Saturday, 1 July 2017

తాజా కూరలతో కేన్సర్ దూరంపెద్దల మాట చద్దిమూట అని ఎందుకంటారో.. అప్పుడప్పుడూ సైంటిస్టుల పరిశోధనలు రుజువు చేస్తుంటాయి. చాలా వరకు పరిశోధనల్లో అప్పటిదాకా సామెతలుగా ఉన్న మాటలే నిజమౌతాయి. ఎందుకంటే తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివని ఎప్పట్నుంచో మన పెద్దలకు నమ్మకం. అందుకే గర్భిణులు, బాలింతలకే కాదు.. అందరూ ఇవి ఎక్కువ తినాలని చెబుతుంటారు. ఇప్పుడు కూడా అదే నిజమని సైంటిస్టులు తేల్చారు.

పండ్లు, కూరగాయలు, చేపలు ఎక్కువగా తింటూ సాఫ్ట్‌ డ్రింక్‌లను తగ్గిస్తే పేగు కేన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ కేన్సర్‌కు కారణం ఆహారంలో ఫైబర్లు లోపించడమేనని టెల్‌ అవీవ్‌ పరిశోధకులు పేర్కొన్నారు. దీంతోపాటు ఆల్కహాల్‌ సేవించడం, కాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం సీఆర్‌సీకి కారణమవుతున్నాయని వివరించారు.

No comments:

Post a Comment