Monday 30 November 2015

అధిక విటమిన్లతో చేటు

బీటా కెరోటిన్ కేన్సర్ ను కలగజేస్తుందా.. విటమిన్ బీ6 నరాలను నాశనం చేస్తుందా.. కాల్షియం మూత్రపిండాలను బలహీన పరుస్తుందా.. అనే ప్రశ్నలు అర్థం లేనివి అనుకుంటే పొరపాటే. విటమిన్లు మానవదేహానికి బలాన్ని ఇవ్వడమే కాదు.. శృతిమించి వాడితే అనర్థాలను కూడా తెచ్చిపెడతాయి. బీటా కెరోటిన్ మోతాదుకు మించి వాడితే సోరియాసిస్, కేన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు వయసుకు తగ్గట్లు విటమిన్లు వాడాలని చెబుతున్నారు.

             విటమిన్ సి ని యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగిస్తున్నారు. అదే విటమిన్ ఐరన్ స్థానంలో వాడటం వల్ల అది పో ఆక్సిడెంట్ గా పనిచేసి కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఫోలిక్ ఆసిడ్ ను శృతి మించి తీసుకుంటే వారి పిల్లలు పుడుతూనే అనేక రుగ్మతలతో పుడతారు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏదైనా మోతాదులో తీసుకుంటేనే మంచిదని.. శృతిమించితే అమృతమైనా విషం అవుతుందనే పెద్దల మాటను డాక్టర్లు మరోసారి గుర్తుచేస్తున్నారు.

Sunday 29 November 2015

ఆరోగ్యానికి హార్మోన్లే కీలకం

స్త్రీ హార్మోనులు మెదడుకు సంబంధించిన రసాయనిక చర్యలో పూర్తిస్థాయి పాత్ర వహిస్తాయి. స్త్రీల మానసిక రుగ్మతలకు, వారి హార్మోనులకు సంబంధం ఉందన్న వాదం ఇప్పుడు చర్చ రేపుతున్నది. స్త్రీ జీవితంలో యవ్వనం, పునరుత్పత్తి, మోనోపాజ్ లు కీలకమైన దశలు. ఈ దశలలో ఆమె చాలా ఒత్తిడికి గురవుతుంది. అందుకే ఆ దశల్లో ఆ దశల్లో ఆమె మానసిక స్థితి ఆందోళనతో కూడుకున్నదై ఉంటుంది. కానీ స్త్రీల్లో మానసిక ఆందోళనకు కేవలం హార్మోనులదే అనడం ఎంతవరకు సమంజసం అనే విషయం మీదా చర్చ జరుగుతోంది.

             స్త్రీ సామాజికంగా వివక్షకు గురికావడం, ఆర్థిక బానిసత్వం, చాకిరి, పిల్లల పెంపకం, వంటి సమస్యలు కూడా స్త్రీ మానసిక పరిస్థితిపై ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కేవలం హార్మోనుల వల్లే స్త్రీలలో మానసిక ఆందోళన చోటుచేసుకుంటాయని అనడం భావ్యం కాదని వాదన కూడా వినిపిస్తోంది.

Saturday 28 November 2015

స్త్రీల మానసిక సమస్యకు హార్మోన్లే కారణం

స్త్రీలను నడిపించేది వారి బుద్ధి కాదు కేవలం చిత్తచాంచల్యమే అని ఓ అపవాదు ఉంది. అది ఎంతవరకూ నిజమో మనం తెలుసుకుందాం. స్త్రీలను సాధారణంగా ప్రీమెనుస్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వంటి రుగ్మతులు బాథపెడుతుంటాయి. ఈ జబ్బుల లక్షణాల్లో ఎక్కువ శాతం మానసిక ఆందోళన, దిగులు ఉంటాయి. కానీ ఈ జబ్బులకు మూలం మానసికమైనదని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో నమ్ముతున్నారు.
         
 మానసికమైన మార్పులకు స్త్రీలలో భావోద్వేగమే కారణమని భావించేవారు. 19వ శతాబ్దంలో స్త్రీల మానసిక రుగ్మతలకు వారి శారీరక పునరుత్పత్తి వ్యవస్థే కారణం అని భావించారు. అప్పట్లో స్త్రీల మానసిక రుగ్మతలకు వారి గర్భసంచికి ఆపరేషన్లు చేసేవారు. నిజానికి హిస్టీరియా అనే మానసిక రుగ్మతకు పేరు గ్రీకుపదం హిస్టెరా నుంచి తీసుకున్నారు. గ్రీకు భాషలో హిస్టెరా అంటే గర్భకోశం అని అర్థం. కానీ తర్వాతి కాలంలో జరిగిన పరిశోధనల్లో స్త్రీల మానసిక సమస్యలకు హార్మోన్లే కారణం అని తెలుసుకున్నారు.

Friday 27 November 2015

కేన్సర్ కన్నా భయమే ప్రమాదం

మనం శరీరం గురించి ఆలోచించినప్పుడల్లా శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ మనిషి సంపూర్ణ ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మానసికంగా ఎలాంటి సమయంలో అయినా ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడే జీవితంలో ఎదురయ్యే సమస్యల ప్రభావం మన ఆరోగ్యంపై పడకుండా చూసుకోగలుగుతాము. మానసికంగా బలహీనుడైన వ్యక్తి చిన్న చిన్న కష్టాలకు కూడా చలించిపోయి రక్తపోటును పెంచుకుని, గుండెజబ్బులు కొని తెచ్చుకుంటాడు.
           
భయపడే స్థాయిలోని తీవ్రత మీరు పిరికివారో, ధైర్యవంతులో తెలియజేస్తుంది. చచ్చేంత పిరికివాడు ఆపద రాకముందే భయపడతాడు. కాస్త ధైర్యం ఉన్నవాడు ఆపద ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయపడతాడు. పూర్తిస్థాయి ధైర్యవంతుడు ఆపద గడచిపోయాక భయపడతాడని చెబుతారు. ఆపద అనేది చెప్పి రాదు. అనుకోని సమస్యల నుంచి, అనుకోని సందర్భాల నుంచి ఆపదలు వస్తుంటాయి. మీకు వ్యాధి వచ్చినప్పుడు అధైర్యపడితే అది మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. 

Thursday 26 November 2015

పిల్లల్లో తరచుగా మెదడు కేన్సర్

మెదడు కేన్సర్ లేదా బ్రెయిన్ కేన్సర్ మెదడులోనే కాకుండా శరీరంలోని రక్తం, కాలేయం, ఊపిరితిత్తుల వంటి అవయాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ కేన్సర్ పదిహేను సంవత్సరాల్లోపు పిల్లల్లో 25 శాతం వస్తుండా, చిన్నపిల్లల్లో మరీ ఎక్కువగా ఉంది. మెదడు కేన్సర్ ను రెండు రకాలుగా విభజించారు. బ్లాస్టోమా, గ్లియోమా. మెదడు కేన్సర్ కు గురైన వారు తరచుగా తలనొప్పి, బలహీనత, వాంతులు కలుగుతాయి. మెదడులో ఏ భాగానికి వ్యాధి వస్తే ఆ భాగానికి చెందిన శరీర భాగాలు అచేతనంగా మారతాయి.

               మగపిల్లల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి నిర్థారణకు ఎక్స్ రేలు, సిటీ స్కాన్లు ఉపయోగించవచ్చు. వీటి ద్వారా మెందడులోని ఏఏ భాగాలు కేన్సర్ కు గురైనదీ తెలుసుకోవచ్చు. రక్తపరీక్షలో మాత్రం రక్తం మామూలుగానే కనిపిస్తుంది. కేన్సర్ సోకిన భాగంలో ముందు నీటిని తొలగించాలి. మెదడులో కేన్సర్ కు గురైన భాగాలను ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. మెదడులో కేన్సర్ సోకిన భాగాలపై రేడియేషన్ ప్రసరింపజేస్తారు. కేన్సర్ కు కారణమైన మందులను సెరిబ్రోస్పెనల్ ద్రవంలోకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. 

Wednesday 25 November 2015

థైరాయిడ్ కేన్సర్ తో ప్రమాదం

మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి అత్యంత ప్రధానమైనది. ఎదుగుదలకు పరోక్షంగా సహాయపడే ఈ గ్రంథి.. చిన్నదైనా, పెద్దదైనా ప్రమాదమే. అయోడిన్ లోపిస్తే థైరాయిడ్  పెద్దదవుతుంది. థైరాయిడ్ పెద్దదవడాన్ని గాయిటర్ అంటారు. స్వరపేటికకు ఇరువపుల ఉండే థైరాయిడ్ స్రావాలు.. జీవక్రియలను క్రమబద్ధీకరిస్తాయి. థైరాయిడ్ కేన్సర్ వచ్చినప్పుడు థైరాయిడ్ గ్రంథి పెద్దదై కణితిగా మారుతుంది.

           థైరాయిడ్ కేన్సర్ నిర్థారణకు స్కానింగ్ చేయాలి. రక్తపరీక్ష చేసినా రక్తం మామూలు లక్షణాలను కలిగి ఉన్నట్లే తెలుస్తుంది. స్కానింగ్ చేయడం వల్ల కణితి గట్టిగా ఉందా, నీళ్ల సంచిలా ఉందా.. అన్న విషయం తెలుస్తుంది. థైరాయిడ్ కేన్సర్ మందులతో నయం కాదు. రేడియేషన్ ద్వారా కేన్సర్ కణాలను నిర్వీర్యం చేయాలి. కేన్సర్ కణితిని ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. అయితే థైరాయిడ్ గ్రంథిని పూర్తిగా తొలగిస్తే.. జీవనక్రియలకు అవసరమైన స్రావాలు లభ్యం కాకుండా పోయే ప్రమాదం ఉంది. 

Tuesday 24 November 2015

లంగ్ కేన్సర్ లక్షణాలు

ఊపిరితిత్తులు ఉంటేనే ఊపిరి ఉంటుంది. ఊపిరి ఉంటేనే ఉనికిలో ఉన్నట్లు లెక్క. జీవించే ప్రతి మనిషికి రెండు ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి ఉదరభాగంలో ఉంటాయి. ఊపిరితిత్తుల కేన్సర్ రెండు రకాలు. సంక్రమించిన కణజాలం రకంపై ఆధారపడి ఉంటుంది. సూక్ష్మకణ కేన్సర్, సూక్ష్మేతర కణ కేన్సర్. ఊపిరితిత్తుల కేన్సర్ లో నాలుగో వంతు సూక్ష్మ కణ కేన్సరే. దీన్నే ఓటు కణ కేన్సరని కూడా వ్యవహరిస్తారు.

                    సూక్ష్మేతర కణ కేన్సర్ మూడు రకాలు. అవి స్క్వామస్ కేన్సర్, అడినో కేన్సర్ మరియు అసూక్ష్మకణ కేన్సర్. ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చిన రోగికి  శ్వాస ఆడదు. బరువు తగ్గుతారు. జ్వరం వస్తుంది. ఛాతిలో నొప్పి ఉంటుంది. ఆకలి కాదు. దగ్గు, తెమడలో రక్తం కారడం వంటి లక్షణాలుంటాయి. సిటీస్కాన్, ఎక్స్ రే ద్వారా రోగ నిర్థారణ చేయొచ్చు. ఆపరేషన్, రేడియేషన్ ఔషధ చికిత్స ఏది చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతారు. 

Monday 23 November 2015

పెనిస్ కేన్సర్

సున్తీ చేయించుకోని పురుషుల్లో తరచుగా వచ్చే కేన్సర్ పెనిస్ కేన్సర్. యూదులు, మహమ్మదీయులు సున్తీ చేయించుకుంటారు కాబట్టి ఈ రకపు కేన్సర్ వాళ్లలో చాలా అరుదు. అమెరికాలో పెనిస్ కేన్సర్ ఒక శాతం కన్నా తక్కువే. సున్తీ చేయించుకోకపోవడం వల్ల పెనిస్ చివరి భాగాన ఊరే ద్రవాల మూలంగా కేన్సర్ రావచ్చు. ప్రతిరోజూ పెనిస్ శుభ్రపరచుకోకపోయినా.. ఈ కేన్సర్ వస్తుంది.

               పెనిస్ చివరన అల్సర్ లాంటిది ఏర్పడుతుంది. ఈ అల్సర్ గట్టిగా ఉండి మందులు వాడినా తగ్గదు. క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. రక్తపరీక్షలో రక్తం మామూలు లక్షణాలు కలిసి ఉంటుంది. వ్యాధి సోకిన భాగం నుంచి కొంత తీసి, బయోప్సీ చేస్తే రోగ నిర్థారణ అవుతుంది. ఆపరేషన్ ద్వారా కేన్సర్ సోకిన భాగాన్ని తొలగించవచ్చు. పెనిస్ కేన్సర్ ను రేడియేషన్, ఔషధ చికిత్స ద్వారా నయం చేయలేము. 

Sunday 22 November 2015

జీర్ణాశయ కేన్సర్ తో ప్రమాదం

జీర్ణాశయం మనం తినే ఆహారం జీర్ణం చేసే అతి ముఖ్యమైన అవయవం. జీర్ణాశయం లోపలి భాగాల్లో ఇన్ఫెక్షన్ ముదిరి కేన్సర్ గా మారుతుంది. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియవు. అతిగా మద్యం సేవించేవారిలో జీర్ణాశయ కేన్సర్ కనిపిస్తుంది. సాధారణంగా 50 నుంచి 70 ఏళ్లు పైబడ్డవారిలో ఈ కేన్సర్ కనిపిస్తుంది. జపాన్ లో ఈ తరహా కేన్సర్ అధికంగా ఉంది.

                     ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కడుపు నొప్పి జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు. ఎండోస్కోపీ, బయోప్సీ ద్వారా జీర్ణాశయ కేన్సర్ ను నిర్థారిస్తారు. ఇతర కేన్సర్లు కాదన్న నిర్థారణ తర్వాత దీన్ని గుర్తిస్తారు. దీంతో సహజంగా వ్యాధి గుర్తింపులోనే ఆలస్యం జరుగుతుంది. కేన్సర్ ను తొలిదశలో గుర్తిస్తే ఔషధాలు, ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు. ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తే రేడియేషన్ తప్పనిసరి.

Saturday 21 November 2015

అరుదుగా వచ్చే స్కిన్ కేన్సర్

స్కిన్ కేన్సర్ లేదా చర్మపు కేన్సర్ మన దేశంలో చాలా అరుదు. పాశ్చాత్య దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. శరీరం తెల్లగా ఉండేవాళ్లకు సూర్యరశ్మి సరిపడని కారణంగా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నల్లటి శరీర రంగు కలిగి ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా అరుదు. చర్మపు కేన్సర్ లో శరీరంపై తెల్లటి అల్సర్లు ఏర్పడతాయి.
   
     రక్తపరీక్షలో అంతా మామూలుగానే ఉంటుంది. కేన్సర్ సోకిన చోట చర్మాన్ని బయోప్సీ చేస్తే కేన్సర్ నిర్థారణ అవుతుంది. చర్మ కేన్సర్ వచ్చిన వాళ్ల ముఖం ఉబ్బెత్తుగా అలర్లు వచ్చి ఉంటుంది. చికిత్స చేయకపోతే నెమ్మదిగా ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది. శస్త్ర చికిత్స లేదా రేడియేషన్ ద్వారా దీన్ని నివారించవచ్చు. తొలి దశలో గుర్తిస్తే చికిత్స చేయడం తేలికవుతుంది. 

Friday 20 November 2015

కలవరపెట్టే కిడ్నీ కేన్సర్

మూత్రపిండాలకు కేన్సర్ సోకడాన్ని కిడ్నీ కేన్సర్ అంటారు. మన శరీరంలోని మూత్రపిండాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. రక్తాన్ని వడపోసి మూత్రంగా మారుస్తాయి. రక్తంలో ఎలక్రోలైట్, లవణాల శాతాన్ని సమతుల్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి మూత్రపిండాలకు కేన్సర్ వస్తే ముదరక ముందే చికిత్స చేయించుకోవడం ఉత్తమం.
       ఒక కిడ్నీకి కేన్సర్ వస్తే ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. మూత్రనాళాలను రెండో కిడ్నీకి అనుసంధానిస్తే రెండు కిడ్నీల పని ఒకే కిడ్నీ చేస్తుంది. కానీ కిడ్నీల నుంచి ఇతర శరీర భాగాలకు కేన్సర్ వ్యాపిస్తే రేడియేషన్ చేయాల్సి వస్తుంది. కిడ్నీ కేన్సర్ లో ఔషధాల ద్వారా చికిత్సతో ఉపయోగం ఉండదు. యాభై ఏళ్లు పైబడ్డ పురుషుల్లో, పొగత్రాగేవారిలో, మద్యం తాగేవారిలో కిడ్నీ కేన్సర్ తరచుగా కనిపిస్తుంది. 

Thursday 19 November 2015

ప్యాంక్రియాజ్ కేన్సర్ తో పచ్చ కామెర్లు

క్లోమం మన జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన భాగం. క్లోమంలో ఇన్సులిన్ అనే ఎంజైమ్ ఉత్ప్తతి అవుతుంది. చక్కెర పదార్ధాల అరుగుదలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సహజంగా క్లోమపు క్యాన్సర్ వయోవృద్ధుల్లో ఎక్కువగా వస్తుంది. క్లోమపుక్యాన్సర్ నే ప్యాంక్రియాజ్ కేన్సర్ అని అంటారు. కడుపు నొప్పితో పాటు వెన్నునొప్పి, ఆకలి మందగించడం దీని లక్షణాలు. వ్యాధి ముదిరితే పచ్చకామెర్లు రావచ్చు.

                      ప్యాంక్రియాజ్ కేన్సర్ ఉన్నవారిలో క్లోమం పరిమాణం పెద్దది కావడం కారణంగా ఆంత్రములం సన్నబడుతుంది. క్లోమం కేన్సర్ ను అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చు. శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ భాగాన్ని తొలగించవచ్చు. పైత్యరసనాళములో అవరోధం ఏర్పడి పచ్చకామెర్లు కనిపిస్తే ఆపరేషన్ తప్పనిసరి. 

Wednesday 18 November 2015

మలబద్ధకం ముదిరితే క్యాన్సర్

మన జీర్ణవ్యవస్థలో పెద్దపేగు విడదీయలేని భాగం. పెద్దపేగునే కోలన్ అని వ్యవహరిస్తారు. పెద్దపేగు చివరి భాగాన్ని పురీషనాళం అంటారు. మన దేశంలో కోలన్ కు, పురీషనాళానికి వచ్చే క్యాన్సర్ తక్కువే. కానీ అమెరికా, యూరప్ దేశాల్లో చాలామందికి ఈ క్యాన్సర్ కామన్. ఒక్క అమెరికాలోనే 45000 మంది కోలన్ క్యాన్సర్ తో చనిపోయారని తెలుస్తోంది. కోలన్ కేన్సర్ కు మలబద్ధకమే ప్రధాన కారణం.

           మనం తినే ఆహారంలో పీచు పదార్థం తగినంతగా ఉంటే మోషన్ సాఫీగా అవుతుంది. లేకపోతే మలబద్ధకం వస్తుంది. మలబద్ధకంతో పాటు కడుపునొప్పి, మలంలో రక్తం, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇఎస్ఆర్ పెరుగుతుంది. కొలనోస్కోపీ, బయోప్సీ ద్వారా వ్యాధిని నిర్థారిస్తారు. కేన్సర్ కు ఆపరేషన్, లేదా రేడియేషన్ ద్వారా చికిత్స చేస్తే.. మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. మెడిసిన్స్ వాడినా.. వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.

Tuesday 17 November 2015

యుటిరస్ కేన్సర్ కు మూడు చికిత్సలుట

స్త్రీలలో ఎక్కువగా వచ్చే కేన్సర్ గర్భాశయ కేన్సర్. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి లక్ష మంది స్త్రీలలో 25 శాతం మంది యుటిరస్ కేన్సర్ తో బాథపడుతున్నారని తేలింది. కేన్సర్ కు కారణాలు నిర్ధిష్టంగా తెలియవు. సహజంగా వయసుపైబడ్డ స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుతుక్రమం సమయంల కాకుండా మిగతా సమయంలో రక్తం కారడం, తెలుపు అవడాన్ని బట్టి కేన్సర్ లక్షణాలను అనుమానించాలి .

                      జననాంగాన్ని భౌతికంగా పరీక్షించినా లేదంటే గర్భశయాన్ని డీఎన్సీ చేసి ఎండోమెట్రియల్ పొర పరీక్షించినా రోగ నిర్థారణ అవుతుంది. యుటిరస్ కేన్సర్ ను గుర్తించిన దశను బట్టి ట్యాబ్లెట్లు, ఆపరేషన్ లేదా రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఆపరేషన్లో కేన్సర్ సోకిన భాగాన్ని కానీ.. లేదంటే మొత్తం గర్భశయాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. రోగికి ట్యాబ్లెట్ల ద్వారా ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఇవ్వడం వల్ల 30 శాతం మంది స్త్రీలకు కేన్సర్ తగ్గినట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

Monday 16 November 2015

కలుషితాహారంతో కాలేయపు క్యాన్సర్

కలుషిత ఆహారం చాలావరకు వ్యాధులకు కారణమని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రమాదకరమైన కాలేయపు క్యాన్సర్ కు కూడా కలుషిత ఆహారం ఓ కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలేయపు క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో ఇధి సాధారణమే అయినా.. ఫారిన్ కంట్రీస్ లో మాత్రం అరుదు. ముఖ్యంగా మద్యపాన ప్రియుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

             కాలేయం చెడిపోవడాన్ని సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ క్యాన్సర్ కు దారితీస్తుంది. శిలీంధ్రాలు ఆహారాన్ని కలుషితం చేయడం కారణంగా కేన్సర్ వస్తుంది. కేన్సర్ రోగులకు ఆకలి ఉండదు. బలహీనంగా ఉంటారు. కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. కుడివైపు భాగమంతా వాపెక్కి నొప్పిగా అనిపిస్తుంది. కాలేయపు కేన్సర్ రోగుల్లో హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గి ఎర్రరక్తకణాలు తక్కువవుతాయి. బయోప్సీ ద్వారా రోగాన్ని నిర్థారిస్తారు. తొలిదశలో శస్త్రచికిత్సతో ఉపయోగం ఉంటుంది. ముదిరితే ఆపరేషన్ చేసినా ఫలితం ఉండదు. 

Sunday 15 November 2015

కేన్సర్ విషయంలో అజాగ్ర్రత్త వద్దు

కేన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. కేన్సర్ లక్షణాల ఆధారంగా ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. కేన్సర్ ముదిరేకొద్దీ చికిత్స క్లిష్టంగా మారడంతో పాటు ప్రాణాలే బలిగొనే పరిస్థితి రావచ్చు. కాబట్టి అందరూ కేన్సర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కేన్సర్ లక్షణాలేంటో తెలుసుకుని అవి కనిపించగానే డాక్టర్ని సంప్రదిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.

             శరీరంలో కణతలు పెరిగి పెద్దవైనా, పుట్టుమచ్చలు రంగు మారి పెద్దగా అయినా, శరీరంలో ఏ భాగం నుంచైనా రక్తంఅధికంగా  కారుతున్నా, తీరచు దగ్గు వస్తున్నా, గొంతు బొంగురుపోయినా, మహిళల్లో అధికంగా తెలుపు కనిపించినా, దృష్టిదోషాలు, కంటినొప్పులు, పిల్లల్లో జ్వరం తరచూ రావడం, సకాలంలో బహిష్టులు కాలేకపోవడం, రోజుల తరబడి అజీర్ణం, మలమూత్ర వ్యవస్థలో మార్పులు.. ఇవన్నీ కేన్సర్ కు సంకేతాలు. ఈ లక్షణాలున్న ప్రతివారికీ కేన్సర్ ఉండాలన్న రూలేమీ లేకపోయినా.. ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 

Saturday 14 November 2015

పొగ తాగడం నోటి క్యాన్సర్ కు రాజమార్గం

పొగాకు నమలడం, పొగ తాగడం హానికరమని మనందరికీ తెలుసు. అయినా సరే ఓ రకమైన బలహీనతకు అలవాటుపడిన కొంతమంది పొగతాగుతూనే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజన తెగల్లో పొగాకు నమిలే అలవాటు కూడా ఉంది. ఇలా పొగాకు నమలడం, పొగ తాగడం క్రమంగా నోటి క్యాన్సర్ కు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
         పొగాకుతో పాటు పాన్ మసాలా, గుట్కా కూడా నోటి క్యాన్సర్ కు దారితీస్తాయి. నోటి క్యాన్సర్ పెదవులపై, నాలుకపై, అంగిట భాగంలో ఏర్పడుతుంది. నోటి క్యాన్సర్ వస్తే పెదాలపై అల్సర్లు వస్తాయి. క్యాన్సర్ మొదటి దశలో వచ్చే అల్సర్ల కారణంగా ఎలాంటి నొప్పి తెలీదు. తర్వాతి దశలో మెడ కింద భాగంలో ఉండే గ్రంథులు ఉబ్బి, ఉబ్బెత్తుగా అవుతాయి. స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా వచ్చే ఈ వ్యాధిని బయోప్సీ చేయడం ద్వార గుర్తిస్తారు.

Friday 13 November 2015

ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కారణాలు

ప్రోస్ట్రేట్ గ్రంథి పునరుత్పత్తికి చాలా ప్రధానమైనది. ప్రోస్ట్రేట్ గ్రంథి స్రావాల వల్లే వీర్యం భద్రపరచబడి, గర్భధారణకు ఉపకరిస్తుంది. ప్రోస్ట్రేట్ గ్రంథి చుట్టూ ఉండే నరాలు అంగస్తంభనకు సహాయపడతాయి. ప్రోస్ట్రేట్ క్యాన్సర్ ఎక్కువగా 50 ఏళ్లు పైబడ్డవారికి వస్తుంది. వీరికి ప్రోస్ట్రేట్ గ్రంథి ఉబ్బడం జరుగుతుంది. దీన్ని రక్తపరీక్ష లేదా లివర్ పరీక్ష లేదా రేడియాలజీ ద్వారా నిర్థారించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
     ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కు వయసుతో పాటు జన్యువులు కూడా ప్రధాన కారణం. రక్తసంబంధీకులకు ఈ వ్యాధి ఉంటే.. తర్వాత తరం వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో అధిక కొవ్వుపదార్ధాలు తీసుకుంటూ.. ఆకుకూరలు తక్కువగా వాడేవారికి కూడా ప్రోస్ట్రేట్ క్యాన్సర్ వస్తుంది. ఆకుకూరల్లో ఉండే విటమిన్లు క్యాన్సర్ కణాలను తగ్గించడానికి సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో పురుషులు చేయించుకునే గర్భనిరోధక శస్త్రచికిత్స వాసెక్టమీ వల్ల కూడా ప్రోస్ట్రేట్ క్యాన్సర్ రావచ్చు. 

Thursday 12 November 2015

కేన్సర్ ఎందుకు వస్తుంది..?

శరీర కణజాలం విచ్ఛిన్నం కావడం ఆగిపోవడం వల్ల కానీ, అవసరమైన దాని కంటే ఎక్కువగా పెరిగినందువల్ల కానీ క్యాన్సర్ వ్యాధి వస్తుంది. కణజాలం ఓ క్రమపద్దతిలో పెరగడానికి అవసరమైన ప్రోగ్రామ్ జీన్స్ లోనే నిక్షిప్తమై ఉంటుంది. కణజాలం పెరగడానికి, కంట్రోల్ చేయడానికి రెండు జీన్స్ పనిచేస్తాయి. పెరిగే జన్యుకణాలు పెరగకుండా ఆగిపోతే దాన్నే క్యాన్సర్ లేదా రాచపుండు అంటారు.
            కేన్సర్ ను వృద్ధిచేసే కణాలను ఆన్ కో జీన్స్ అంటారు. శరీరం లోపల ప్రవేశించే రేడియాధార్మికశక్తి, ధూమపానం, హైడ్రోకార్బన్స్ కు సంబంధించిన తార్, సుగంధాలు, మత్తుపదార్ధాలు వంటివి ఆన్ కో జీన్స్ ను మరింత వ్యాపింప జేసేలా చేస్తాయి. యాంటీ ఆన్ కో జీన్స్ ను పనిచేయకుండా నిరోధించి, శరీరానికి కావల్సిన శక్తిని కూడా ఈ కణజాలాలే తీసుకుంటాయి. దీంతో రోగిని నిస్సత్తువ ఆవరిస్తుంది.  

Wednesday 11 November 2015

బ్లడ్ కేన్సర్ తో ప్రాణాలకే ముప్పు

కేన్సర్ లో ముఖ్యంగా నాలుగు రకాలున్నాయి. అన్నింటిలోకీ ప్రమాదకరమైనది లుకేమియా. దీన్నే బ్లడ్ కేన్సర్ అని కూడా అంటారు. లుకేమియాలో ఎముకల మూలుగలో సాధారణ ఎర్రరక్తకణాలతో పాటు అసాధారణ రీతిలో తెల్లరక్తకణాలు కూడా ఏర్పడతాయి. ఈ తెల్ల రక్త కణాల కారణంగా కణాలు నిర్వీర్యమై రోగి మరణిస్తాడు. బ్లడ్ కేన్సర్ లక్షణాలు సాధారణ వ్యాధుల లక్షణాల్లాగే ఉంటాయి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదు.
            లుకేమియా లక్షణాలు
           ----------------------------
1. తగ్గని జ్వరం, మందులు వాడినా తగ్గకపోవడం.
2. ఆకలి మందగించడం
3. శరీరంపై కణతులు ఏర్పడటం
4. శరీర బరువు క్రమంగా తగ్గడం
5. తీవ్రమైన దగ్గు
6. నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కారడం
7. తరచూ కడుపునొప్పి, కడుపులో అల్సర్లు
8. మలబద్ధకం
9. అదుపులేని రుతుస్రావం
10. స్త్రీల వక్షోజాల్లో గడ్డలు ఏర్పడటం.

Tuesday 10 November 2015

భయపెడుతున్న క్యాన్సర్

మన దేశంలో క్యాన్సర్ చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు వ్యాధిని ముదర బెట్టుకుంటున్నారని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. పొగ, గుట్కా అలవాట్ల మూలంగా నోటి క్యాన్సర్ వస్తోంది. పారిశ్రామిక కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తోంది. రసాయనాల తీవ్రత నిర్థారణకు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటుచేయడం వెనుక.. ఊపిరితిత్తుల క్యాన్సర్ భయం ఉంది.
           దేశంలో క్యాన్సర్ విజృంభిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2020 నాటికి ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ కేసులు రెట్టింపవుతాయని భావిస్తున్నారు. కేన్సర్ అంత తేలిగ్గా లొంగే రకం కాదని చాలా మందికి తెలియకపోవడం, క్యాన్సర్ ను ముదరబెట్టుకోవడం కారణంగా ఏటా కేసులు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కేన్సర్ ను నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలు తెలిసీ, తెలియని మందులు వాడి క్యాన్సర్ లక్షణాలను తాత్కాలికంగా మరుగున పడేసుకుంటున్నారు. వ్యాధి బాగా ముదిరాకే డాక్టర్ల దగ్గరకు రావడం మంచి పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు.

Monday 9 November 2015

కేన్సర్ లో మెటాస్టాటిస్ దశే కీలకం

కేన్సర్ అంటో రోగాల సమూహం. కేన్సర్ మూడు, నాలుగు దశలకు చేరితే చాలా ప్రమాదం. కేన్సర్ శరీరంలోని కణాల్లో మార్పు తీసుకువచ్చి నియంత్రణ సాధ్యం కాని విధంగా పెరిగిపోతుంది. చాలా రకాల కేన్సర్ కణాలు ముద్దగా మారుతాయి. వీటినే ట్యూమర్లుగా పిలుస్తారు. ట్యూమర్లు శరీరంలో అన్ని భాగాలకు వ్యాపించే దశను మెటాస్టాటిస్ స్టేజ్ గా వ్యవహరిస్తారు. ఈ పెరుగుదల ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది.
       కేన్సర్ నాలుగు దశల్లో తొలి దశలో గుర్తిస్తే చాలా తేలికగా రోగి బయటపడవచ్చు. రెండో దశలో డాక్టర్లని సంప్రదించినా.. కొంత కష్టం మీద కేన్సర్ ను తగ్గించవచ్చు. కానీ మూడో దశలో ఆస్పత్రికి వస్తే మాత్రం కేసు ప్రమాదంలో పడ్డట్లే. కేన్సర్ ను తగ్గించేందుకు పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా.. బాగా ముదిరితే తగ్గించడం కష్టమేనన్నది నిపుణుల మాట, కాబట్టి కేన్సర్ కు చికిత్స కంటే నివారణే మార్గం. 

Sunday 8 November 2015

కేన్సర్ - రేడియో థెరపీ పరిచయం

కేన్సర్ కణాల్ని చంపుటకు, మిక్కిలి శక్తివంతమైన ఎలక్ట్రానుల నుంచి ఉద్భవించే ఎక్స్ - రే కణాల్ని పంపించుటను రేడియోథెరపీగా వ్యవహరిస్తారు. డాక్టర్లు నొప్పి లేకుండా మానవశరీరంలోని భాగాల్ని ఎక్స్ -రే ల ద్వారా చూడగలుగుతున్నారు. కేన్సర్ కలుగజేయి కణాల్ని చంపుటకు ఎక్స్ - రేల కంటే మిక్కిలి శక్తివంతమైన రేడియేషన్ ను పంపిస్తారు. ఈ శక్తివంతమైన రేడియేషన్ క్యాన్సర్ నిర్మూలకు పూర్తిస్థాయిలో సహాయపడుతుంది.

welcome to all



This is the site to create awareness on health relates issues, especially cancer.