Friday 25 November 2016

లంగ్ కేన్సర్ యమ డేంజర్

 శ్వాసకోశాల కేన్సర్‌ నిర్ధారణ చాలా  క్లిష్టమైనది. ఈ  కేన్సర్‌ లక్షణాలు, క్షయ వ్యాధి లక్షణాలు దాదాపు ఒకేలా ఉండడం వల్ల, శ్వాసకోశ  కేన్సర్‌ను  క్షయవ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. అందుకే క్షయ వ్యాధి మందులతోనే చాలా కాలం గడిపేయవచ్చు.  పైగా శ్వాసకోశ వ్యాధికి చాలా వేగంగా పెరిగే లక్షణం ఉంది.  అందుకే ఆలస్యమయ్యే కొద్దీ నాటికి  వ్యాధి బాగా ముదిరిపోవచ్చు. మొదట్లో  సాధారణ వైద్యచికిత్సలేవో తీసుకున్నా, లక్షణాలు తగ్గకపోవడం, తగ్గినా మళ్లీ మళ్లీ అవే లక్షణాలు  కనిపించినప్పుడు,  అది శ్వాసకోశ  కేన్సరేమోనని అనుమానించి  వెంటనే కేన్సర్‌  వైద్య నిపుణులను సంప్రదించాలి.



                   కొన్ని రకాల కేన్సర్‌ కణాలు  కొంత నిదానంగానే పెరుగుతూ వెళతాయి. మరికొన్ని చాలా వేగంగా విస్తరిస్తూ వెళతాయి. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్‌ కణాలకు కూడా చాలా వేగంగా పెరిగే లక్షణమూ ఇతర భాగాలకు పాకే తత్వమూ ఎక్కువ. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్లను ప్రైమరీ  లంగ్‌ కేన్సర్లనీ, కార్సినోమా కేన్సర్లనీ పిలుస్తారు. శ్వాసకోశ కేన్సర్‌ బారిన పడిన దాదాపు 85 శాతం మందిలో పొగ  తాగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిగతా 15 శాతం జన్యుపరమైన కారణాలతో పాటు  వాతావరణ కాలుష్యాలు కూడా కొంత కారణమవుతున్నాయి.

No comments:

Post a Comment