Tuesday, 29 November 2016

ఎక్కువ మందితో సెక్స్ చేస్తే డేంజ‌ర్‌


మాన‌వ‌జీవితంలో సెక్స్‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది.జీవితంలో డ‌బ్బు ఎంత ఉన్నా శృంగారంలో సంతృప్తి లేక‌పోతే జీవితం ఆనంద‌మ‌యం కాదు. అయితే సెక్స్ గురించి కొన్ని డేంజ‌ర్ విష‌యాలు తాజా సర్వేలో వెల్ల‌డ‌య్యాయి. ఒక‌రి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో త‌ర‌చూ పాల్గొంటూ ఉండేవారికి ముప్పు త‌ప్ప‌ద‌ట‌.లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పూ ఎక్కువేనని  వెల్ల‌డైంది.


        జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా.. 17 ఏళ్లకన్నా ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పు పెరుగుతుందట‌.ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌ శాస్త్రవేత్తల బృందం జ‌రిపిన సర్వేలో ఈ షాకింగ్ మ్యాట‌ర్ తేలింది. ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు. పదివేల మందిని పరీక్షించగా.. లైంగిక చర్యకు ప్రోస్టేట్‌ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని

క్యాన్సర్ వ్యాధికి కూడా లింగ వివక్ష

క్యాన్సర్ వ్యాధికి కూడా లింగ వివక్ష ఉన్నట్లుంది. కాకపోతే పురుషులపై కాస్త మమకారం ఎక్కువేమో. ప్రపంచవ్యాప్తంగా 74 లక్షల మంది పురుషులకు క్యాన్సర్ వ్యాధిరాగా, 66 లక్షల మంది మహిళలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మహిళలకన్నా పురుషులకు ఎక్కువగా ఈ వ్యాధి రావడానికి కారణం ఆహారపు అలవాట్లతోపాటు ధూమ పానం, మద్యపానం కారణమని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఆశ్చర్యకరంగా బాలికలకన్నా కూడా క్యాన్సర్ వచ్చిన బాలలే ఎక్కువగా ఉన్నారు. అందుకు కారణం మాత్రం ధూమపానం, మద్యపానం కాదట. ఎందుకంటే వారికి ఈ అలవాట్లు ఉండవు కనుక.


          పురుషుల్లో ఎక్కువ కాలేయం, వీర్యగ్రంధి, పురీష నాళ క్యాన్సర్లు వస్తుండగా, మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్, కాలేయం, పురీషనాళ క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ వచ్చిన పిల్లలు జీవించే కాలం అభివృద్ధి చెందిన అధికాదాయ దేశాల్లో 80 శాతం పెరిగిందని వైద్య పరిశోధకులు తెలియజేశారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో క్యాన్సర్ బారిన పడిన పిల్లలు కనీసం ఐదేళ్లు జీవిస్తుండగా, పేద దేశాల్లో ఎక్కువ కాలం బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వారంటున్నారు. లైంగిక క్రోమోజోములు అభివృద్ధి చెందేవరకు పిల్లల్లో ఆడైనా, మగైనా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు సమానంగా ఉన్నాయని వారు చెప్పారు.

Monday, 28 November 2016

గోదారి నీళ్లతో కేన్సర్ గ్యారెంటీ


ఒకచోట మంద్రంగా, గంభీరంగా.. ఒకచోట ఉరుకుల పరుగులతో.. పచ్చటి ప్రకృతి గుండా సాగిపోయే వేదమంటి గోదావరి.. క్రమంగా కాలుష్య కాసారంగా మారిపోతోంది. గోదావరి కాలుష్యంలో 18 శాతం మాత్రమే పరిశ్రమల వల్ల వస్తోంది. మిగిలినదంతా ప్రజలు వదిలే వ్యర్థాలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువుల వల్ల జరుగుతోంది.
ఈ ముప్పు నుంచి ప్రజలను కాపాడాలంటే.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సర్వే చేయించాలి. మానవ రహిత విమానాలు, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీలు, వెబ్‌ సెన్సర్‌ బేస్డ్‌ టెక్నాలజీల వల్ల ప్రయోజనం ఉంటుంది.
        
 పచ్చటి పంటలతో అలరారే గోదావరి పరీవాహక ప్రాంతానికి పెనుముప్పు ముంచుకొస్తోంది. స్వచ్ఛమైన జలాలతో ఉరుకుల పరుగులిడే గోదారి తల్లి కాలుష్యకాసారంగా మారిపోతోంద. కాలకూట విషాల్లాంటి పారిశ్రామిక వ్యర్థాలు.. నిండు ప్రాణాలకు మరణశాసనం రాసే ఎరువులు, పురుగుమందుల అవశేషాలు.. ఆ జీవనదిని ప్రాణాలు తీసే విషమయ కాళింది మడుగులా మార్చేస్తున్నాయి. ఫలితం.. పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. కేన్సర్లు పెరిగిపోతున్నాయి.

Saturday, 26 November 2016

ముందే గుర్తిస్తే కేన్సర్ తో నో ప్రాబ్లమ్


బోన్ కేన్సర్లు అంటే అవి కేవలం ఎముకల్లో పుట్టేవి మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇతర భాగాల్లో ఉన్న కేన్సర్లు కూడా ఎముకలకు పాకవచ్చు. అలాగే ఎముకల్లో పుట్టిన కేన్సర్ ఇతర భాగాలకూ పాకవచ్చు . అయితే ఈ కేన్సర్లు అన్నింటికీ చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఒక టుంది. అందుకే ఈ కేన్సర్లను ఎంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే అంత ప్రయోజనం. ఎప్పుడైనా పిల్లలు ఎక్కువ రోజులు కుంటుతూ నడుస్తూ ఉంటే, ఏదోలే అనుకుంటే ఒక్కోసారి ప్రమాదం ముంచుకు రావచ్చు.అప్పుడెప్పుడో దెబ్బ తగిలిన తాలూకు నొప్పే అనుకుంటే అది ఆ తరువాత బాగా ముదిరిపోయిన బోన్ కేన్సర్ కావచ్చు అందుకే ఈ విషయమై ఎంత తొందరగా డాక్టర్‌ను సంప్రదిస్తే, అంత శ్రేయస్కరం.              ఎముకల్లో రెండు రకాల కేన్సర్ కణుతులు వస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ, సెకండరీ బోన్ కేన్సర్స్ అంటూ ఉంటాం. ఎముకల్లో పుట్టేవి ఒక రకమైతే, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టి ఎముకల్లోకి పాకేవి రెండో రకం. అయితే ఎముకల్లో పుట్టే కేన్సర్ కణుతులు తక్కువే కాని. బయట ఎక్కడో పుట్టి, ఎముకల్లోకి విస్తరించేవే ఎక్కువ. నిజానికి అన్ని రకాల కేన్సర్లూ ఎముకలకు పాకవచ్చు.అయితే కొన్నిరకాల కేన్సర్లు ప్రత్యేకించి, ప్రొస్టేట్ కేన్సర్ చాలా వేగంగా పాకుతుంది. అందుకే ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు తేలిన వారికి వెంటనే బోన్ స్కాన్ చేయించడం తప్పనిసరి అవుతుంది. అలాగే కిడ్నీ కేన్సర్, లంగ్ కేన్సర్, థైరాయిడ్ కేన్సర్, రొమ్ముకేన్సర్‌లు కూడా ఎముక లకు పాకే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ కారణంగానే రొమ్ము కేన్సర్‌కు వైద్యచికిత్సలు తీసుకున్న తరువాత కూడా ప్రతి ఏటా బోన్‌స్కాన్ సూచిస్తారు..

Friday, 25 November 2016

లంగ్ కేన్సర్ యమ డేంజర్

 శ్వాసకోశాల కేన్సర్‌ నిర్ధారణ చాలా  క్లిష్టమైనది. ఈ  కేన్సర్‌ లక్షణాలు, క్షయ వ్యాధి లక్షణాలు దాదాపు ఒకేలా ఉండడం వల్ల, శ్వాసకోశ  కేన్సర్‌ను  క్షయవ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. అందుకే క్షయ వ్యాధి మందులతోనే చాలా కాలం గడిపేయవచ్చు.  పైగా శ్వాసకోశ వ్యాధికి చాలా వేగంగా పెరిగే లక్షణం ఉంది.  అందుకే ఆలస్యమయ్యే కొద్దీ నాటికి  వ్యాధి బాగా ముదిరిపోవచ్చు. మొదట్లో  సాధారణ వైద్యచికిత్సలేవో తీసుకున్నా, లక్షణాలు తగ్గకపోవడం, తగ్గినా మళ్లీ మళ్లీ అవే లక్షణాలు  కనిపించినప్పుడు,  అది శ్వాసకోశ  కేన్సరేమోనని అనుమానించి  వెంటనే కేన్సర్‌  వైద్య నిపుణులను సంప్రదించాలి.                   కొన్ని రకాల కేన్సర్‌ కణాలు  కొంత నిదానంగానే పెరుగుతూ వెళతాయి. మరికొన్ని చాలా వేగంగా విస్తరిస్తూ వెళతాయి. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్‌ కణాలకు కూడా చాలా వేగంగా పెరిగే లక్షణమూ ఇతర భాగాలకు పాకే తత్వమూ ఎక్కువ. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్లను ప్రైమరీ  లంగ్‌ కేన్సర్లనీ, కార్సినోమా కేన్సర్లనీ పిలుస్తారు. శ్వాసకోశ కేన్సర్‌ బారిన పడిన దాదాపు 85 శాతం మందిలో పొగ  తాగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిగతా 15 శాతం జన్యుపరమైన కారణాలతో పాటు  వాతావరణ కాలుష్యాలు కూడా కొంత కారణమవుతున్నాయి.

Thursday, 24 November 2016

రాష్ట్రాన్ని కబళిస్తున్న కేన్సర్

తినే తిండి కల్తీ! పీల్చే గాలి కల్తీ! తాగే నీరు కూడా కల్తీ! వీటితోపాటు అనారోగ్యకరమైన జీవనశైలి! కారణమేదైనా గానీ.. తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్‌ రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నది మాత్రం చేదునిజం! ఆరోగ్యశ్రీ పథకంలో కేన్సర్‌ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ప్రభుత్వం  నిర్వహించిన బ్రెస్ట్‌కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ల్లోనూ కేన్సర్‌ రోగులు పెరుగుతున్నట్లు తేలుతోంది. మరోవైపు కేన్సర్‌ చికిత్సల వల్ల ప్రజలపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఆర్థికంగా భారం అధికం అవుతోంది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో కేన్సర్‌ వ్యాధి ఆందోళన కలిగించేలా విస్తరిస్తోందని తెలుస్తోంది.
                  ప్రభుత్వం  మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, గంగాపూర్‌, వరంగల్‌ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్‌లలో మహిళల కోసం బ్రెస్ట్‌ కేన్సర్‌ మొబైల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలను నిర్వహించింది. రెండు రోజుల్లో 1,271 మంది మహిళలకు పరీక్షలు చేశారు. వీరిలో 273 మందికి కేన్సర్‌ ఉన్నట్లు అనుమానం కలగడంతో మమ్మోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 135 మందికి కేన్సర్‌ ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీరికి మరిన్ని పరీక్షల కోసం శాంపిళ్లను సేకరించి బయాప్సీ కోసం పంపించారు. 

Wednesday, 23 November 2016

పండులో ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారంతో పాటు .. పండ్లను కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పండ్లలో అనేక రకాలై పోషకపదార్థాలు ఉంటాయి. అలాగే రోజూ  పండ్లు తినివారిలో  వ్యాధి నిరోధక శక్తి  అధికంగా  ఉంటుంది. వివిధ రకాలైన  పండ్లు రోజూ  తీసుకోవడం వల్ల .. కొన్ని రకాలైన వ్యాధులు రాకుండా ముందే నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మన గుండెను భద్రంగా  చూసుకోవాలంటే .. పాలి పినాల్స్ ఎక్కువగా ఉండే  ఫ్రూ ట్స్ తినాలి .
           

క్యాన్సర్  మహమ్మరి… ఎవరిని ఏరకంగా చుట్టుముడుతుందో అస్సలు చెప్పలేం.  చాలా మంది రకరకాల క్యాన్సర్ల బారిన పడుతూ ఉంటారు. అలాంటి కేన్సర్ మన దరికి చేరకుండా చూడాలంటే .. పండ్ల ప్రత్యామ్నాయం . లిచీ ఫ్రూట్ రెగ్యులర్ గా తింటూ ఉంటే … బ్రెస్ట్ కేన్సర్ ను దూరంగా పెట్టొచ్చు.  లిచీలో  యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కేన్సర్ కారకాలను అరికడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక బొప్పాయి లాంటి  పండ్లలో  బీటా క్రిపోక్సాంథిన్  ఎక్కువగా ఉంటుంది. ఇది లంగ్ కేన్సర్ నుంచి రక్షిస్తుంది.

 

Tuesday, 22 November 2016

ఆ అయిదు వైర‌స్ ల తోనే క్యాన్స‌ర్..


మానవ రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసే మహమ్మారి వైరస్‌.. హెచ్‌ఐవీ టైప్‌ 1 ద్వారా కేన్సర్‌ కూడా వచ్చే ముప్పు ఉందని అమెరికాకు చెందిన హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ విభాగం వెల్లడించింది. మనుషుల్లో కేన్సర్‌కు కారణమయ్యే ఏడు కారకాలను ను శాస్త్రవేత్తలు కార్సినోజెన్ల జాబితాలో కొత్తగా చేర్చారు. అందులో ఒకటి ఈ హెచ్‌ఐవీ టైప్‌1 కాగా.. దాంతోపాటు మరో నాలుగు వైర్‌సలు, ఒక రసాయన పదార్థం, ఒక లోహం ఉన్నాయి. దీంతో మొత్తం కేన్సర్‌ కారకాల సంఖ్య 248కు చేరింది.


        జూ హెచ్‌ఐవీ-1, జూ హ్యూమన్‌ టి-సెల్‌ లింఫోట్రోపిక్‌ వైరస్‌ టైప్‌ 1, జూ ఎప్‌స్టీన్‌-బర్‌ వైరస్‌ , జూ కపోసి సర్కోమా-అసోసియేటెడ్‌ హెర్పి్‌సవైరస్‌ , జూ మెర్కెల్‌ సెల్‌ పోల్యోమావైరస్‌. ఈ ఐదు వైర్‌సలకూ.. నాన్‌-మెలనోమా స్కిన్‌ కేన్సర్‌, కంటి కేన్సర్‌, ఊపిరితిత్తుల కేన్సర్‌, ఉదరకోశ కేన్సర్‌, లింఫోమా సహా 20 రకాల కేన్సర్లతో సంబంధం ఉందని హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ తన 14వ నివేదికలో వెల్లడించింది. వైర‌స్ లు కావచ్చు.. రసాయనాలు కావచ్చు.. కేన్సర్‌ కారకాల జాబితాలో ఉన్న వాటికి ఎక్స్‌పోజ్‌ అయినంత మాత్రాన కేన్సర్‌ వచ్చేస్తుందేమోనని భయపడాల్సిన పని లేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో పని చేసినా, ఉదయం కొంత సమయం నిద్రించకపోయినా, అలాగే రాత్రి పది గంటల కన్నా ఎక్కువ సేపు నిద్రించినా కేన్సర్‌ ముప్పు తప్పదని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Monday, 21 November 2016

శ్వాసతో ఊపిరితిత్తుల కేన్సర్‌ గుర్తింపు

ప్రాణాంతక ఊపిరితిత్తుల కేన్సర్‌ను తొలినాళ్లలోనే పసిగట్టేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లంగ్‌ కేన్సర్‌ ఇండికేటర్‌ డిటెక్షన్‌,లూసిడ్‌ గా వ్యవహరిస్తున్న ఈ పరికరం.. శ్వాసను పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌ జాడలను ఇట్టే పసిగడుతుందని అన్నారు. కేంబ్రిడ్జికి చెందిన ఓవల్‌స్టోన్‌ నానోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది.


 లంగ్‌ కేన్సర్‌ సోకిన తర్వాత బాధితుల జీవితకాలం ఐదేళ్లకు పడిపోతుంది. ఈ క్రమంలో దీన్ని ముందుగా గుర్తించడం వల్ల బాధితులను రక్షించేందుకు అవకాశం లభిస్తుందని ఓవల్‌స్టోన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్లీ బోయలే తెలిపారు. ప్రస్తుతం తుది పరిశీలన దశలో ఉన్న లుసిడ్‌ను వచ్చే ఏడాది తొలినాళ్లలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పరికరంతో లంగ్‌ కేన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని వివరించారు.

Sunday, 20 November 2016

పడగవిప్పుతున్న లంగ్‌ క్యాన్సర్‌

ప్రపంచవ్యాప్తంగా లంగ్‌ కాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. అవగాహన కల్పించడం, కారణాలను వెంటనే గుర్తించడం చేస్తున్నప్పటికీ ఎన్నో ఏండ్లుగా ఫలితాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. అందుకే ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే వాటిని గుర్తించి, కమ్యూనిటీ స్థాయిలో నిరోధకచర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతదేశంలో ఏటా సుమారుగా 63,000 లంగ్‌ కాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని ఓ సర్వేలో నిర్థారణ అయ్యింది. అన్ని కాన్సర్‌ కేసుల్లోనూ స్త్రీ, పురుషుల మరణాలకు సంబంధించి 9.3 శాతం వాటికి లంగ్‌ క్యాన్సర్‌ కారణమవుతోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లంగ్‌క్యాన్సర్‌ గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి.


             గ్లోబొకాన్‌ నివేదిక ప్రకారం వివిధ రకాల క్యాన్సర్‌లలో బ్రెస్ట్‌, సెర్వికల్‌, ఓరల్‌ కేవిటీల తరువాత లంగ్‌ కేన్సర్‌ నాలుగోస్థానంలో ఉంది. కేన్సర్‌ ఉదంతాలకు సంబంధించి పురుషుల్లో ఇది రెండో స్థానంలో నిలువగా, మహిళల్లో ఆరో స్థానంలో ఉంది. ఏటా భారతీయ పురుషుల్లో 53,728, మహిళల్లో 16,547 నూతన లంగ్‌క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ఉన్న భారతీయ రోగుల్లో ధూమపానం చేసే అలవాటు పురుషుల్లో 87 శాతంగా, మహిళల్లో 85 శాతంగా ఉంది. పాసివ్‌ టొబాకో ఎక్స్‌పోజర్‌కు గురయ్యే వారు 3 శాతంగా ఉన్నారు. అంటే అన్ని కేసుల్లోనూ 90% పొగాకు దుష్ప్రభావాలకు లోనవడం మూలాన్నే లంగ్‌క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

Saturday, 19 November 2016

కేన్సర్ వేగం.. గుర్తింపు ఆలస్యంకొన్ని రకాల కేన్సర్‌ కణాలు  కొంత నిదానంగానే పెరుగుతూ వెళతాయి. మరికొన్ని చాలా వేగంగా విస్తరిస్తూ వెళతాయి. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్‌ కణాలకు కూడా చాలా వేగంగా పెరిగే లక్షణమూ ఇతర భాగాలకు పాకే తత్వమూ ఎక్కువ. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్లను ప్రైమరీ  లంగ్‌ కేన్సర్లనీ, కార్సినోమా కేన్సర్లనీ పిలుస్తారు. శ్వాసకోశ కేన్సర్‌ బారిన పడిన దాదాపు 85 శాతం మందిలో పొగ  తాగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిగతా 15 శాతం జన్యుపరమైన కారణాలతో పాటు  వాతావరణ కాలుష్యాలు కూడా కొంత కారణమవుతున్నాయి.


శ్వాసకోశ కేన్సర్లు రెండు రకాలు. వాటిలో మొదటిది స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌. ఈ రకం కేన్సర్లు శ్వాసకోశ కేన్సర్లలో 14 శాతం దాకా ఉంటాయి. ఈ కేన్సర్‌ను ఓట్‌ సెల్‌ కార్సినోమా అని కూడా పిలుస్తారు. ఈ కేన్సర్‌కు అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉంది. అలాగే ఇతర శరీర భాగాలకు అంటే లింఫ్‌నోడ్స్‌, ఎముకలు, మెదడు, అడ్రినల్‌ గ్లాండ్స్‌, లివర్‌ భాగాలకు  వ్యాపించే గుణం ఉంది.  ఈ కేన్సర్‌ కారకుల్లో దాదాపు 95 శాతం మందిలో పొగాకు సేవించే అలవాటు ఉన్నవారే. నాన్ స్మాల్ లంగ్‌ కేన్సర్‌ ను తిరిగి  మూడు తరగతులుగా  విభజించారు.  అందులో స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా ఒకటి. దాదాపు 30 శాతం మందిలో ఈ కేన్సర్లే కనిపిస్తాయి. ఈ కేన్సర్‌కు కూడా పొగాకు అలవాట్లే కారణం.

Thursday, 17 November 2016

నడకతో కేన్సర్ దూరం


రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడక.. మంచి నిద్రతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంకా ఆయుష్షును పెంచుకోవచ్చు. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండెపోటు, లివర్ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకుంటేనే ఆయుష్షును పెంచుకున్నట్లేనని.. వాటికి కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.  వాటిలో మొదటిది ఆల్కహాల్ తీసుకోకపోవడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తేనే ఆరోగ్యం ఉన్నట్టే. ఆల్కహాల్‌ను ఎంతమటుకు తగ్గిస్తే అంతమటుకు లివర్‌ను కాపాడుకోవచ్చు. ఇంకా బరువును కూడా తగ్గించుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు.          
  అలాగే వ్యాయామం రోజు వారీ పనుల్లో ఒక భాగమైపోవాలి. రోజుకు 20 లేదా అరగంటపాటు నడిస్తే గుండె నొప్పిని దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయవచ్చు. బీపీని నియంత్రించుకోవచ్చు. ఇక మూడోది పొగాకు ఉత్పత్తులను దూరంగా ఉంచడం.. తద్వారా లంగ్ కేన్సర్, గుండెనొప్పిని దరిచేరనీయకుండా చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో షుగర్ శాతాన్ని తగ్గించుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు బ్రేక్ వేయవచ్చు. ఒత్తిడిలోనుకాకుండా ప్రశాంతంగా ఉంటే హైబీపీ తరిమికొట్టవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Sunday, 13 November 2016

లంగ్ కేన్సర్.. వెరీ డేంజర్

ప్రపంచవ్యాప్తంగా లంగ్‌ కాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. అవగాహన కల్పించడం, కారణాలను వెంటనే గుర్తించడం చేస్తున్నప్పటికీ ఎన్నో ఏండ్లుగా ఫలితాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. అందుకే ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే వాటిని గుర్తించి, కమ్యూనిటీ స్థాయిలో నిరోధకచర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతదేశంలో ఏటా సుమారుగా 63,000 లంగ్‌ కాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని ఓ సర్వేలో నిర్థారణ అయ్యింది. అన్ని కాన్సర్‌ కేసుల్లోనూ స్త్రీ, పురుషుల మరణాలకు సంబంధించి 9.3 శాతం వాటికి లంగ్‌ క్యాన్సర్‌ కారణమవుతోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లంగ్‌క్యాన్సర్‌ గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి.


      గ్లోబొకాన్‌ నివేదిక ప్రకారం వివిధ రకాల క్యాన్సర్‌లలో బ్రెస్ట్‌, సెర్వికల్‌, ఓరల్‌ కేవిటీల తరువాత లంగ్‌ కేన్సర్‌ నాలుగోస్థానంలో ఉంది. కేన్సర్‌ ఉదంతాలకు సంబంధించి పురుషుల్లో ఇది రెండో స్థానంలో నిలువగా, మహిళల్లో ఆరో స్థానంలో ఉంది. ఏటా భారతీయ పురుషుల్లో 53,728, మహిళల్లో 16,547 నూతన లంగ్‌క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ఉన్న భారతీయ రోగుల్లో ధూమపానం చేసే అలవాటు పురుషుల్లో 87 శాతంగా, మహిళల్లో 85 శాతంగా ఉంది. పాసివ్‌ టొబాకో ఎక్స్‌పోజర్‌కు గురయ్యే వారు 3 శాతంగా ఉన్నారు. అంటే అన్ని కేసుల్లోనూ 90% పొగాకు దుష్ప్రభావాలకు లోనవడం మూలాన్నే లంగ్‌క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

కొన్నేళ్ల ముందే కేన్సర్ గుర్తించొచ్చా..?

ప్రస్తుతం మహమ్మారిగా మారిన కేన్సర్‌ రావచ్చని దాదాపు పదేళ్ల ముందే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త రక్త పరీక్ష త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. డీఎన్‌ఏకు సంబంధించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మన శరీరంలో టెలోమెర్స్‌ అనే చిన్న చిన్న ఆకారాలు ఉంటాయి. వాస్తవానికి, మన షూ లేస్‌కు చివర్లో ప్లాస్టిక్‌ మూతలా ఒకటి ఉంటుంది కదా! అలాగే, మన క్రోమోజోములకు చివర్లో మూతలా ఈ టెలోమెర్స్‌ ఉంటాయి. క్రోమోజోముల్లోని డీఎన్‌ఏ పాడవకుండా అది కాపాడుతుంది. షూ లేస్‌ చివర్లోని ప్లాస్టిక్‌ పోయిందనుకోండి.. ఇక లేస్‌ అంతా పాడవుతుంది కదా! అలాగే, టెలోమెర్స్‌ పాడయితే క్రోమోజోముల్లోని డీఎన్‌ఏ కూడా దెబ్బతింటుంది.


                 ఇక, మనకు వయసు పెరుగుతున్నకొద్దీ ఈ టెలోమెర్స్‌ చిన్నవి అవుతూ ఉంటాయి. దాంతో మన డీఎన్‌ఏ కూడా పాడవుతూ వస్తుంది. తద్వారా, వయసుతోపాటు వచ్చే అల్జీమర్స్‌, డయాబెటిస్‌, గుండెపోటు వంటి వ్యాధులు వస్తాయి. ఈ టెలోమెర్స్‌ కనక సాధారణం కంటే చిన్నవి అయిపోయాయనుకోండి. అది అనారోగ్యానికి, మరణానికి చేరువ అవుతున్నారనడానికి సంకేతం అన్నమాట. ఇప్పుడు, టెలోమెర్స్‌ పొడవులో మార్పులను బట్టి కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కనుగొనవచ్చని నార్త్‌వెస్టర్న్‌ అండ్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి పొడవులో భారీగా మార్పులు వచ్చేస్తే.. అంటే చిన్నవి అయిపోతే, అతనికి కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని చాలా ఏళ్లకు ముందుగానే గుర్తించవచ్చని వివరిస్తున్నారు.

Friday, 11 November 2016

పిల్లల వద్ద పొగ తాగితే మీకే నష్టం

లండన్: పొగతాగే వారి పక్కనవుంటే దాని చెడు ప్రభావం వారిపై కూడా వుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అయితే, ఇపుడు తాజాగా పొగతాగే వారి పక్కన కనుక పిల్లలు, యుక్తవయస్కులు వుంటే వారికి వినికిడి కొరవడుతుందని కూడా మరో అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ విశ్వవిద్యాలయం 12 సంవత్సరాలనుండి 19 సంవత్సరాల వయసుకల 1500 మంది పిల్లలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించి పొగ పీల్చిన కారణంగా నత్త ఆకారంలో వున్న వారి లోపలి చెవి భాగంలో సమస్యలు వచ్చాయని తేల్చారు. సైంటిస్టుల మేరకు, పాసివ్ స్మాకింగ్ చెవి లోపలి భాగాలకు రక్తసరఫరా ఆటంకపరచి పిల్లలకు, చెప్పేది అవగాహన చేసుకోకుండా చేస్తుందని దానితో వారు చదువులలో వెనుకబడటం, పాఠశాలలో అల్లరి చిల్లరిగా ప్రవర్తించటం చేస్తారని చెపుతున్నారు.


           సాధారణంగా ఈ వినికిడిలోపం వయసు మళ్ళిన వారిలోను లేదా పుటుకతోనే వినికిడి సమస్య వున్న వారికి వుంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మైకేల్ వీజ్ మన్ తెలియజేస్తున్నారు. పాసివ్ స్మాకింగ్ పై చేయబడిన పరిశోధనలు ఇప్పటికే ఆస్తమా, గుండె జబ్బులు, లంగ్ కేన్సర్ మొదలైన ప్రభావాలు చూపుతున్నాయని తెలుపబడింది. ప్రస్తుత అధ్యయనంకుగాను పరిశోధకులు యుక్తవయస్కులపై విస్తృత పరిశోధనలు చేశారు. పొగ తాగే వారి పక్కన వున్న పిల్లలకు, పొగతాగని వారి పక్కన వున్న పిల్లలకు మధ్య ఈ వినికిడి లోపం ఏర్పడుతోందని గుర్తించారు.

Thursday, 10 November 2016

మీకు లంగ్‌ కేన్సర్‌ వస్తుందా?


 ధూమపానం చేసేవారికి రకరకాల కేన్సర్లు.. ముఖ్యంగా లంగ్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందనేది అందరికీ తెలిసిన పాత విషయమే. కానీ.. కొంతమంది జీవితాంతం సిగరెట్లు తాగినా రాదు. కొందరికి వస్తుంది. స్మోకర్లలో అలా ఎవరికి లంగ్‌ కేన్సర్‌ వస్తుందో ఇన్నాళ్లూ వైద్యులు సైతం చెప్పలేకపోయారు. కానీ.. దీన్ని నిర్ధారించగల సరికొత్త వైద్యపరీక్షను యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు.సిగరెట్‌ తాగేవారి నోటి నుంచి ముక్కు నుంచి స్రావాలను సేకరించి వాటిని పరారుణ కాంతి (ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌) కింద పెడతారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లోని, నోరు, ముక్కులోని కణాలు ఒకరకమైన ప్రభావానికి గురవుతాయి. ఆ ప్రభావానికి గురైన కణాలు పరారుణ కిరణాలకు ఒకరకంగా వెలుగుతాయి. అలాకానివి మరో రకంగా వెలుగుతాయి. ఈ తేడా ఆధారంగా లంగ్‌ కేన్సర్‌ వచ్చేదీ రానిదీ అంచనా వేయవచ్చు.

Wednesday, 9 November 2016

పాప్ కార్న్ తో జర భద్రంపాప్ కార్న్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు. పెద్దల దగ్గర్నుంచి పిల్లల వరకు పాప్ కార్న్ కి ఫ్యాన్స్ ఎక్కువే. ఇది ఓ టైం పాస్ స్నాక్. ఒకప్పుడు మాల్స్ లోనో, సినిమా హాల్స్ లోనో పాప్ కార్న్ దొరికేది. కానీ ఇప్పుడు బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్ , పార్క్ లు ఇలా ఏ ప్లేస్ లో చూసినా పాప్ కార్న్ దొరకుతోంది. అంతేకాదు ఇప్పుడు ఇంట్లోనే టైంపాస్ కి ఐదు నిమిషాల్లో తయారుచేసుకునే విధంగా పాప్ కార్న్స్ వచ్చేశాయి. ఇందులో చాలా ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి.
      

ఇధంతా బాగానే ఉంది. కానీ టైంపాస్ కి తినే పాప్ కార్న్ భారీ మూల్యం చెల్లించమని అడుగుతోంది. అవును అసలు విషయం ఏంటంే పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మైక్రోవేవ్ పాప్ కార్న్ తో లంగ్ కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. మైక్రోవేవ్ పాప్ కార్న్ లో ఉండే డియాసిటైల్ అనే కెమికల్ వల్ల లంగ్ కేన్సర్ ప్రమాదం ఉందట. అందువల్ల మైక్రోవేవ్ పాప్ కార్న్ ను తినడం మానేయాలని హెచ్చరిస్తున్నారు. పాప్ కార్న్ ప్రియులకు బ్యాడ్ న్యూసే అయినా మానేయక తప్పదు కదా.

Tuesday, 8 November 2016

పండులో ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారంతో పాటు .. పండ్లను కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పండ్లలో అనేక రకాలై
పోషకపదార్థాలు ఉంటాయి. అలాగే రోజూ  పండ్లు తినివారిలో  వ్యాధి నిరోధక శక్తి  అధికంగా  ఉంటుంది. వివిధ రకాలైన  పండ్లు రోజూ  తీసుకోవడం వల్ల .. కొన్ని రకాలైన వ్యాధులు రాకుండా ముందే నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

గుండె
మన గుండెను భద్రంగా  చూసుకోవాలంటే .. పాలి పినాల్స్ ఎక్కువగా ఉండే  ఫ్రూ ట్స్ తినాలి . ద్రాక్ష, లిచీ పండ్ల లో పాలిపినాల్స్ ఎక్కవగా ఉంటాయి.  అంతే కాదు. క్యాన్సర్ ను అరికట్టడంలోనూ బాగా పనిచేస్తాయి.

 క్యాన్సర్
క్యాన్సర్  మహమ్మరి… ఎవరిని ఏరకంగా చుట్టుముడుతుందో అస్సలు చెప్పలేం.  చాలా మంది రకరకాల క్యాన్సర్ల బారిన పడుతూ ఉంటారు. అలాంటి కేన్సర్ మన దరికి చేరకుండా చూడాలంటే .. పండ్ల ప్రత్యామ్నాయం . లిచీ ఫ్రూట్ రెగ్యులర్ గా తింటూ ఉంటే … బ్రెస్ట్ కేన్సర్ ను దూరంగా పెట్టొచ్చు.  లిచీలో  యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కేన్సర్ కారకాలను అరికడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక బొప్పాయి లాంటి  పండ్లలో  బీటా క్రిపోక్సాంథిన్  ఎక్కువగా ఉంటుంది. ఇది లంగ్ కేన్సర్ నుంచి రక్షిస్తుంది.

 ఒబేసిటీ , కోలెస్ట్రాల్
ఒబేసిటీ, కోలె స్ట్రాల్ తో బాధపడే వారు.. రేగుపళ్లు, యాపిల్స్ తింటే మంచిది. పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. 40 శాతానికి పైగా  పీచు పదార్థం ఈ పండ్లలో ఉంటుంది. కోలె స్ట్రాల్ ను నియంత్రించడానికి చక్కగా సహాయ పడతాయి

రక్తపోటు
రక్తపోటును తగ్గించడంలో .. అరటి పండు చాలా మేలు చేస్తుంది.  రోజుకో అరటి పండు తింటే ..రక్త పోటు కంట్రోల్ లో ఉంటుంది. అత్తి పండు  లో కూడా రక్తపోటును తగ్గించే పోటాషియం అదికంగా ఉంటుంది.

జీర్ణశక్తి
అజీర్తితో బాధడేవాళ్లు.. బొపాయి, జామపండు ముక్కులు  తింటే మంచిది. వాటిలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ శక్తి కి సహకరిస్తాయి. అలాగే బొప్పాయిలోని పపెయిన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంచుతుంది. ఇక సీ విటమిన్ ఎక్కువగా ఉండే కమలా పండు వల్ల  మహిళల్లో చర్మంపై మడతలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Monday, 7 November 2016

టైర్లు కాలిస్తే క్యాన్సర్ ఖాయం


టైర్లు  కాలితే వెలువడే పొగ రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది! ముఖ్యంగా కేన్సర్ ముప్పు అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1.ఒక్క టైరు తయారీలో సహజ రబ్బరుతోపాటు సింథటిక్ రబ్బరును, స్టీలు వైర్లను వాడతారు. సింథటిక్ రబ్బరు తయారీలో దాదాపు 7 లీటర్ల పెట్రోలు, క్లోరిన్, స్టైరీన్, బుటాడియెన్‌వంటి హానికర రసాయనాలు, 20 రకాలకు పైగా హెవీ మెటల్స్ వాడతారు. వీటిలో స్టైరీన్, బుటాడియెన్ రెండూ కేన్సర్ కారకాలే. అలాగే.. టైర్ల తయారీలో వాడే సీసం, క్రోమియం, కాడ్మియం, పాదరసం ప్రమాదకర కాలుష్య కారకాలు.

2.ఈ పొగ నుంచి వెలువడే డయాక్సిన్లు సుదీర్ఘ దూరాల పాటు ప్రయాణించి భూమిమీద, నీళ్లలోనూ, మొక్కలపైనా, జంతువులు, మనుషులపైనా దట్టంగా పరుచుకుంటాయి. జంతువుల, మనుషుల కొవ్వు కణాల్లో పేరుకుపోతాయి. ఈ డయాక్సిన్లు మనుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని మందగింపజేస్తాయి. వీటివల్ల మధుమేహం వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది.

3. 1991లో.. కెనడియన్ ఓంటారియో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ వారు ఒక పరిశోధన చేశారు. దాని ప్రకారం.. టైర్లు కాల్చిన నేలలో ఆ కాలుష్యం రెండు వందల రోజులకు పైగా తన ప్రభావం చూపుతోందని వారు గుర్తించారు. అంతేకాదు, ఆ ప్రదేశం నుంచి చుట్టుపక్కల 200 మీటర్ల దూరం దాకా పండించిన కూరగాయల్లోనూ ఆ కాలుష్యం తాలూకు ఆనవాళ్లున్నాయి.


4.టైర్లను కాల్చినప్పుడు వాటిలో ఉండే భారలోహాలు పూ ర్తిగా నాశనం కాకుండా వాటి అవశేషాలు నేలలో కలిసి మన ఆహారచక్రంలోకి ప్రవేశించి తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతాయి. ఈ అవశేషాలు కలిగిన ఆహారం తినేవారిలో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదమూ ఉంది. జింక్ అవశేషాలు పుట్టబోయే బిడ్డల్లో అనేక లోపాలను కలగజేస్తాయి. ఇక క్రోమియం..కేన్సర్ బారిన పడేస్తుంది.

5.ఆందోళన సమయాల్లో టైర్లను తగలబెట్టేవారికి తెలియని విషయమేంటంటే.. ఈ చర్య ద్వారా వారు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఆ చుట్టుపక్కల నివసించేవారిని సైతం లంగ్ కేన్సర్, బ్లడ్ కేన్సర్ వంటి వాటి బారిన పడేస్తున్నారు. ముఖ్యంగా.. చిన్నపిల్లలపై ఈ విషవాయువుల ప్రభావం మరింత తీవ్రంగా ఉం టుంది. టైర్ల పొగ నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు వారి ఊపిరితిత్తుల్లోకి చొరబడి వాటిని పాడుచేస్తాయి.

6. టైర్లలోని సీసం నేలలో కరిగి ఆహారచక్రంలో కలిసినప్పుడు.. ఆ ఆహారం తినే పసిపిల్లలు మానసిక వైకల్యానికి గురయ్యే ముప్పు అధికం.

Sunday, 6 November 2016

చిటికెలో కేన్సర్ పరీక్షగట్టిగా శ్వాస తీసుకోండి.. ఇప్పుడు ఒకసారి వదిలి పెట్టండి.. వెరీ గుడ్, ఊపిరితిత్తుల కేన్సర్ లేదు... మీరు నిశ్చింతగా ఉండొచ్చు... ఇదేంటి అనుకుంటున్నారా..? భవిష్యత్తులో వాస్తవ రూపం దాల్చనున్న చిటికెలో పూర్తయ్యే లంగ్ కేన్సర్ పరీక్ష ఇలానే ఉండబోతోంది. ఇలా శ్వాస ద్వారా విడుదల చేసే గాలిలో ఉండే రసాయనాల ఆధారంగా పరిశోధకులు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని చెప్పేస్తారట.


కేన్సర్ కణాలు కణుతుల ఎదుగుదలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయని భావిస్తున్నట్లు అమెరికాలోని క్లీవ్ లాండ్ రెస్పిరేటరీ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ పీటర్ జే మజోన్ అంటున్నారు. తమ పరిశోధనలో వచ్చిన ఫలితాల ఆధారంగా శ్వాస ఆధారిత కేన్సర్ ను గుర్తించే పరీక్షను రూపొందించే పనిలో ఉన్నామని చెప్పారు.

Saturday, 5 November 2016

ఉమ్మిలో నెత్తురు పడితే.. కేన్సరే


సాధారణంగా ఉమ్మిలో నెత్తురు ముక్కునుంచి రక్తం కారిన కొంతసేపటి తరువాతనైనా కనిపి స్తుంది, లేదా బ్రష్‌తో బలంగా దంతధావనం చేసి నప్పుడు చిగుళ్లకు గాయం కావడం వల్లనైనా కనిపి స్తుంది. లేకపోతే శ్వాస మార్గంలో ఎక్కడైనా ఇన్‌ ఫెక్షన్‌కావటం, ఇరిటేట్‌ కావటం వల్లనైనా ఉమ్మిలో నెత్తురు కనిపించవచ్చు.కళ్లెలో రక్తం పడటానికి మరొక ప్రధాన కారణం ఏమిటంటే గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తులలో ప్రయా ణించటం. ఊపిరితిత్తులకు కేన్సర్‌ సోకటం వలన కూడా కళ్లెలో రక్తం కనిపిస్తుంది. అయితే ఈ రెండు కారణాలూ చాలా అరుదు. మీరు దగ్గిన ప్పుడు లేదా ఉమ్మివేసినప్పుడు ఉమ్మిలో రక్తంలో కనిపిస్తే ఈ కింది కారణాల్లో ఏదో ఒకటి కారణమై ఉండవచ్చునని భావించాలి. కళ్లె ఏ రంగులో ఉంది? ఏ సందర్భంలో రక్తం పడింది అనే విష యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
          


 కొద్ది రోజులు, వారాలనుండి విడవకుండా కఫంలో రక్తం చారికలు కనిపిస్తుంటే ఒకప్పుడు దానిని డాక్టర్లు మొట్టమొదట టిబిగా సందేహించే వారు. సమాజంలో ఇప్పుడు టిబి చాలా వరకూ తగ్గిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ లక్షణం కనిపిస్తే క్రానిక్‌ బ్రాంకైటిస్‌ బాగా ముదిరిపోతే వచ్చే బ్రాంకిఎక్టాసిస్‌గా సందేహించడం జరుగుతుంది.బ్రాంకిఎక్టాసిస్‌లో ఊపిరితిత్తుల తాలూకు శ్వాస గొట్టాలు ఏ భాగంలోనైనా విశాలం కావడమో, బల హీనపడటమో జరుగుతుంది. ఈ రోగులకు సైనస్‌ సమస్య కూడా ఉంటుంది. మనిషికి ఒకసారి బ్రాంకిఎక్టాసిస్‌ వచ్చిందంటే శాశ్వతంగా ఉండిపో తుంది. దీర్ఘకాలం యాంటి బయాటిక్స్‌ వాడటం, ఛాతీకి ఫిజియోథెరపీ అవసరమవుతాయి.

Friday, 4 November 2016

చెడు అలవాట్లతో కేన్సర్ ముప్పు
సిటీల్లో  రోడ్ల మీద ఎలాంటి మాస్కులు, హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఒక్క గంట సేపు తిరిగితే చాలు.. ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొంది.  పెరుగుతోన్న వాహన కాలుష్యంతో కనీసం స్వచ్ఛమైన గాలి కూడా కరవైంది. హైదరాబాద్ గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాముల వరకు పర్టిక్యులేట్ మేటర్  ఉండవచ్చని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు వెల్లడిస్తున్నాయి. అది ఇప్పుడు 95 మైక్రో గ్రాములకు చేరింది.


                    జంటనగర వాసులు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనానికి వారి ఆహారపు అలవాట్లు అంటే జంక్ ఫుడ్ తినడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల వల్ల కూడా కేన్సర్ వస్తుందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, మామూలు ఆస్తమా నుంచి ఊపిరితిత్తుల కేన్సర్, గుండెపోటుతో సహా అనేక రకాల జబ్బులు వచ్చే ప్రమాదముంది. ఇక, ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల నుంచి వెలువడుతోన్న పొగలో ఉండే కాలుష్య కారకాలతో పలు రకాల కేన్సర్లు వస్తాయని వైద్య నిఫుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా కనపడుతోంది. లంగ్ కేన్సర్ రావడానికి ఇదే ప్రధాన కారణమని పల్మనాలజిస్టులు పేర్కొన్నారు.

Thursday, 3 November 2016

కేన్సర్ పై ముప్పేట దాడిఊపిరితిత్తుల కేన్సర్‌ నివారణకు శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. ఇందులో రెండు రకాల ఔషధాలను ఉపయోగించడంతోపాటు రేడియేషన్‌ చికిత్సను కూడా ఏకకాలంలో చేయిస్తే ఊపిరితిత్తుల కేన్సర్‌ను నివారించవచ్చని థామస్‌ జఫర్సన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరీక్షల్లో వెల్లడైంది. ప్రమాదకరమైన నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌  నివారణలో ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నా.. కొన్ని కేన్సర్‌ కణాలు మాత్రం రూపాన్ని మార్చుకుని శరీరంలోనే ఉంటున్నాయి.


           రెండు రకాలైన ఔషధాలను, రేడియేషన్‌ చికిత్సను ఏకకాలంలో చేయడం వల్ల కేఆర్‌ఏఎస్‌ జన్యువులోని మార్పుల వల్ల వచ్చే కేన్సర్‌లను నివారించవచ్చని వర్సిటీ ప్రొఫెసర్‌ బో లూ తెలిపారు. కేన్సర్‌ కణితులు, మెలనోమా కేన్సర్‌ నివారణకు ఉపయోగించే రెండు రకాల కేన్సర్‌ ఔషధాలను కలిపి సరికొత్త ఔషధాన్ని తయారుచేస్తున్నామని, ప్రస్తుతం ఇది వైద్య పరీక్షల దశలో ఉందన్నారు.

Wednesday, 2 November 2016

కాలుష్యంతో కేన్సర్ ముప్పుప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కేన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా ప్రపంచంలో మొత్తంలో భారతదేశంలోనే ఎక్కువగా 10 లక్షలమందికి పైగా ఉన్నారు. కేవలం వివిధ రకాల కాలుష్యాల వల్ల భారత్ లో ఏడాదిలో మరణించిన వారి సంఖ్య 14 లక్షలకు పైగా ఉంది.  చిన్న చిన్న తప్పులే పెనుముప్పులా మారి మొత్తం దేశాన్నే కాలుష్య కార్ఖానాగా మార్చాయన్నది విమర్శ కాదు వాస్తవం. వాయుకాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం, శబ్దకాలుష్యం ముఖ్యమైనది. వాయు కాలుష్యం ముఖ్యంగా పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల ఇంకా ఇప్పటికీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్టులవల్ల ఏర్పడుతోంది. మనదేశంలో ఎక్కువ మంది బాధపడుతున్న లంగ్ కేన్సర్ కు కారణం కూడా ఈ వాయు కాలుష్యమే.


                 స్వాతంత్య్రం రాకముందే మహాత్మాగాంధీ ఈ దేశ ప్రజల అపరిశుభ్రత చూసి ఆవేదనతో ఈ దేశానికి స్వాతంత్య్రం రావడం ఎంత ముఖ్యమో పరిశు భ్రత అంతకన్నా ముఖ్యమని చెప్పినా, అర్థం చేసుకోని బుద్ధిమాంద్యం మన వారసత్వం. అంతరిక్ష విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటున్న మనకు నేటికీ, దేశంలో పలు ప్రాంతాలలో బహిరంగ మల,మూత్ర విసర్జనలు, హారన్ మోతలు పంటికింద రాయిలా తగులుతున్నాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా కాలుష్యం వల్ల వచ్చేది నష్టమే. పోయేది ఆరోగ్యమే. మనకోసం, మన భవిష్యత్ తరాలకోసం కాలుష్యాన్ని అరికట్టాలి. కాలుష్యం ఇదే స్థాయిలో పెరిగితే దేశమంతా లంగ్ కేన్సర్ బారిన పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tuesday, 1 November 2016

పాంక్రియాజ్ కేన్సర్ అవేర్ నెస్ మంత్ నవంబర్నవంబర్ ను పాంక్రియాటిక్ కేన్సర్ మంత్ గా పాటిస్తున్నారు. పాంక్రియాజ్, స్టమక్ కేన్సర్ లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తే ముందు జాగ్రత్త పడటం తేలికౌతుంది. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. డైటింగ్‌, వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతున్నట్లయితే ఫర్వాలేదు. కానీ ఆహారపు అలవాట్లు మార్చుకోకుండానే, ఏ కారణం లేకుండానే బరువు తగ్గుతున్నట్లయితే అనుమానించాల్సి ఉంటుంది. పాంక్రియాజ్‌, స్టమక్‌ వంటి కేన్సర్‌లలో బరువు తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఎంతకీ విడవని జ్వరం లింఫోమా, ల్యుకేమియా వంటి బ్లడ్‌కేన్సర్‌లకు సంకేతం కావచ్చు. కాబట్టి జ్వరం తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకవేళ అది కేన్సర్‌ కాకపోయినా జ్వరం తగ్గేవరకు చికిత్స తీసుకోవడం మరువద్దు.
              నొప్పికి చాలా కారణాలుంటాయి. అయితే వదలకుండా ఉన్న తలనొప్పి బ్రెయిన్‌ కేన్సర్‌ సంకేతం కావచ్చు. నడుంనొప్పి రెక్టల్‌, ఒవేరియన్‌ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. ఒకవేళ విడవకుండా నొప్పి ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించి కారణం తెలుసుకోండి. చాలా రోజులుగా దగ్గు బాధిస్తోందా? అది లంగ్‌ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. సీజనల్‌ అలర్జీ వల్ల వచ్చిన దగ్గు కావచ్చు. కారణం ఏదైనా పరీక్ష చేయించుకోవడం మాత్రం మరువద్దు. శరీరంలో ఎక్కడైనా గడ్డల మాదిరిగా తగిలితే నిర్లక్ష్యం పనికిరాదు. బ్రెస్ట్‌, టెస్టికల్స్‌, లింఫ్‌ నోడ్స్‌ దగ్గర గడ్డల మాదిరిగా ఉంటే పరీక్ష చేయించడం ఉత్తమం. అబ్‌నార్మల్‌ బ్లీడింగ్‌ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. దగ్గినపుడు కఫంలో రక్తం పడటం, మలంలో రక్తం పడటం, మూత్రంతో పాటు రక్తం రావడం, వెజైనల్‌ బ్లీడింగ్‌ వంటివి కేన్సర్‌కు సంకేతాలు. ఒకవేళ పుండు ఎంతకీ తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్‌తో చెక్‌ చేయించుకోవాలి. నోట్లో పుండ్లు ఉన్నా ఓరల్‌ కేన్సర్‌ లక్షణం కావచ్చు. ఒకవేళ పుట్టుమచ్చల్లో ఏమైనా మార్పులు కనిపించినా, చర్మంపై ఇతర మార్పులు కనిపించినా మెలనొమాకు సంకేతం కావచ్చు. కాబట్టి డెర్మటాలజిస్టును కలవాలి.  ఎప్పుడూ నీరసంగా ఉండటం కూడా కేన్సర్‌ సంకేతం కావచ్చు. చాలా మందిలో వివిధ కారణాల వల్ల నీరసం ఉంటుంది. ఒకవేళ రోజంతా నీరసంగా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.