కేన్సర్ ఒక భయంకరమైన, ప్రాణాంతక వ్యాధి కాదని, విటమిన్ బి17 లోపమని ఓ విధమైన వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. బి17 విటమిన్ లభించే ఆహారాన్ని తీసుకుంటే చాలు కేన్సర్ కు దూరంగా ఉండవచ్చన్న అధ్యయనాలూ ఉన్నాయి. ఇది నిజమేనా...? అన్న సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మరి ఆ నిజా నిజాలేంటో పలువురు పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం తెలుసుకుందాం.
బి1, బి2, బి6, బి12 విటమిన్లు గురించి వినే ఉంటారు...మరి బి17 ఎక్కడి నుంచి వచ్చింది...? నిజానికి విటమిన్ బి17 అంటూ ఏదీ లేదు. అమిగ్డాలిన్ నుంచి రూపొందించే లాట్రిలే అనే ఔషధానికి పెట్టిన నామం బి17. చాలా రకాల మొక్కల్లో లభించే విషపూరిత సైనోజెనిక్ గ్లైకోసైడ్ నే అమిగ్డాలిన్ గా పేర్కొంటారు. ఈ అమిగ్డాలిన్ ను మెరుగుపరిచి లాట్రిలేగా మారుస్తారు. శాస్త్రీయ నామం మాండెలో నైట్రిల్ బీటా డీ జెంటియోబయోసైడ్. దీన్నే నైట్రిలోసైడ్ గానూ భావిస్తారు. ఇది సైనేడ్ ను కలిగి ఉండే సహజ పదార్థం. ఇది శరీరానికి కావాల్సిన కనీస పోషకమేమీ కాదు. హైడ్రోజెన్ సైనేడ్ ను ఉత్పత్తి చేయడం ద్వారా కేన్సర్ విస్తరణను అడ్డుకుంటుందని కొందరు వైద్యులు సొంతంగా పరిశోధనలు చేసి ప్రకటించారు. కానీ, ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ దీన్ని గుర్తించలేదు.
No comments:
Post a Comment