Friday 3 February 2017

కేన్సర్‌ను నిరోధించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

 కేన్సర్ వ్యాధి సంక్రమించడానికి కారణం ఫలానా అని చెప్పలేకపోవచ్చు కానీ దాన్ని నిరోధించేందుకు మాత్రం ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటే వ్యాధిని అడ్డుకోవచ్చని పరిశోధనాల్లో తేలింది. ప్రపంచ కేన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా ఆ వివరాలను తెలుసుకుందాం...
            ప్రతిరోజూ తినే ఆహారంలో అత్యధిక స్థాయిల్లో ఫైబర్ నిల్వలున్న పదార్థాలను తీసుకునేవారిలో కేన్సర్ వ్యాధి రావడం చాలా తక్కువ. పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అంతేకాదు ప్రొస్టేట్ కేన్సర్ రాకుండా అడ్డుకోవడంలో పండ్లు, కూరగాయలు కీలక పాత్రను పోషిస్తాయి.




    

చైనా పరిశోధనల ప్రకారం తెల్లని కూరగాయలు, బంగాళాదుంపలు, క్యాలీఫ్లవర్ వంటివి తీసుకుంటుంటే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వీటిని తీసుకునేవారిలో వ్యాధి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణాశయ కేన్సర్‌ను కూడా అడ్డుకునే శక్తి వీటికి ఉంది.

Wednesday 1 February 2017

ఆ కేన్సర్ డేంజర్!

శారీరక కేన్సర్ కంటే చుట్టూ ఉండే సమాజం, దగ్గరివాళ్లు దూరం పెట్టడమే పేషంట్లను అధికంగా బాధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేన్సర్ ఉందని తెలియగానే చాలా మంది సదరు పేషంట్లను దూరం పెట్టడం, వారిని మునుపటిలా పలుకరించకపోవడం చేస్తారని దీనికి వల్ల కేన్సర్ పేషంట్లు మానసికంగా కుంగిపోతారని లండన్ లోని సౌత్ హంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లేర్ ఫోస్టర్ వెల్లడించారు.






              
 కేన్సర్ నివారణ  కోసం కిమో థెరపీ ప్రారంభించినప్పుడు, ఆ తరువాత కోలుకున్నాక కొన్నాళ్ల వరకు కూడా పేషంట్లకు సోషల్ సపోర్ట్ దక్కడం లేదని, మనసు విప్పి మాట్లాడేందుకు ఎవరూ ఉండటం లేదని స్టడీ గుర్తించింది. చికిత్స అనంతరం వాళ్లకు సాయం చేయడానికి, ఇంటి పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని స్టడీ వెల్లడించింది.