకుని తదుపరి చికిత్సపైనా నిర్ణయం తీసుకోవచ్చు. మనిషి వెంట్రుకలో వెయ్యో వంతు మాత్రమే ఉండే ఈ నానో బెలూన్లను వంటనూనె లాంటి ఫాస్పోలిపిడ్, పొర్‌ఫెరిన్ అనే సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తారు. ఐదేళ్లలో ఈ పద్ధతిని అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్త జోనథన్ లోవెల్ తెలిపారు.

క్యాలీఫ్లవర్ తో ప్రోస్టేట్ క్యాన్సర్ దూరం

మీకు గోబీ సబ్జీ అంటే ఇష్టం ఉందా? లేదా? లేకున్నా తినాలి మరి. ఎందుకంటే కాలీఫ్లవర్ వల్ల ప్రోస్టేటు కేన్సర్ తగ్గిపోతుందట. అంతేనా.. ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఎలాంటి సమస్య ఉండదట. కేన్సర్ లేని వారు కేలీఫ్లవర్ తింటే కేన్సర్ రాకుండా ఆపుతుందట. మన శరీరంలోని హెడీఏసీ ఎంజైమ్‌లనేవి కేన్సర్‌ను నిరోధించే జన్యువులు క్రియాశీలకం కాకుండా ఆపుతాయి. ఈ హెచ్‌డీఏసీ జన్యువులను కాలీఫ్లవర్‌లోని సల్ఫోరాఫెన్ నిరోధిస్తుందని ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. 

హెచ్‌డీఏసీ ఎంజైమ్‌లను నిరోధించడం కేన్సర్ చికిత్సలో చాలా ముఖ్యమైన ప్రక్రియగా డాక్టర్లు పరిగణిస్తారు. అది ఆహారం వల్లే సాధ్యమైందంటే ఇక కేన్సర్ చికిత్స సులభమవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమంటే కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్‌ను కేన్సర్ నివారణకు వాడిని ప్రమాదం లేదని డాక్టర్లు నిర్ధారించారు. ఈ సల్ఫారఫేన్ అనే రసాయనం.. ఫైటో కెమికల్స్ అనే వర్గానికి చెందింది. ఇది ఆహారంలో తీసుకుంటే మంచిది కాబట్టి.. ఎంత తీసుకుంటే మంచిదో తెలుసుకుంటే కేన్సర్‌కు చికిత్స మరింత తేలికవుతుందని నిపుణుల అంచనా.

Sunday, 27 December 2015

మగవారికి రొమ్ము కేన్సర్


అరుదైన వ్యాధుల్లో ఒకటిగా చెప్పుకొనే వ్యాధి 'మగవాళ్లలో బ్రెస్ట్ కేన్సర్'. సాధారణంగా బ్రెస్ట్‌కేన్సర్అనే మాట  వింటే గుర్తుకొచ్చేది మహిళలే. ఈ వ్యాధి వాళ్లలోనే ఉంటుందనేది నిన్నటి వరకూ ఉన్న నమ్మకం. కానీ నేటి పరిస్థితుల్లో అనేక కారణాల వల్ల మగవాళ్లు కూడా బ్రెస్ట్‌కేన్సర్ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. వంశపారంపర్యత, ఊబకాయం వంటి సాధారణ కారణాలే తప్ప మగవాళ్లలో బ్రెస్ట్‌కేన్సర్‌కు సంబంధించిన ప్రత్యేక కారణాలంటూ వేటిని గుర్తించకపోవడం ఆందోళన కలిగించే విషయం.

ఆడవాళ్లలో బ్రెస్ట్ కేన్సర్ గురించి అనేకసార్లు వినడం, చూడటం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చిక్కుకునే మగవాళ్ల సంఖ్య పెరుగుతోందని వైద్యరంగం చెబుతోంది. ఆడవాళ్లతో పోలిస్తే మొత్తం రొమ్ము కేన్సర్ కేసులలో మగవాళ్లది ఒక్క శాతమే అయినప్పటికీ ఇది ఆశ్చర్యపరిచే విషయమే. మగవారికి బ్రెస్ట్‌క్యాన్సర్ రావడానికి వైద్యరంగం ప్రత్యేకంగా సూచించిన కారణాలు ఏవీ లేకపోవడం విచిత్రం. ఇప్పటి వరకు చూస్తున్న కేసుల్లో మగవారిలో యాభై ఏళ్ల వయసు దాటిన వారిలోనే ఈ వ్యా«ధి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ బ్రెస్ట్ కేన్సర్ ఏ వయసు వారికైనా రావచ్చు అని వైద్యరంగం చెబుతుండటం గమనార్హం.

గర్భాశయ కేన్సర్ గుర్తింపు ఇక మరింత సులభం

గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను గుర్తించేందుకు అత్యంత సులభతర, ఏమాత్రం ఖర్చులేని పద్ధతిని ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ వైద్యులు ఆవిష్కరించారు. అందరికీ అందుబాటులో ఉండే వెనిగర్‌ను ఉపయోగించి గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఉందోలేదో గుర్తించవచ్చని ఆ సంస్థ వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం గర్భాశయ సైటాలజీ, పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా గర్భాశయ ముఖద్వారం కేన్సర్‌ను గుర్తిస్తున్నారు. అయితే.. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదేకాక, కేన్సర్ ఉందో లేదో గుర్తించేందుకు నిపుణుల అవసరం ఉంటుంది. కానీ, ‘టాటా’ సంస్థ రూపొందించిన విధానంతో ఆరోగ్య కార్యకర్తలు కూడా కేన్సర్‌ను గుర్తించవచ్చు. ఈ పద్ధతిలో 4 శాతం ఆసిటిక్ ఆసిడ్ (వీఐఏ)ను ఉపయోగిస్తారు.

Friday, 25 December 2015

కేన్సర్ భారం భరించేదెలా..?

కేన్సర్‌.. ఒకప్పుడు సినిమాల్లో ఏదైనా కేరక్టర్‌కు పెద్ద జబ్బు ఉన్నట్టుగా చూపించాలంటే దీన్నే ప్రస్తావించేవారు. సినిమా పాత్రలకు తప్ప నిజజీవితంలో అరుదుగా వచ్చేది. కానీ, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కేన్సర్‌ కేసులు, కేన్సర్‌ మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. గడచిన రెండేళ్లలో చాలామంది ప్రముఖులు ఈ వ్యాధి బారినపడి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. మనదేశంలో ఏటా 10 లక్షల కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి ఐదుగురు కేన్సర్‌ బాధితుల్లో ఒకరు 36 నుంచి 45 ఏళ్లలోపువారే. కేన్సర్‌ మరణాల సంఖ్య ఇంతగా ఉండటానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి.. దాన్ని తొలిదశలోనే గుర్తించలేకపోవడం. రెండోది.. గుర్తించినా చికిత్స చేయించుకునేంత ఆర్థిక స్థోమత చాలామందికి లేకపోవడం. బాధితులను శారీరకంగా, మానసికంగానే కాదు.. ఆర్థికంగానూ కుంగదీసే వ్యాధి ఇది.


 2004నాటి ఒక అధ్యయనం ప్రకారం… ఇంట్లో కేన్సర్‌ బాధితుడు/బాధితురాలు ఉంటే ఆ ఇంటి నెలవారీ బడ్జెట్‌ సాధారణంకన్నా గరిష్ఠంగా 44 శాతం పెరిగిపోతుంది. సాధారణ ఆరోగ్య బీమా పాలసీ కొంతవరకూ ఉపయోగపడుతుందిగానీ.. పరిమితి దాటితే మళ్లీ మన జేబులోంచే డబ్బు పెట్టుకోవాలి. పైగా ప్రీమియం కూడా ఎక్కువే. అదే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ అయితే ప్రీమియం తక్కువ ఉండి కొంతవరకూ ఆర్థిక భారం తగ్గుతుంది. మామూలు ఆరోగ్య బీమా పాలసీ అయితే.. కనీసం 24 గంటలపాటు హాస్పిటల్‌లో ఉంటేనే కవర్‌ అవుతుంది. అదే, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ అయితే.. ఆ వ్యాధి ఉన్నట్లు డయాగ్నసి్‌సలో తేలితే చాలు. చికిత్స వ్యయాలతో నిమిత్తం లేకుండా బీమా మొత్తాన్నీ ఒకేసారి చెల్లిస్తారు.

ప్రొస్టేట్ కేన్సర్ రిస్క్ తగ్గాలంటే ?


 20 మంది మహిళలలతో పురుషుడు సెక్సులో పాల్గొంటే అతడికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 28% మేర తగ్గిపోతుందట. ఈ అధ్యయనం కెనడాకు సంబంధించిన పరిశోధకులు చేసి, పలువురు పురుషులను పరిశీలించిన అనంతరం వెల్లడించినట్లు కేన్సర్ ఎపిడమాలజీ జర్నల్ తెలిపింది. దీనికి కారణం అంతమంది మహిళలతో సెక్సులో పాల్గొనేవారు ఎక్కువసార్లు వీర్యాన్ని స్ఖలిస్తారు కనుక వీర్యంలో ప్రొస్టేట్ కేన్సర్ కారక ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుందని వారు తెలుసుకున్నారు. 


అయితే కొన్ని దేశాల్లో ఇలా ఎక్కువమంది స్త్రీలతో సెక్స్ చేసే పరిస్థితి ఉండదనీ, అలాంటి దేశాల్లో మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారని చెపుతున్నారు.

అధ్యయనంలో భాగంగా సెక్స్ పరీక్షల్లో పాల్గొన్న పురుషుల్లో ఎక్కువమంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో ప్రొస్టేట్ కేన్సర్ అవకాశాలు తక్కువగా కనబడగా భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో కొంతమందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు తేలింది. ఐతే ఇది కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తుందని పరిశోధకుల మాటలను బట్టి తెలుస్తుంది.

Thursday, 24 December 2015

స్మార్ట్ ఫోన్ తో కేన్సర్ నిర్థారణ

కేన్సర్‌ నిర్ధారణ ఖర్చుతో కూడకున్న వ్యవహారం.. రోజుల తరబడి పరీక్ష కేంద్రాలకు, ఆస్పత్రులకు తిరగడం విసుగుపుట్టిస్తుంటే, మరోవైపు ఫలితం ఎలా వస్తుందోననే ఆందోళన పట్టిపీడిస్తుంది. తాజాగా ఈ చికాకులకు త్వరలో కాలం చెల్లనుంది. కేన్సర్‌ నిర్ధారణకు సంబంధించి కచ్చితమైన ఫలితాన్ని అందించే ఓ పరికరాన్ని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ కోసం దీనికి కావాల్సిందల్లా హై రిజల్యూషన్‌తో ఫొటో తీయగల కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే!


 ఈ పరికరం సాయంతో మీ స్మార్ట్‌ఫోనే ఓ పరీక్ష కేంద్రంగా మారనుందట. ఈ పరీక్షతో కేవలం అరవై నిమిషాల్లో కేన్సర్‌ ఉందో లేదో తెలుసుకోవచ్చని బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతో తీసిన హైరిజల్యూషన్‌ చిత్రాలను విశ్లేషించి కేన్సర్‌ సోకింది లేనిదీ ఈ పరికరం ఓ గంటలో తేల్చేస్తుందని చెప్పారు.

వ్యాయామంతో కేన్సర్ తగ్గుతుందా..?

వ్యాయామం కేన్సర్ ను తగ్గిస్తుంది. రోజు వ్యాయామం చేస్తే శారీరక దారుడ్యం పెరుగుతోంది. అదే సమయంలో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ ను అందుతోంది. ఇది సహజంగా అందరూ చెప్పే మాటే. శరీరానికి మనం చేసే వ్యాయామం వల్ల క్యాన్సర్ నుండి రక్షిస్తుందన్నది పరిశోధనల సారాంశం. అమెరికాకు చెందిన వెర్మాట్ విశ్వవిద్యాలయానికి చెందిన సుషన్ జి లకొస్కీ బృందం ఈ మేరకు తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ బృందం మొత్తం 13,949 పై పరీక్షలు చేసింది.

ఫిట్నెస్ నిర్ధారణకు గాను నిర్వహించిన త్రెడ్ మిల్ టెస్ట్ లో 55 శాతం మంది శ్వాసకోశ క్యాన్సర్ ఉన్నట్లు కనుగొన్నట్లు ఈ బృందం చెప్పింది. వారిలో ;44 శాతం మంది కొలక్ట్రల్ క్యాన్సర్ వ్యాధిని నిర్థారించారు. రోజు వ్యాయామం చేసిన వారిలో గుండె సామర్ధ్యం పెరిగిందని ;తేలింది. అంతే కాదు 65 శాతం మందిలో కాన్సర్ కణాలు తగ్గినట్లు తమ పరిశోధనలో గుర్తించినట్లు వివరించారు. వ్యాయామం మంచి ఫిట్నెస్ కే కాదు ఇతర దీర్గకాలిక రోగాలను అదుపు ఉంచేందుకు దోహం చేస్తుందన్నది నిజం. మరి ఇక ఆలస్యం ఎందుకు కనీసం వాకింగ్ కు వెళదాం పదండి.;

Wednesday, 23 December 2015

కాఫీతో కేన్సర్ దూరం

సాధారణంగా కాఫీ తాగితే మూడ్స్ మెరుగుపడి… కాస్తంత రిలాక్స్‌గా ఉంటుందని మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే, కాఫీ అతిగా తాగితే నానా ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందువల్ల మితంగా మాత్రమే కాఫీ సేవనం కావించాలని వైద్య నిపుణులు చేసే హెచ్చరికలూ మనకు తెలుసు. అయితే, కాఫీ తాగే వారు ఇవేమీ పట్టించుకోనక్కర్లేదు. మూడ్ బాగా లేకపోయినా, తలనొప్పిగా ఉన్నా మొహమాటం లేకుండా కాఫీ సేవించవచ్చు. ఎందుకంటే కాఫీ తాగితే కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
ముఖ్యంగా.. రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగే వారికి కేన్సర్ సోకే అవకాశాలు మిగిలిన వారితో పోలిస్తే 30 శాతం తక్కువగా ఉంటాయని ఇంగ్లండ్ పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ సేవనంపై తమ పరిశోధన సారాంశాన్ని వారు ‘న్యూ ఇంగ్ల్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో పొందుపరిచారు.

వాటిని వాడడం వల్ల కేన్సర్ రాదు

మనం ప్రతి క్రమం తప్పకుండా వాడుకుంటున్నా మొబైల్ ఫోన్ల్, అలాగే సెల్ టవర్స్ వల్ల కేన్సర్ వ్యాధి కారణం కాదని… అది ఒట్టి అపోహలు మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెల్ ఫోన్ రేడియేషన్ తో కేన్సర్ వస్తుందని కొన్ని పరిశోదనల్లో తేలినా.. అధి విస్తృతమైన శాంపిల్స్ ను పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు.

మరోవైపు కేన్సర్ చికిత్సలో కూడా ఎప్పటికప్పుడు కొత్త చికిత్స పద్ధతులు తెరపైకి వస్తున్నాయని నిపుణులు తెలిపారు. కేన్సర్ పేషెంట్లు ఎప్పటికప్పుడు ఆధునిక వైద్య పద్ధతుల గురించి తెలుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  కేన్సర్ చికిత్స విధానంలో రొబెటిక్ సర్జరీ అనే అధునిక పద్దతి వచ్చిందన్నారు. రొబెటిక్ సర్జరీతో కేన్సర్ రోగికి పెద్దగా నొప్పి తెలియదని చెప్పారు.

Tuesday, 22 December 2015

కేన్సర్ ఖేల్ ఖతం

కేన్సర్‌ నిర్మూలనకు రకరకాల చికిత్సలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నది మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఒక్క టీకాతో కేన్సర్‌ను చంపిపారేయొచ్చని ఓ డాక్టర్‌ తన పరిశోధనలో వెల్లడించారు. తాజాగా ప్రోస్టేట్‌ కేన్సర్‌ను నిరోధించే సరికొత్త ఆవిష్కరణను ఆసే్ట్రలియా పరిశోధకులు కనుగొన్నారు. ప్రోస్టేట్‌ కేన్సర్‌ కణాల పెరుగుదలకు కారణమైన గ్లుటామైన్‌ను పంపిణీ చేసే నాళాల(పంపు)కు అడ్డుకట్ట వేస్తే.. కేన్సర్‌ కణాలు ఆకలితో అలమటించి చనిపోతాయని సిడ్నీ సెంటెనరీ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకుడు జెఫ్‌ హోల్ట్స్‌ తెలిపారు.

ప్రస్తుతం సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి అదేపనిలో ఉన్నామన్నారు. కాగా, అండాశయ కేన్సర్‌లో కీమోథెరపీ చికిత్స ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో.. అసలు పనిచేస్తుందో లేదో తెలుసుకునే జీవసూచిక బయోమార్కర్‌ ను భారత సంతతికి చెందిన మాధురీ కోటి కనుగొన్నారు. కెనడా క్వీన్స్‌ యూనివర్సిటీలో ప్రస్తుతం ఆమె పనిచేస్తున్నారు.

తక్కువ ఖర్చుతో కేన్సర్‌ గుర్తింపు

కేన్సర్‌ సాధారణoగా ఏ భాగంలోనైనా వచ్చేఅవకాశం వున్నది.కేన్సర్‌ నిర్ధారణ అనేది అంత తేలికగా పూర్తైయ్యే ప్రక్రియ కాదు.ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అంటారు. అదీకాకుండా కేన్సర్‌ను మొదటి దశల్లో గుర్తించడం అనేది కూడా కష్టమైందే. అందుకు ప్రస్తుతం బయాప్సీ ద్వారా కేన్సర్‌ నిర్ధారణ చేస్తున్నారు.ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో ప్ర్యత్యామ్నాయాన్ని రూపొందించినట్లు తెలిపారు. అదీ అన్నవాహిక కేన్సర్‌ నిర్ధారణకు చేసే ఖరీదైన బయాప్సీకి మరో విధానమని వారంటున్నారు.

రైస్‌యూనివర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తల బృందంలో ఓ భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం అన్నవాహిక కేన్సర్‌ నిర్ధారణకు వైద్యులు అనుసరిస్తున్న ఎండోస్కోపిక్‌ స్క్రీనింగ్‌ కాస్త ఖర్చుతో కూడుకున్నది.ఇప్పుడు తయారుచేసిన  మైక్రోఎండోస్కోపిక్‌ పరికరం తక్కువ ఖర్చుతో కేన్సర్‌ జాడలను ఖచ్ఛితంగా గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు అoటున్నారు. దీంతో 147 మందిని పరీక్షించి చూసి సత్ఫలితాలను సాధించామని వారంటున్నారు. దీని వల్ల కేన్సర్‌ భయంతో -అవసరం లేకున్నా జరిపే బయాప్సీలను 90 శాతం తప్పించవచ్చని ఈ పరిశోధనకు సహ నేతృత్వం వహిచిన డాక్టర్‌ షర్మిల ఆనందసభాపతి వివరించారు.

Monday, 21 December 2015

బ్రెస్ట్‌ కేన్సర్‌ కేరాఫ్‌ బెంగళూరు

బ్రెస్ట్‌ కేన్సర్‌కు కేరాఫ్‌ అడ్రస్సుగా బెంగళూరు మారింది. అవును ఐటిసిటీగా ఖ్యాతిగాంచిన బెంగళూరులో బ్రెస్ట్‌ కేన్సర్‌ కూడా వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటి కలను మోగిస్తోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చికు అనుబంధంగా నడుస్తున్న పాపులేషన్‌ బేస్డ్‌ కేన్సర్‌ రిజిష్ట్రీ  ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. భారతదేశంలోని మొత్తం 11 ప్రముఖ నగరాల్లో ఈ సర్వేను నిర్వహించగా మొదటిస్థానం బెంగుళూరుదే.
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చికి అనుబంధంగా పనిచేస్తున్న పాపులేషన్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ సంస్థ 2013 ఏడాదికిగాను తన సర్వే నివేదికను ఇటీవల వెల్లడిం చింది. బెంగళూరుతో పాటు ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, భోపాల్‌, తిరువనంతపురం, చెన్నై, నాగపూర్‌, కోల్‌కత్తా, కొల్లం, పూణె నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన విషయాల ప్రకారం బెంగళూరు నగరంలో ప్రతి లక్షమంది జనాభాకు 36.5 బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ జాబితాలో 35.1 బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులతో తిరువనంతపురం రెండవస్థానంలో
ఉండగా, 32.6 కేసులతో చెన్నై 3వ స్థానంలో నిలిచింది. 23.3 కేసులతో చివరిస్థానంలో పూణె ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లతో ముప్పు : పదేళ్ళ క్రితం వరకు సాధారణంగా మహిళల్లో బ్రెస్ట్‌ కేన్సర్‌ ప్రమాదం ఎక్కువగా 45-55 ఏళ్ళ మధ్యన ఉండేది. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం 35-45 మధ్యకు తగ్గిపోయింది.

చుక్క రక్తంతో కేన్సర్‌ గుర్తింపు!


finger-blood

కేవలం ఒక చుక్క రక్తంతో కేన్సర్‌ను సులభంగా కనుగొనే సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిద్వారా అది ఏ విధమైన కేన్సర్‌, శరీరంలో ఏ ప్రదేశంలో ఉందో కచ్ఛితంగా తెలుసుకోవచ్చని వారు తెలిపారు. అమెరికాలోని ఉమే యూనివర్సిటీ, నెథర్లాండ్స్‌ పరిశోధకులు సంయుక్తంగా 283 మంది రక్తకణాల నమూనాలను ఈ నూతన పరీక్ష ద్వారా పరీక్షించారు.

ఇందులో 228 మందికి వివిధ రకాల కేన్సర్‌లతో బాధపడుతున్నారని తేలింది. మిగిలిన 58 మందికి ఎటువంటి కేన్సర్‌ లక్షణాలు లేవని నిర్ధారణ అయింది. ఈ అధ్యయనంలో అన్ని రకాల కేన్సర్‌లను గుర్తించగలిగామని ఉమే వర్సిటీ శాస్త్రవేత్త జోన్స్‌ నీల్సన్‌ తెలిపారు. కేన్సర్‌ ప్రారంభదశలో గుర్తించడం చాలా ముఖ్యమన్నారు.

Sunday, 20 December 2015

కేన్సర్ వ్యాధికి బ్యాడ్ లక్కే కారణం

10 కేన్సర్ రావడానికి దురదృష్టమే కారణమట. అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ కిమ్మెల్ కేన్సర్ సెంటర్ పరిశోధకులు ఈ విషయం చెబుతున్నారు! చాలా రకాల కణజాలాల్లో కేన్సర్ రావడానికి, వృద్ధికి కారణాలపై వారు పరిశోధన చేశారు. పెద్దల్లో కేన్సర్ రావడానికి మూడింట రెండు వంతుల కారణం ‘దురదృష్ట’మేనని, మిగతా ఒక వంతు మాత్రమే వాతావరణ, అనువంశిక కారణాలని తేల్చారు!

కణాల్లోని జన్యువులు ఉత్పరివర్తనం చెంది కేన్సర్‌కు దారితీసే పరిస్థితులపై మోడల్‌ను రూపొందించినట్లు చెప్పారు. కణ విభజన జరిగే క్రమంలో జన్యువుల్లో ఒక్కసారిగా ఉత్పరివర్తనాలు చోటుచేసుకునే అవకాశముందని.. అది కేన్సర్‌కు కారణమవుతుందని తెలిపారు. అయితే ఇలాంటి ఉత్పరివర్తనాలకు పొగాకు, ఆల్కాహాల్ వంటి పదార్థాలు కారణమవుతాయన్నారు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగించినా కొందరు కేన్సర్ బారిన పడకుండా ఉంటారని అన్నారు.

కేన్సర్ నిర్మూలించే ఫలం ....

                        
హనుమంతుని ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు. ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిగాయి. 


కేన్సర్ వ్యాధినుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు. . తమిళనాడు దిందిగుల్ జిల్లాలో కొన్ని తెగలు చర్మవాధికి ఒక నెల వరకూ హనుమంతుని ఫల ఆకులను స్త్రీ మూత్రంతో ముద్దగా చేసి చర్మానికి పూసుకుంటారు . 

ఆలుగడ్డలతో జీర్ణాశయ కేన్సర్ దూరం

కూరగాయలతో కేన్సర్ ముప్పు నుంచి జయించవచ్చని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ముఖ్యంగా ఆలు గడ్డలతో జీర్ణాశయ కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చని వారు వెల్లడించారు. బీజింగ్‌లోని జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు.

ముఖ్యంగా పళ్లు, ఆకుపచ్చ, పసుపు రంగు కూరగాయల వల్ల జీర్ణాశయంలో ఒక రక్షణ పొర ఏర్పడుతుందని, వీటితో పాటు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి జీర్ణాశయంలో ఒత్తిడిని తీవ్రంగా తగ్గిస్తుంది చెప్పారు. ప్రధానంగా ఆలుగడ్డ వంటి తెలుపు రంగు కూరగాయలతో ఈ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.

భారత్ లో పెరుగుతున్న కేన్సర్ కేసులు

ప్రపంచంలో కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్యను చూసినప్పుడు, ప్రతి 13వ కొత్త కేన్సర్ కేసు భారతదేశం నుంచి నమోదవుతోందని అమెరికాకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారతదేశంలో క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.
 
భారతదేశంలో సుమారు 1.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని చెప్పారు. ఈ కేసుల్లోనూ ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్, సర్వికల్ కేన్సర్, ఓరల్ కేన్సర్ అగ్రభాగాన ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే నయం చేయడం సాధ్యమేనని చెప్పారు.

Friday, 18 December 2015

ఆ పొగతో కేన్సర్ ముప్పు?



agarbatti_apduniaసిగరెట్ పొగతోనే కాదు..ఇప్పుడు మరో దానితోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే. సిగరెట్ పొగతో క్యాన్సర్ వస్తుందని తెలిసిందే. అదే కాదు.. ఇళ్లల్లో వెలిగించే అగరొత్తుల పొగకూడా ఆరోగ్యానికి హానికరమేనట. చక్కని వాసనతో మనసుకు ప్రశాంతత కలిగిస్తుందని అగరబత్తీల పొగను పదే పదే పీలిస్తే… కేన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆ పొగ ఊపిరితిత్తులలోకి ప్రమాదకరమైన రసాయనాలను చేరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అగరుబత్తీలు, వాటి నుంచి వెలువడే పొగతో కలిగే పరిణామాలపై తొలిసారి చైనా పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.
అగరొత్తుల పొగలో మొత్తం 64 రకాల రసాయనాలు ఉన్నట్లు తేల్చారు. వీటిలో చాలా మటుకు హానికరం కాకపోయినా.. కొన్ని మాత్రం కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని సౌత్ చైనా వర్సిటీ పరిశోధకుడు రోంగ్ జో వివరించారు. అగరబత్తీల నుంచి వచ్చే పొగతో పాటు గాలిలో కలిసిన రసాయనాలు ఊపిరితిత్తులలోకి చేరి వాపునకు దారితీస్తాయని, దీంతో ఊపిరితిత్తుల కేన్సర్, చైల్డ్ హుడ్ లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్ కు కారణమవుతుందని వారు తెలిపారు.

సెల్ ఫోన్‌తో కేన్సర్


 
 
 
 
 
 
Rate This

Cell phone usage

ప్రపంచం మొత్తం ఇష్టంగా వాడుతున్న సెల్ ఫోన్‌తో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఈ విషయం నిర్ధారించడానికి సంస్ధ ప్రత్యేక పరిశోధనలేవీ చేయనప్పటికీ ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్ధలు చేసిన పరిశోధనలను క్రోడీకరించిన డబ్ల్యు.హెచ్.ఓ సెల్ ఫోన్ ని అతిగా వాడ్డం వల్లా, చెవికి దగ్గరగా పెట్టుకుని వాడడం వలనా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రమాదానాన్ని నివారించడానికి సెల్ ఫోన్‌ని చెవి దగ్గరగా కాకుండా హేండ్స్ ఫ్రీ సెట్ వాడాలని లేదా టెక్ట్సు మెసేజ్‌లపై ఆధారపడాలని సంస్ధ సలహా ఇచ్చింది.
సెల్ ఫోన్లలో వాడే పదార్ధాల నుండి రేడియేషన్ వెలువడుతుందనీ, ఇవి మెదడు కణాల డి.ఎన్.ఏ లతో చర్య జరపడం వలన మ్యుటేషన్ జరిగే అవకాశాలున్నట్లుగా గతంలో కొన్ని సంస్ధలు పరిశోధన చేసి ప్రకటించాయి. మ్యుటేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే కణాలే కేన్సర్ కణాలనీ సేల్ ఫోన్ వాడకం పెరిగే కొద్దీ ఈ కణాల విస్తరణ పెరిగి కేన్సర్ వ్యాధి సంక్రమిస్తుందనీ పరిశోధనలు తెలిపాయి. కొన్ని పరిశోధనలు సెల్ ఫోన్ ల వలన ఎట్టి ప్రమాదం లేదనీ శుభ్రంగా వాడుకోవచ్చని కూడా ప్రకటించిన సందర్భాలున్నాయి. పరిశోధన నిర్వహించిన స్వతంత్ర పరిశోధనలన్నీ కేన్సర్ ప్రమాదాన్ని హెచ్చరించడం గమనార్హం.

Thursday, 17 December 2015

తెల్ల కూరగాయలతో కేన్సర్ హాంఫట్


tella kuragaayalato kensar haamfat ఇన్నాళ్లుగా ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలతో కూడిన ఆహారం తింటే నిండు నూరేళ్ల జీవితానికి మాదీ గ్యారంటీ అని ఆహార పరిశోదనా నిపుణులు టముకు వాయించేవారు. కానీ ఇప్పుడు తెల్ల కూరగాయలను ఆహారంలోకి తీసుకుంటే పొట్ట కేన్సర్‌ని అవి మీ దరిదాపుల్లోకి కూడా రానీయవని మరో హామీ ఇచ్చేస్తున్నారు. ఈ గొప్ప సత్యాన్ని కనుగొన్నది జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన చైనా శాస్త్రవేత్త. ఈ కొత్త అధ్యయనం ప్రకారం కాలిఫ్లవర్, ఆలుదుంపలు, ఉల్లిపాయలను తీసుకుంటే పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని పూర్తిగా అదుపు చేస్తాయని తేలింది. కానీ బీరు, మత్తుపానీయాలు, ఉప్పు, నిల్వచేసిన ఆహార పదార్థాలను తిన్నట్లయితే కేన్సర్ వచ్చే అవకాశం మెండుగా ఉందంటూ ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. బ్రిటన్‌లో ప్రతి రోజూ పొట్ట కేన్సర్ వ్యాధి కనీసం 13 మంది రోగులను బలి తీసుకొంటోందని, ఈ వ్యాధి వచ్చిన వాళ్లు పదేళ్ల కాలంలో 85 శాతం మంది మృత్యుముఖంలోకి వెళుతున్నారని కనుగొన్నారు. 

మరో తెల్ల కూరగాయ అయిన క్యాబేజీకి కూడా కేన్సర్‌ని అదుపు చేసే శక్తి ఉందని చెబుతున్నారు. తెల్ల రంగులోని కూరగాయలన్నింటిలో సీ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది పొట్టలో కణజాల ఒత్తిడికి వ్యతిరేకంగా యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతి రోజూ 50 గ్రాముల వరకు తీసుకున్నట్లయితే పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని 8శాతానికి తగ్గిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి రోజూ వంద గ్రాముల పళ్లను ఆహారంగా తీసుకుంటే పొట్ట కేన్సర్‌ని 5 శాతానికి తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

కేన్సర్‌ కణితిపై నేరుగా దాడిచేసే 'బయోజెల్‌'




  కేన్సర్‌ను సమర్ధంగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా బయోజెల్‌ను త యారుచేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శరీరంలో సహజంగా తయారయ్యే టి లింపోసైట్లకు దన్నుగా ఈ జెల్‌ను లింపోసైట్లను కృత్రిమంగా తయారు చేసేలా తయారుచేశారు. ఈ బయోజెల్‌లో యాంటీ కేన్సర్‌ ఏజెంట్లను పొందుపరిచి శరీరంలోకి ఇంజెక్ట్‌ చేయవచ్చన్నారు. ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది నేరుగా కేన్సర్‌ కణితిని చేరుకుంటుందని చెప్పారు. 
 
ఆపై ఇందులోని యాంటీ కేన్సర్‌ ఏజెంట్లు కణితిపై దాడి చేసి కేన్సర్‌ కణాలను నిర్మూలిస్తాయని వారు వివరించారు. బయోజెల్‌ను ఇప్పటికే లేబ రేటరీలో పరీక్షించి సంతృప్తి చెందినట్లు మాంట్రియల్‌ వర్సీటీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ సరికొత్త బయోజెల్‌ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో, శరీర ఉష్ణోగ్రత వద్ద జెల్‌గా మారుతుందన్నారు. ప్రస్తుతం కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మందులు తొలుత రక్తప్రవాహంలోకి చేరి అక్కడినుంచి శరీరం మొత్తాన్ని చుట్టివస్తాయి. ఆపై కేన్సర్‌ కణితిపై దాడి చేస్తాయన్నారు. అయితే, తాజాగా అభివృద్ధి చేసిన ఈ తెలివైన జెల్‌ శరీరంలోకి వెళ్లీవెళ్లగానే నేరుగా కేన్సర్‌ కణితి వద్దకు వెలుతుందని చెప్పారు. 

Wednesday, 16 December 2015

కొడుకు కేన్సర్ బాధతో.. ఆ హీరో పుస్తకం!

imran-hasmi
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు రచయితగా మారబోతున్నారు. దానికి కారణం రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్ లో ఆయనకు కలిగిన పెయిన్. ఇమ్రాన్ కేన్సర్ తో బాధపడుతున్న తన ఐదేళ్ళ కొడుకు ఆర్యన్ ను చూసి చలించిపోయి ఒక పుస్తకం రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ పుస్తకంలో ఇమ్రాన్ కేన్సర్ పై పోరాటం గురించి రాయనున్నారు.
    36 ఏళ్ళ ఇమ్రాన్ తొమ్మిదేళ్ళ క్రితం పర్వీన్ షహానీని వివాహం చేసుకోగా.. వీరి ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్ కేన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాధి తొలి దశలో ఉండగా.. ఆర్యన్ చికిత్స పొందుతున్నాడు. ఈ నేపధ్యంలో ఇమ్రాన్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా.. ‘నా జీవితంలో గత రెండేళ్లుగా కష్టాలు చవిచూస్తున్నా. ఇద్దరు గొప్ప గురువులను గుర్తించా. వారిద్దరూ కేన్సర్, నా కొడుకు. నాకెదురైన ఆనుభవాలపై ఓ పుస్తకం రాయబోతున్నా’ అని తెలియజేశారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ బుక్స్ ఇండియా ప్రచురించనుండగా.. వచ్చే ఏడాది విడుదల కావొచ్చని భావిస్తున్నారు.

ప్రసూతి మరణాలు కన్నా కేన్సర్‌ మరణాలే అధికం



ప్రసూతి మరణాల కంటే వివిధ కేన్సర్లతోనే మహిళలు అధికంగా చనిపోతున్నారని, దేశంలో ఏటా లక్షా 23 వేల కేన్సర్‌ కేసులను గుర్తిస్తే, వీరిలో దాదాపు 66 వేల మంది బ్రెస్ట్‌, గర్భాశయ  కేన్సర్లతో చనిపోతున్నారని అసోసియేషన ఆఫ్‌ గైనకాలజిక్‌ అంకాలజిస్టు ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. గర్భాశయ కేన్సర్లు తగ్గుతున్నప్పటికీ బ్రెస్ట్‌ కేన్సర్లు పెరుగుతున్నాయని, ఈ రెండు కేన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చని ఈ సంఘం పేర్కొంది.


            శారీరకంగా బరువు పెరగడం వల్ల రొమ్ము కేన్సర్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రాత్రివేళల్లో ఉద్యోగాలు, గాలి వెలుతురు పరిమితంగా ఉన్న ఆఫీసుల్లో పనిచేయడం, ఏది పడితే అది తినడం.. తదితర కారణాల వల్ల హార్మోన్లలో సమతుల్యం దెబ్బతింటుందని  వివరించారు. లేటు వయసు పెళ్లి చేసుకోవడం, లేటు వయసులో పిల్లల్ని కనడం వల్ల కూడా బ్రెస్ట్‌ కేన్సర్లకు గురయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో ప్రతి 1000 మందిలో 8 మంది కేన్సర్‌ బారిన పడుతుండగా, పట్టణాల్లో ఈ సంఖ్య 30గా ఉందన్నారు.

చికెన్‌ తింటే కేన్సర్‌ వస్తుందా?



చికెన్‌ తింటాం…చాలా బాగుంటుంది. మంచిగా వండితే దీనంతటి రుచికరమైన కూర ఇంకొకటి లేదుమరి! అయితే చికెట్‌ తింటే కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని మీకు తెలుసా? ఇది నిజం! చికెన్‌ తింటే కేన్సర్‌ అనేది ఏదో ఒక రూపేణా వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దానికి కారణమేమిటేంటే, కోడిమాంసంలో కేన్సర్‌ వ్యాధికి కారకమయ్యే ‘ఆర్సనిక్‌’ అనే విషపూరితమైన రసాయనం వుంటుంది. ఈ రసాయనమే కేన్సర్‌కు కారణమవుతుంది. ఈ విషయాన్ని ఎఫ్‌డిఎ (అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌)ను ఉటంకిస్తూ అసోసియేటెడ్‌ ప్రెస్‌ న్యూస్‌ ఏజెన్సీ ఒక కథనాన్ని ప్రచురించింది.


ప్రపంచంలో చికెన్‌ తినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. భారత్‌లో 10 శాతం మినహాయిస్తే దాదాపు అందరూ చికెన్‌ తింటారు. ఆర్సనిక్‌ అనేది ఒక విషపూరితమైన రసాయన పదార్థం. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి కోడిలోనూ ఇది కచ్చితంగా వుంటుంది. ఎందుకంటే ఈ కోళ్ళు స్పీడ్‌గా ఎదగడానికి ఇచ్చే మందులతో ఆర్సనిక్‌ మరింత శక్తివంతమవుతుంది. దీంతో కేన్సర్‌ కలిగించే ఈ రసాయన కణాలు కూడా పెరుగుతాయి. తద్వారా చికెన్‌ తిన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరంలో ఎర్రరక్తకణాలను ఇవి తినేస్తాయి. అదన్నమాట సంగతి! అందుకే చికెన్‌ తినేటప్పుడు కాస్త ఆలోచించి తినండి!

త్వరలో కేన్సర్ వ్యాధికీ మాత్రలు


భవిష్యత్తులో కేన్సర్ వ్యాధిని కూడా పూర్తిగా మాత్రలతో నివారించడానికి వీలు కాబోతోంది. ఇది నిజంగా కేన్సర్ రోగులకు  శుభవార్తే. ఈ మహమ్మారి సోకిందని ఆందోళన చెందాల్సిన అగత్యం ఉండకపోవచ్చు. బీపీ, షుగర్ మాదిరిగానే కేన్సర్ వ్యాధిని కూడా అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హైదరాబాద్ నగరంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఈ రకం మందులు ఇప్పటికే కొన్ని మార్కెట్లో ప్రవేశించాయని చెప్పారు. మరో అయిదేళ్ళలో మరికొన్ని కూడా రాబోతున్నాయని ఆయన తెలిపారు.

ఈ రకం మాత్రలపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు పూర్తి చేశారని, ఇక భారతీయ మార్కెట్లోకి రావడమే మిగిలి ఉందని ఆయన చెప్పారు. మరో నాలుగైదు ఏళ్ల  తరువాత కీమొథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల కన్నా పూర్తిగా మాత్రల సహాయంతో దీన్ని నియంత్రించ వచ్చనీ, ఈ వ్యాధికి భయపడాల్సిన అవసరం ఉండదనీ, ఇక ఇది ప్రాణాంతకం కాకపొవచ్చనీ ఆయన చెప్పారు.  కణాలపై కేన్సర్ కారకాలు పడకుండా ఈ మాత్రలు పనిచేస్తాయని ఆయన వివరించారు.

Monday, 14 December 2015

కేన్సర్‌ మరణాల్లో సగం కొనితెచ్చుకునేవే!



పన్నెండు రకాల కేన్సర్లు.. ఒక్క అమెరికాలోనే లక్షా అరవై ఏడు వేల మరణాలు. కారణం మాత్రం ఒక్కటే! పొగత్రాగడం వల్ల కలిగే దుష్పరిణామాలే ఇవన్నీ.. అమెరికాలో ఏటా కేన్సర్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు సగంమంది ఊపిరితిత్తులు, శ్వాసనాళం, స్వరపేటికకు సంబంధించిన కేన్సర్లతోనే పోతున్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. వీటిలో చాలా మరణాలు ‘కొని’తెచ్చుకున్నవేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అట్లాంటాలోని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సిగరెట్‌ పొగ వల్ల 12 రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

 ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్‌ మొదటిది, ముఖ్యమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2011 ఏడాదిలో అమెరికా వ్యాప్తంగా పలు రకాల కేన్సర్లతో మరణించిన వారి సంఖ్య 3.5 లక్షలు కాగా అందులో 1.67 లక్షల మరణాలకు సిగరెట్‌ పొగే కారణమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన రెబెక్కా సీగల్‌ వివరించారు. ఈ గణాంకాలు కేవలం పొగరాయుళ్లవేనని, వారు వదిలే పొగతో కేన్సర్‌ బారిన పడ్డ వారిని లెక్కలోకి తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు వాడకంపై చైతన్యం తీసుకొచ్చే దిశగా ఎంతో చేయాల్సి ఉందని తెలిపారు.

తల్లిపాలతో కేన్సర్ దూరం



బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై జరిపిన ఒక అధ్యయనంలో ఈ క్యాన్సర్‌ బారిన ఎక్కువగా కోస్తాంధ్రలోని మహిళలు గురవ్ఞతున్నట్టు తేలింది. దీనికి కారణం ప్రొటీన్లు, ఖనిజాలు, లోపమే అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఈ ప్రాంతాల్లో సెర్వికల్‌ క్యాన్సర్‌ బారిన కూడా ఇక్కడ మహిళలు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వారు అనుమానిస్తున్నారు. బ్రెస్ట్‌క్యాన్సర్‌ బ్రెస్ట్‌లో టిష్యూ కారణంగా వస్తుంది. కాని కొన్ని కేసుల్లో ఆస్ట్రోజెన్‌ రిసెప్టర్‌, ప్రొజెస్టిరాన్‌ రిసెప్టర్‌ నెగిటివ్‌గా ఉండడంతో హార్మోన్‌ థెరపీ ప్రభావితం కావటం లేదు. అలాగే బయోమార్కర్‌ హెర్‌2, న్యూ కూడా నెగటివ్‌ ఉంటే హెర్‌సెప్టిన్‌ డ్రగ్‌ థెరపీ కూడా ప్రభావితం కావటం లేదు.


గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించేసరికి వారు 3, 4 స్టేజులలో ఉంటున్నారని, అందువల్ల వారిని కాపాడలేకపోతున్నామని నిపుణులు తెలిపారు. ఐహెచ్‌సి చేసిన పరిశోధనలో 52మంది పేషంట్ల ను పరిశీలించగా వారిలో ఎక్కువ మందికి రెండు సెంటీమీటర్ల ట్యూమర్‌ని కనుగొంటున్నారు. అది కూడా చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంటుంది. ఇది ఎక్కువగా 45 సంవత్సరాలు వయస్సు గల మహిళల్లో కనబడుతుంది. 95శాతం మహిళలకు ఒకరే సంతానం ఉంటున్నారు. బిడ్డలకు పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Friday, 11 December 2015

రేడియేషన్ థెరపీ రకాలు

రేడియేషన్ థెరపీని రెండు రకాలుగా ఇస్తారు. లోపల్నుంచి, బయట్నుంచి. ఎక్కువ మంది కేన్సర్ రోగులకు బైట నుంచి ఎక్కువ శక్తిగల ఎక్స్ రే కిరణాలను కేన్సర్ జబ్బు ఉన్న ప్రదేశంలోకి, చుట్టూ ఉన్న భాగంలోకి పంపిస్తారు. రేడియేషన్ ఇవ్వడానికి లీనియర్ యాక్సిలేటర్, కోబాల్ట్ మిషన్ వాడతారు. వివిధ యంత్రాలు వివిధ రకాల కేన్సర్ ను నయం చేస్తాయి. ఏ రోగికి ఏ యంత్రం వాడాలో డాక్టర్ నిర్ణయిస్తారు. రేడియేషన్ లో రోగులు రేడియోయాక్టివ్ అయ్యే పరిస్థితి ఉండదు.

        లోపట్నుంచి రేడియేషన్ పద్ధతిలో.. మిక్కిలి శక్తివంతమైన కిరణాల్ని కేన్సర్ ఉన్న భాగాల్లోకి ప్రసరింపజేస్తారు. వాటిని ఆనుకుని ఉండే మామూలు కణజాలం నశించదు. తక్కువ వ్యవధిలో ఎక్కవ శక్తివంతమైన కణాలు పంపడానికి వీలౌతుంది. ఈ చికిత్స జరిగేటప్పుడు రోగుల స్నేహితుల్ని గాని, బంధువుల్ని గాని అనుమతించరు.

Thursday, 10 December 2015

రేడియోధెరపీ చికిత్స - పనితీరు

మామూలుగా జీవకణాలు విభజించబడి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి ఓ క్రమ పద్ధతిలో శరర అవయవాల నిర్మాణానికి సహకరిస్తాయి. జీవకణాలు వాటి పెరుగుదలను అరికట్టలేనప్పుడు కేన్సర్ వ్యాధి పెరుగుతుంది. ఈ అసాధారణ కణాలు త్వరగా విభజించబడి కణముల సముదాయంగా మారి కణతిగా ఏర్పడుతుంది. ఈ కణాలే చుట్టూ ఉన్న అవయవాలు, శరీరభాగాల్లోకి వ్యాప్తి చెందుతాయి.

         కేన్సర్ కణాలు పునరుత్పత్తికి మూలభాగమైన డీఎన్ఏను రేడియేషన్ ద్వారా చంపగలుగుతున్నాము. అవి చచ్చిపోయినందువల్ల అవి విభజించబడవు. ఆ విధంగా వాటి పెరుగుదల ఆగిపోయి కణితి కుచించుకుపోతుంది. త్వరగాను, అతిగాను పెరిగే కణాల మీదే రేడియేషన్ బాగా పనిచేస్తుంది.

Tuesday, 8 December 2015

ఎముకల కేన్సర్ తో ప్రమాదం

ఆస్టియో సర్కోమా అనేది ఎముకల్లో ప్రారంభమై.. వాటి చుట్టూ ఉన్న సున్నిత టిష్యూల్లోకి అత్యంత వేగంగా వ్యాపించే భయంకరమైన వ్యాధి. ఎముకల్లో నీలి రంగులో వచ్చే సాధారణ కేన్సర్లలో ఇది రెండో రకం. ఎముకలకు సంబంధించిన అపాయకరమైన ట్యూమర్లలో ఇది 15 శాతం కలిగి ఉంటుంది. ఆస్టియో సర్కోమా ముఖ్యంగా పురుషుల్లో 30 ఏళ్ల లోపు సోకుతుంది. ఇది ఐదేళ్ల లోపువారికి, నలభై ఏళ్లు పైబడ్డవారికి రావడం అరుదు.

            ఆస్టియో సర్కోమా రకరకాలుగా కనబడుతుంది. మెడికల్, రేడియాలజీ పరీక్షల్లో భిన్నంగా దర్శనమిస్తుంది. మోకాలి కీలు చుట్టూ కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. తొడ ఎముక కింది భాగాన కానీ, కాలి ఎముక పైభాగంలో కానీ వస్తుంది. దీని ప్రాథమిక లక్షణం నొప్పి. నొప్పి క్రమంగా పెద్దదై పిల్లలకు జ్వరం వస్తుంది. పిల్లలు క్షీణించిపోతుంటారు. గుర్తించడంలో ఆలస్యం చేస్తే ఎముకలకు ప్రమాదం.

Friday, 4 December 2015

రొమ్ము కేన్సర్ కు కారణాలు అనేకం

అనేకమంది మహిళల్ని వేధిస్తున్న సమస్యల్లో రొమ్ము కేన్సర్ ప్రదానమైనది. ఈ కేన్సర్ 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అంతకు తక్కువ వయసున్న స్త్రీలలో ఈ కేన్సర్ రాదన్న నియమం లేదు. ఇది యువతులకు కూడా వచ్చే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. మన దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో 50 మందికి రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

           పాశ్చాత్య దేశాలైన స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, డెన్మార్క్, యుగోస్లావియా, ఇజ్రాయెల్ లో రొమ్ము కేన్సర్ బాగా ఎక్కువ. రొమ్ము కేన్సర్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఎవరికీ తెలియవు. వయసు మళ్లిన స్త్రీల్లో సంతానం కలగడం, అధిక సంతానం, పిల్లలకు స్తనమివ్వకపోవడం, రేడియేషన్ కు ఎక్కువగా లోనుకావడం, ఈస్ట్రోజన్ హార్మోన్ల వాడకం తదితర కారణాల వల్ల రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉంది.

Thursday, 3 December 2015

విటమిన్ లోపాలతో అనారోగ్యం

విటమిన్లు మన శరరంలో రోగ నిరోదక శక్తి పెంచేందుకు సహకరిస్తాయి. విటమిన్లు తగిన పాళ్లలో తీసుకోకపోతే.. అనారోగ్యం వచ్చి.. అదే తర్వా కేన్సర్ గా మారే ప్రమాదముంది. విటమిన్లు రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి శరీరం వీటిని నిల్వ చేసుకునే విధాన్ని బట్టి.. కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు అని చెబుతారు. ఏ,డీ,ఈ,కే విటమిన్లు కొవ్వులో కరుగుతాయి. బీ-కాంప్లెక్స్, సీ విటమిన్లు నీటిలో కరుగుతాయి.

             శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే వివిధ రకాల విటమిన్లు రెండు రకాలుగా లభిస్తాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పదార్థాలు మొదలైనవి విటమిన్లు లభించే ప్రకృతి సిద్ధ వనరులైతే కృత్రిమంగా రూపొందించిన సప్లిమెంట్ల ద్వారా కూడా వీటిని పొందే అవకాశం ఉంది. ఈ విటమిన్ల కోసం సాధ్యమైనంత వరకు ప్రకృతి వనరులపై ఆధారపడటం ఉత్తమం.

Wednesday, 2 December 2015

కేన్సర్ ను నివారించే పోషకాహారం-2

ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకపదార్ధాలు అందవు. కనుక రకరకాల పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం మంచిది. మసాలాలు వేసిన ఆహారం ఎంత రుచిగా ఉన్నా.. దానికి జోలికి పోకుండా ఉండటం ఉత్తమం. మసాలా వంటకాలు కేన్సర్ ను పెంచుతాయి. మితంగా తీసుకునే కూరగాయల భోజనం కేన్సర్ ను తగ్గిస్తుంది.

                  భోజనం తర్వాత పండ్లు తీసుకోవడం పాశ్చాత్యుల సంస్కృతి అని కొందరి భావన. కానీ ఇది తప్పు పండ్ల ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించారు. పచ్చటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మంచిది. పండ్లు, కూరగాయలు తీసుకుంటే ధాన్యంలో నష్టపోయిన పోషక విలువలు లభ్యమౌతాయి. మత్తుపానీయాలు, ధూమపానం కాలేయ కేన్సర్ కు దారితీస్తాయి. కాబట్టి అవి కూడా మానేయాలి.

Tuesday, 1 December 2015

కేన్సర్ ను నివారించే పోషకాహారం

పండ్లు, కూరగాయల్లో పోషకాహారం కేన్సర్ ను తగ్గిస్తుంది. కేన్సర్ రాకుండా చూసుకోవడానికి పప్పుధాన్యాలు, బార్లీ, గోధుమ, పండ్లు, కూరగాయలు ఎక్కువగా వాడాలి. ఇలాంటి ఆహారంతో గర్భాశయ, పిండాశయ, రొమ్ము, పొట్ట, గాలితిత్తి, పురీషనాళములకు వచ్చే కేన్సర్ ను నివారించవచ్చు. పోషక విలువలను బట్టి చూస్తే కొవ్వు పదార్థాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. కొందర పశువుల కొవ్వుతో కూడిన పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటూ.. తర్వాత దుష్పరిమాణాలకు బాధితులు అవుతున్నారు.

                పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్స్ ఉన్న వెజిటబుల్ నూనెలను వాడటం మచిదని అంటున్నారు. కూరగాయల్లో కొన్ని ఎంజైమ్ లు పెంచే విటమిన్లకు కారకమైన కూరగాయలను వాడటం మంచిది. ఈ విధంగా శరీరంలోకి తీసుకునే కొవ్వును తగ్గించి రొమ్ము, పిట్యూటరీ కేన్సర్ ను నివారించవచ్చు.