Sunday, 31 July 2016

మోనోపాజ్ లోపే కేన్సర్ ముప్పు ఎక్కువ

50 ఏళ్ల‌లోపు వ‌య‌స్సున్న మ‌హిళ‌లు కేన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కేన్స‌ర్ ప్రివెన్ష‌న్ అండ్ రీసెర్చ్ చేసిన తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మారుతున్న జీవ‌న ప్ర‌మాణాలే మ‌హిళల్లో కేన్స‌ర్‌కు దారితీస్తున్నాయ‌ని స్ట‌డీ తెలిపింది. ఆల‌స్యంగా వివాహాలు చేసుకోవ‌డం.. లైంగికంగా ఒక‌రికి మించి భాగ‌స్వామ్యుల‌తో క‌ల‌వ‌డం, ఆల‌స్యంగా గ‌ర్భం దాల్చ‌డం కూడా భార‌తీయ స్త్రీలు కేన్స‌ర్‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని విశ్లేషించింది. కేన్స‌ర్ బారిన ప‌డిన మ‌హిళ‌లు 2 శాతం మంది 20-30 ఏళ్ల వ‌య‌స్సున్న వారుండ‌గా..16శాతం మంది 30-40 ఏళ్ల‌ వ‌య‌స్సున్న వారున్న‌ారు. 40-50 ఏళ్ల వ‌య‌స్సున్న వారు 28 శాతం మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌వుతున్నార‌ు.  మొత్తంగా 46 శాతం భార‌తీయ మ‌హిళ‌లు యాభై ఏళ్లలోపు వయసు వారిగా ఉన్నారు. ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.


        స్త్రీల‌కు సంబంధించి త‌లెత్తుతున్న స‌మ‌స్య‌లు బాహాటంగా చెప్పుకోలేక‌పోవ‌డంతో.. వ్యాధి ముదిరి కేన్స‌ర్‌గా బ‌య‌ట‌పడుతోంద‌ని వైద్యులు చెప్పారు. భార‌త్‌లో ప్ర‌తి 8 నిమిషాల‌కు ఓ మ‌హిళ స‌ర్విక‌ల్ కేన్స‌ర్‌తో మ‌ర‌ణిస్తోంద‌ని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కేన్స‌ర్ ప్రివెన్ష‌న్ అండ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. బ్రెస్ట్ కేన్స‌ర్‌తో డ‌యాగ్నైస్ అయిన ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఒక‌రు మృతి చెందుతుండ‌గా.. పొగాకు ఉత్ప‌త్తులు సేవిస్తున్న వారు రోజుకు 2500 మంది మృత్యువాత ప‌డుతున్న‌ట్లు అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఫ‌లానా నొప్పితో హాస్పిట‌ల్‌కు వ‌చ్చేస‌రికి కేన్స‌ర్ వ్యాధి అప్ప‌టికే ముద‌రి పోయిఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు.