Saturday 19 November 2016

కేన్సర్ వేగం.. గుర్తింపు ఆలస్యం



కొన్ని రకాల కేన్సర్‌ కణాలు  కొంత నిదానంగానే పెరుగుతూ వెళతాయి. మరికొన్ని చాలా వేగంగా విస్తరిస్తూ వెళతాయి. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్‌ కణాలకు కూడా చాలా వేగంగా పెరిగే లక్షణమూ ఇతర భాగాలకు పాకే తత్వమూ ఎక్కువ. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్లను ప్రైమరీ  లంగ్‌ కేన్సర్లనీ, కార్సినోమా కేన్సర్లనీ పిలుస్తారు. శ్వాసకోశ కేన్సర్‌ బారిన పడిన దాదాపు 85 శాతం మందిలో పొగ  తాగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిగతా 15 శాతం జన్యుపరమైన కారణాలతో పాటు  వాతావరణ కాలుష్యాలు కూడా కొంత కారణమవుతున్నాయి.


శ్వాసకోశ కేన్సర్లు రెండు రకాలు. వాటిలో మొదటిది స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌. ఈ రకం కేన్సర్లు శ్వాసకోశ కేన్సర్లలో 14 శాతం దాకా ఉంటాయి. ఈ కేన్సర్‌ను ఓట్‌ సెల్‌ కార్సినోమా అని కూడా పిలుస్తారు. ఈ కేన్సర్‌కు అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉంది. అలాగే ఇతర శరీర భాగాలకు అంటే లింఫ్‌నోడ్స్‌, ఎముకలు, మెదడు, అడ్రినల్‌ గ్లాండ్స్‌, లివర్‌ భాగాలకు  వ్యాపించే గుణం ఉంది.  ఈ కేన్సర్‌ కారకుల్లో దాదాపు 95 శాతం మందిలో పొగాకు సేవించే అలవాటు ఉన్నవారే. నాన్ స్మాల్ లంగ్‌ కేన్సర్‌ ను తిరిగి  మూడు తరగతులుగా  విభజించారు.  అందులో స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా ఒకటి. దాదాపు 30 శాతం మందిలో ఈ కేన్సర్లే కనిపిస్తాయి. ఈ కేన్సర్‌కు కూడా పొగాకు అలవాట్లే కారణం.

No comments:

Post a Comment