Sunday 10 January 2016

తీపి పానీయాలతో కేన్సర్‌ ముప్పు

నడివయసు వచ్చిన వారు ముఖ్యంగా మహిళలు ఆరోగ్య పరమైన తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. పీరియడ్స్‌ నిలిచిపోయే దశలో ఉన్న మహిళలలో ఈ ఇబ్బంది మరింత అధికమని ఇటీవల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తీపిగా ఉండే పానీయాలు, కార్బొనేటెడ్‌ సోడా ఎక్కువగా తీసుకొనే ఈ తరహా మహిళల్లో కేన్సర్‌ రిస్క్‌ ఎక్కువగా
ఉంటుందని అమెరికన్‌ వైద్య పరిశోధకులు నిర్ధారించారు. మిగిలిన మహిళలతో పోల్చుకుంటే తీయని పానీయాలు తీసుకునే నడివయసు మహిళల్లో కేన్సర్‌ వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుందం టున్నారు.

అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ వారి కేన్సర్‌ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్‌, ప్రివెన్షన్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం తీపి పానీయాలు తీసుకునే నడివయసు మహిళల్లో ఈ సమస్య 70శాతం వరకూ సంభవించే అవకాశం ఉందని తేలింది. టైప్‌-1 ఎండోమెట్రియల్‌ కేన్సర్‌తోపాటు స్థూలకాయం సమస్య తలెత్తుతాయని, సాధారణ మహిళల్లో కన్నా వీరిలో 50శాతానికి పైగా ఎక్కువ అవకాశం
ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దాదాపు 23వేల మంది నడివయసు ముఖ్యంగా పీరియడ్స్‌ ఆగిపోయే దశలో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం ఆధారంగా ఈ పరిశీలనలు చేశారు.

అల్సరా...? కేన్సరా...?

కడుపులో మంట అనగానే అల్సర్ అని చాలా మంది అనుకుంటారు. ఏవో తెలిసిన నాలుగు మాత్రలు వేసేసుకుంటారు. కానీ అది కేన్సర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకుని చికిత్స అందించినా ఫలితం ఉండని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఏ కాస్త ఆకలి తగ్గినా, అరుగుదల తగ్గినా, మంటగా ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు.


ఒక్కోసారి సాధారణ లక్షణాలను గుర్తించడంలో పొరపాటు చేస్తే అది బాగా ముదిరిపోయిన దశలో కేన్సర్‌గా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నవాహిక, జీర్ణకోశం, పెద్దపేగుకు వచ్చే కేన్సర్లలో ఈ అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఈ కేన్సర్ల బారినపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. 60లో వచ్చే కేన్సర్ ఇప్పుడు 40లోనే కనిపిస్తోంది.

Friday 8 January 2016

కలుపు మందుతో కేన్సర్ ! గ్లైఫొసేట్

కలుపు మందుతో కేన్సర్ !













గ్లైఫొసేట్.. ఇది అత్యంత ప్రభావశీలి అయిన కలుపు మందు. ప్రపంచంలో వాడుకలో ఉన్న కలుపునాశిని రసాయనాల్లోకెల్లా అగ్రగామి. దీన్ని వాడని దేశం లేదు. ఇది మన దేశంలోనూ విరివిగా వాడుతున్న కలుపు మందు కూడా. ఇది సురక్షితమైన కలుపు మందుగా పరిగణించబడినది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కేన్సర్ కారకంగా గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది. నెదర్లాండ్స్ దీనిపై వెంటనే నిషేధం విధించింది. మరికొన్ని దేశాలు ఇదే బాటను అనుసరించే దిశగా పయనిస్తున్నాయంటున్నారు నిపుణులు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా గ్లైఫొసేట్‌ను కేన్సర్ కారకంగా పరిగణించి, ప్రమాదకర రసాయనాల జాబితాలో చేర్చింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన డా. యాంటోనీ శాంసెల్, డా. స్టీఫెన్ సెనెఫ్‌లు గ్లైఫొసేట్ మానవ శరీరానికి పరోక్షంగా, దీర్ఘకాలంలో ప్రాణాంతకమైనదిగా నిరూపించారు.లైఫొసేట్ అవశేషాలున్న ఆహారాన్ని తినడం వల్ల మానవ జీర్ణవ్యవస్థతో ముడిపడి ఉన్న కోటానుకోట్ల ఉపయుక్త సూక్ష్మజీవులు నాశనమవుతాయని ఎంఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు.

ఈ వ్యాధితో 5వేల మంది మరణం

పట్టుమని పదినిమిషాల్లో నోటి కేన్సర్‌ కణాలను గుర్తించే మైక్రోఫ్లూడిక్స్‌ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ డివైజ్‌ డెంటిస్ట్‌లకు సులభతరంగా, వ్యయపరంగా కూడా అందుబాటులో ఉంటుందని వారంటున్నారు. సర్వికల్‌ కేన్సర్‌తో సహా ఇతర కేన్సర్‌లను పరీక్షించేందుకు కూడా ఈ డివైజ్‌ ఉపకరిస్తుంది. లాబ్‌లో పెరిగే కేన్సర్‌ కణాలపై ఇది సమర్ధవంతంగా పనిచేస్తోంది. 
 
నోటి కేన్సర్‌ రోగుల నుండి బయోప్సిస్‌పై ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తున్నారు. చాలా వరకూ ఓరల్‌ కేన్సర్‌లు ప్రాథమిక దశలో నొప్పి ఉండకపోవడంతో రోగులు, వైద్యులు వాటిని గుర్తించలేకపోతారని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆన్‌ డెఫ్‌నెస్‌ అండ్‌ అదర్‌ కమ్యూనికేషన్‌ డిజార్డర్స్‌లో హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ విభాగం అధిపతి కార్టర్‌ వాన్‌ వేస్‌ అంటున్నారు. ఈ ఏడాది 22,560 మందిలో ఓరల్‌ కేన్సర్‌ గుర్తించవచ్చని, 5000 మంది ఈ వ్యాధితో మరణించవచ్చని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తించింది.

Thursday 7 January 2016

గోళ్ల రంగుతో కేన్సర్ ముప్పు!

పెళ్లికి వెళ్లాలా? పేరంటం ఉందా? మరైదేనా శుభకార్యం ఉందా!? అయితే… మహిళల గోళ్లకు మంచి రంగు పడాల్సిందే. కొందరు యువతులు పెళ్లీ పేరంటాలతో సంబంధం లేకుండా నిత్యం గోళ్లకు మెరుపు రంగు వేసుకుంటూనే ఉన్నారు. కానీ… నెయిల్‌ పాలి్‌షతో ముప్పుతప్పదని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన కేన్సర్‌ వ్యాధి నిపుణుడు డాక్టర్‌ థు క్వాచ్‌ హెచ్చరిస్తున్నారు. గోళ్ల రంగు తయారీలో ప్రమాదకరమైన విష రసాయనాలు వాడుతున్నారట.

మరీ ముఖ్యంగా… శాస్త్రవేత్తలు ‘త్రి-విషాలు’గా పిలిచే టొలీన్‌, ఫార్మాల్డిహైడ్‌, డైబ్యుటైల్‌ థాలేట్‌లు నెయిల్‌ పాలి్‌షలో ఉన్నట్లు గుర్తించారు. గోళ్లరంగుకు మెరుపు, నునుపు వచ్చేందుకు ఈ రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిలో.. ఫార్మాల్డిహైడ్‌ కేన్సర్‌ కారకం. టొల్యూన్‌ నాడీ వ్యవస్థపైన, పునరుత్పత్తి శక్తిపైనా ప్రభావం చూపిస్తుంది. డైబ్యుటైల్‌ థాలేట్‌ కూడా పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ ‘త్రి-విషాల’తోపాటు మరిన్ని ప్రమాదకర రసాయనాలూ గోళ్లరంగులో ఉన్నట్లు గుర్తించారు. అప్పుడప్పుడు గోళ్లరంగు పూసుకునే వాళ్లతోపాటు… ఎప్పుడూ వీటితోనే ఉంటూ, వినియోగదారులకు పూసే బ్యూటీ సెలూన్ల  సిబ్బందికీ ఈ రసాయనాలు మరీ ప్రమాదకరమని నిపుణులు తెలిపారు.

కేన్సర్ అంటే ఏమిటి..? ఎలా వస్తుంది..?

మన శరీరం సరీగ్గా  పనిచెయ్యాలంటే వాటిలో ఉన్న వివిధ అవయవాలు  సరీగ్గా పని చెయ్యాలి. ఆయా  అవయవాలని సరీగ్గా  పనిచేయించేవి వాటిలో ఉండే కణాలు. వాటిల్లో కొన్ని కణాలు, చెయ్యవలసిన పని చెయ్యకుండా, అవలక్షణాల మూలంగా అడ్డూ ఐపూ లేకుండా ఇష్టం వచ్చినట్లు తమ సంతతిని పెంచుకుంటూ ఉంటాయి. దానితో కొంతకాలానికి మంచి చేసే కణాల కన్నా చెడు చేసేవి ఎక్కువయ్యి శరీరంలో జరగవలసిన పనులు సక్రమంగా జరగవు. అవయవాలు పనిచెయ్యటం మానేస్తాయి. దీన్నే కేన్సర్ అంటారు.

 మన శరీరం అంతా కణాల పుట్ట. వాటి వాటి జీవిత చక్రం ప్రకారం పాత కణాలు చచ్చిపోతూ  కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలు దైనందినమూ మన శరీరమనే రసాయనిక శాలలో జరిగేవే.  ప్రకృతి, చెడ్డ కణాలు వాటంతట అవే చంపుకునేటట్లు చేసింది.  దానిని అపోప్తోసిస్  అంటారు. కానీ కొన్ని చెడ్డ కణాలు అన్నిలక్షణాలూ సరీగ్గానే ఉన్నట్టు కనపడి, ప్రకృతి పరిశీలనలో చిక్కకుండా తప్పించుకుని  బయటపడుతాయి. ఈ అవలక్షణాలతోటే వాటి సంతానం  పెరిగించుకుంటూ పోతాయి . ఇవి సరీగ్గా పనిచెయ్యవు సరికదా మంచి కణాల ఆహారానికి కూడా పోటీకి వస్తాయి. దీనితో శరీరంలో అవి ఉన్న చోట ఆ అవయవానికి అవసరమయిన పని జరగదు. అవయవాలు పనిచెయ్యటం మానేస్తాయి.

Wednesday 6 January 2016

నిద్ర తక్కువైతే కేన్సర్ ముప్పు

మానవుడికి సంపూర్ణ ఆరోగ్యం నిద్రతోనే సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ఎన్ని వ్యాయామాలు చేసినా.. కంటికి నిండుగా నిద్ర పోకపోతే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సరిగా నిద్రలేనివారికి కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేేసే మహిళలతో పోలిస్తే.. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో బ్రెస్ట్ కేన్సర్ త్వరగా వస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

           తక్కువ నిద్రపోతే కేన్సర్ ఎలా వస్తుందనే విషయం ఇంతవరకూ వైద్యులకు కూడా అంతుబట్టలేదు. అయితే ఆధునీకరణ పెరిగాక.. మనిషి నిద్రపోయే సమయం తగ్గుతూ వస్తోందని అందరూ అంగీకరిస్తున్నారు. నిద్రలేమితో కేన్సర్ తో పాటు ఇతర రోగాలు కూడా వస్తాయని ఇప్పటికే కొన్ని ప్రయోగాల్లో తేలింది. కాబట్టి ఇప్పటికైనా కంటినిండా నిద్రపోయి కేన్సర్ ను దూరంగా ఉంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

లివర్ కేన్సర్‌కు పవర్‌ఫుల్ వైద్యం

 

 శరీరంలోని కీలక అవయవాల్లోకెల్లా అతి పెద్దది, అతి ముఖ్యమైనది కాలేయం. ఆ అవయవమే కేన్సర్ బారిన పడితే? ఒకప్పుడైతే ఇది కలవరపెట్టే విషయమే. కానీ, ఆధునిక వైద్య విధానాలు ప్రవేశించాక ఇప్పుడా సమస్య మునుపటిలా కలవరపెట్టే అంశం కాకుండా పోయింది. ప్రత్యేకించి సర్జరీలోనూ, కీమో, రేడియేషన్ థెరపీల్లో వచ్చిన ఆధునిక రీతులు కాలేయ సంబంధమైన కేన్సర్‌ను అధిగమించడం సులభతరం చేశాయి. 

కాకపోతే, లివర్ కేన్సర్ అనగానే డిప్రెషన్‌లోకి జారిపోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, విధిగా వైద్య చికిత్సలు తీసుకుంటే లివర్ కేన్సర్ నుంచి సంపూర్ణంగా విముక్తి పొందడం సాధ్యమేనంటున్నారు కేన్సర్ వ్యాధి నిపుణులు. లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. సహజంగా ఆల్ఫా-ఫీటో-ప్రొటీన్ అనేది శరీరంలో ఒక మిల్లీ మీటర్ లో 10 మేనోగ్రాముల కన్నా తక్కువే ఉంటుంది. అయితే, లివర్ కేన్సర్ ఉన్నవారిలోనూ, అండాశయంలో, వృషణాల్లో కణుతులు ఉన్నవారిలోనూ ఈ ప్రొటీన్ పరిమాణం పెరుగుతుంది. ప్రత్యేకించి లివర్ కేన్సర్ ఉన్నవారిలో ఈ ప్రొటీన్ పరిమాణం 500 మేనోగ్రాముల దాకా పెరుగుతుంది. అయితే , ఎఎఫ్ పి పెరిగినంత మాత్రాన కేన్సర్ వచ్చినట్టు కాదు. కాకపోతే, అలా పెరగడాన్ని ఒక హెచ్చరికగా మాత్ర గుర్తించాలి. 

Tuesday 5 January 2016

చికెన్ తింటే కేన్సర్..!

చికెన్‌ తింటాం…చాలా బాగుంటుంది. మంచిగా వండితే దీనంతటి రుచికరమైన కూర ఇంకొకటి లేదుమరి! అయితే చికెట్‌ తింటే కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని మీకు తెలుసా? ఇది నిజం! చికెన్‌ తింటే కేన్సర్‌ అనేది ఏదో ఒక రూపేణా వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దానికి కారణమేమిటేంటే, కోడిమాంసంలో కేన్సర్‌ వ్యాధికి కారకమయ్యే ‘ఆర్సనిక్‌’ అనే విషపూరితమైన రసాయనం వుంటుంది. ఈ రసాయనమే కేన్సర్‌కు కారణమవుతుంది.

ప్రపంచంలో చికెన్‌ తినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. భారత్‌లో 10 శాతం మినహాయిస్తే దాదాపు అందరూ చికెన్‌ తింటారు. ఆర్సనిక్‌ అనేది ఒక విషపూరితమైన రసాయన పదార్థం. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి కోడిలోనూ ఇది కచ్చితంగా వుంటుంది. ఎందుకంటే ఈ కోళ్ళు స్పీడ్‌గా ఎదగడానికి ఇచ్చే మందులతో ఆర్సనిక్‌ మరింత శక్తివంతమవుతుంది. చికెన్‌ తిన్నప్పుడు ఆర్సనిక్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో ఎర్రరక్తకణాలను ఇది తినేస్తుంది. అదన్నమాట! అందుకే చికెన్‌ తినేటప్పుడు కాస్త ఆలోచించి తినండి!

భారత్ లో అత్యధిక కేన్సర్ మరణాలు

భారత దేశంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు కేన్సర్ వ్యాధి వ‌ల్ల‌నే సంభ‌విస్తున్నాయి.  ఆడవారిలో గతంలో గర్భాశయ కేన్సర్ వల్ల ఎక్కువమంది చనిపోతుండే వారు. ఇప్పుడు బ్రెస్ట్ కేన్సర్ తో చాలామంది చనిపోతున్నారు. ఇక మగవారిలో లంగ్ క్యాన్సర్ ఎక్కువమంది మరణాలకు కార‌ణ‌మ‌వుతోంది.  భారత దేశంలో కాలేయ కేన్సర్ గత 23 ఏళ్ళల్లో 88 శాతం పెరిగింది. జీర్ణకోశ సంబంధ కేన్సర్ 64 శాతం పెరిగింది.

 1999 లో 34,962 మంది మహిళలు గర్భాశయ కేన్సర్ తో మృతి చెందగా  ఈ మధ్య కాలంలో 40,985 మంది మృతి చెందారు.  అదే సంవత్సరంలో బ్రెస్ట్ కేన్సర్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 47,587 వరకు ఉంది. గర్భాశయ కేన్సర్ వృద్ధి 0.2 శాతానికి పడిపోయింది. అందుకు ప్రధాన కారణాలు ఆలస్యంగా వివాహాలు జరుగుతూ ఉండడం, పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుతూ ఉండడం, మంచి ఆరోగ్య అలవాట్లు .

Monday 4 January 2016

కేన్సర్ నివారణకు ‘లక్ష్మణచెట్టు’

లక్ష్మణ చెట్టు శాస్తీయ నామం GRAVIOLA. ఆ చెట్టే పెంచడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కలుషిత వాతావరణం , మందులతో కల్తీ అయిన ఆహారం వల్ల అన్నింటి కంటే వేగంగా వచ్చేది, మరియు నివారణ అనేది లేనిది, వైద్యం కూడా అతి ఖర్చుతో కూడుకున్న వ్యాది ఏమిటి అంటే “కేన్సర్”. ఈ చెట్టు నుండి వచ్చే వేరులు, బెరడు, ఆకులు ,ఫలాలు ప్రతీ ఉత్పన్నం కూడా కేన్సర్ నివారించడంలో సమర్ధవంతంగా , కీమో థెరపీ కి 10000 రెట్ల ప్రభావం  పనిచేస్తాయి.

graviola-contra-o-cancer

ప్రస్తుతం మన దేశంలో కేవలం కేన్సర్ రిసర్చ్ సెంటర్ లలో మాత్రమే ఈ చెట్లు, వాటి ఫలాలు లభ్యమవుతున్నాయి. వాటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ గ్రామాలలో దీని విలువ తెలియని వారు ఆ ఫలాలను వృధాగా పారవేస్తున్నారు. అందుకే ఒకవైపు పచ్చదనం, రెండోవైపు కాన్సర్ గురించి గ్రామాలలో అవగాహన ఇస్తూ ఈ చెట్లను పెంచడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు. 

"కేన్సర్" అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది?

కేన్సరు అనేది కొత్త వ్యాధికాదు. పురాతనకాలంలో దీన్ని "రాచపుండు" అని అనేవారు. అయితే సామాన్యులకు కాక రాజులకే ఎందుకు వస్తుంది? బహుశా రాజుల భోగలాలస జీవితం వలనేమో. ఇంకొకటైనా కావచ్చు. రాజులకొస్తే అది ప్రజలందరికీ వార్తా విశేషం, కాని సామాన్య పౌరుడికొస్తే ఎవరు పట్టించుకుంటారు. అదలా వుంచితే, కేన్సర్ అనే పదానికి గ్రీకులో "యెండ్రకాయ" లేదా "పీత" అని అర్థం. పీతకు ఎలా అయితే శరీరం మధ్యనుండి నలువైపులా విస్తరించినట్లు కాళ్ళు ఉంటాయో, కేన్సరు అదే పద్ధతిలో వ్యాప్తిచెందటం వలన దానిని "కేన్సరు" గా నామకరణం చేసారు. కర్కాటక రాశిని ఆంగ్లంలో కేన్సర్ అంటారు, దాని రాశిగుర్తు పీత. హిప్పోక్రేట్స్  అనే గ్రీకు తత్వవేత్త దీన్ని "కార్కినోమా" అని వర్ణించాడు. ఈ పదాన్నే ఆంగ్లంలో "కార్సినోమా" అంటారు. 
 
          అయితే అప్పటికీ ఇప్పటికీ శాస్త్రీయ విజ్ఞానం చాల అభివృద్ధి చెందింది. కేన్సరు గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. మౌలికంగా, కేన్సరుకు కారణాలు మన జీవినసరళి . ముఖ్యంగా మూడు స్థూలమైన కారణాలు కేన్సర్ ను కలుగజేస్తాయి.  అవి భౌతికమైనవి , రసాయనిక పదార్థాలు , జీవ సంబంధమైనవి . ఈ మూడు రకాల కారకాల తో పరస్పర సంబంధం వలన మన శరీరంలోని మౌలికమైన కణాల అనువంశిక పదార్థమైన జన్యువు లో ఉత్పరివర్తనాలు వస్తాయి.

ప్రసూతి మరణాలు కన్నా కేన్సర్‌ మరణాలే అధికం


ప్రసూతి మరణాల కంటే వివిధ కేన్సర్లతోనే మహిళలు అధికంగా చనిపోతున్నారని, దేశంలో ఏటా లక్షా 23 వేల కేన్సర్‌ కేసులను గుర్తిస్తే, వీరిలో దాదాపు 66 వేల మంది బ్రెస్ట్‌, గర్భాశయ  కేన్సర్లతో చనిపోతున్నారని అసోసియేషన ఆఫ్‌ గైనకాలజిక్‌ అంకాలజిస్టు ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. గర్భాశయ కేన్సర్లు తగ్గుతున్నప్పటికీ బ్రెస్ట్‌ కేన్సర్లు పెరుగుతున్నాయని, ఈ రెండు కేన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చని ఈ సంఘం పేర్కొంది. 

శారీరకంగా బరువు పెరగడం వల్ల రొమ్ము కేన్సర్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  రాత్రివేళల్లో ఉద్యోగాలు, గాలి వెలుతురు పరిమితంగా ఉన్న ఆఫీసుల్లో పనిచేయడం, ఏది పడితే అది తినడం.. తదితర కారణాల వల్ల హార్మోన్లలో సమతుల్యం దెబ్బతింటుందని  వివరించారు. లేటు వయసు పెళ్లి చేసుకోవడం, లేటు వయసులో పిల్లల్ని కనడం వల్ల కూడా బ్రెస్ట్‌ కేన్సర్లకు గురయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. 

ఈ కేన్సర్ అంటు వ్యాధి !










  • సాధారణంగా శరీరంలో చెడు కణాలు వ్యాప్తి చెందడం మూలాన కేన్సర్‌ వస్తుంది! అయితే.. సోకడం అనేది చాలా అరుదు! అలాంటి కేన్సర్‌లు ఒకటి రెండు రకాలు మాత్రమే! అదే ఇన్నాళ్లూ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ప్రస్తుతం ఆ నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నారు? కారణం.. వైరస్‌ వల్ల సోకే కేన్సర్‌ను ఆసే్ట్రలియా దీవి అయిన టాస్మానియాలో శాస్త్రవేత్తలు గుర్తించారు. 

  • టాస్మానియా యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో.. కుక్కపిల్లల్లా ఉండే టాస్మానియన్‌ డెవిల్స్‌ అనే వన్య ప్రాణుల్లో గుర్తించారు. టాస్మానియాకే పరిమితమైన ఈ అరుదైన ప్రాణుల ముఖాలపై ఏర్పడే కణతుల (కేన్సర్‌) వల్ల ఈ అరుదైన కేన్సర్‌ వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. అవి మేటింగ్‌ (రతి) చేసే సమయంలో పరస్పరం ముఖాలపై కరచుకుంటాయని, తద్వారా అందులోని కేన్సర్‌ కణాలు ఒక జంతువు నుంచి మరో జంతువుకు వ్యాపిస్తున్నాయని తెలిపారు. 

Saturday 2 January 2016

త్వరలో కేన్సర్ వ్యాధికీ మాత్రలు


భవిష్యత్తులో కేన్సర్ వ్యాధిని కూడా పూర్తిగా మాత్రలతో నివారించడానికి వీలు కాబోతోంది. ఇది నిజంగా కేన్సర్ రోగులకు  శుభవార్తే. ఈ మహమ్మారి సోకిందని ఆందోళన చెందాల్సిన అగత్యం ఉండకపోవచ్చు. బీపీ, షుగర్ మాదిరిగానే కేన్సర్ వ్యాధిని కూడా అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  ఈ రకం మందులు ఇప్పటికే కొన్ని మార్కెట్లో ప్రవేశించాయని ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. మరో అయిదేళ్ళలో మరికొన్ని కూడా రాబోతున్నాయని ఆయన తెలిపారు.

ఈ రకం మాత్రలపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు పూర్తి చేశారని, ఇక భారతీయ మార్కెట్లోకి రావడమే మిగిలి ఉందని ఆయన చెప్పారు. మరో నాలుగైదు ఏళ్ల  తరువాత కీమొథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల కన్నా పూర్తిగా మాత్రల సహాయంతో దీన్ని నియంత్రించ వచ్చనీ, ఈ వ్యాధికి భయపడాల్సిన అవసరం ఉండదనీ, ఇక ఇది ప్రాణాంతకం కాకపొవచ్చనీ ఆయన చెప్పారు.  కణాలపై కేన్సర్ కారకాలు పడకుండా ఈ మాత్రలు పనిచేస్తాయని ఆయన వివరించారు.

కేన్సర్ చికిత్సకు కస్టమైజ్డ్ మెడిసిన్


ల్యాబ్ పీ53... కేన్సర్ వ్యాధి చికిత్సపై పరిశోధనలు చేస్తున్న సంస్థ. కేన్సర్ చాలా క్రూరమైన జబ్బు. దీని బారిన పడితే... అంతర్గతంగా వచ్చే ఇతరత్రా వ్యాధులు, సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. కేన్సర్ చికిత్స కూడా చాలా రిస్క్ అనే చెబ్తారు డాక్టర్లు. జాగ్రత్తగా ఉండకపోతే... ప్రాణం పోయాల్సిన ఔషధం... గంటల వ్యవధిలోనే ఆయువు తీసే ప్రమాదం కూడా ఉంటుంది.

ఏ ఇద్దరూ ఒకలా ఉండరు అన్న మాదిరిగానే... ఓ ఇద్దరి డీఎన్ఏలూ కూడా కలవవు. ఇదే ఔషధాలు ప్రాణం తీసేలా మారడానికి కారణమనే అంచనాలున్నాయి. జన్యుపరమైన ఈ తరహా అంతరాలను గుర్తించి... డీఎన్ఏను డీకోడ్ చేసి, రోగికి తగిన మందు ఇవ్వడంపై పరిశోధనలు చేస్తోంది ల్యాబ్ పీ53. అయితే ఇతర చికిత్సల మాదిరిగా కాకుండా... ఈ తరహా జెనెటిక్ పరీక్షలకు చాలా పెద్దమొత్తంలో ఖర్చవుతుంది.

Friday 1 January 2016

కొత్త రూపం దాల్చుతున్న కేన్సర్ మహమ్మారి

జన్యువులలో వంశపారంపర్యంగా వచ్చే పరివర్తనాలు 12 రకాల కేన్సర్లకు దారితీస్తున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. జన్యుపరమైన మార్పులతో కేన్సర్‌ వస్తుందనే విషయం గతంలోనే వెల్లడైంది. అయితే, ఈ పరివర్తనాలు అకస్మాత్తుగా రావడం లేదని, తరాల తరబడి వీటి ప్రభావం కొనసాగుతోందని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. 

ఒక్కో తరంలో డీఎన్‌ఏలో నిర్ధుష్టంగా జరుగుతున్న మార్పులు చివరకు కేన్సర్‌కు దారితీస్తున్నాయని వివరించారు. ప్రధానంగా వీటిలో అండాశయ, స్టమక్‌, రొమ్ము, ప్రోస్టేట్‌, లంగ్‌ , గ్లియోమా, తల మరియు మెడ, ఎండోమెట్రియల్‌, కిడ్నీ, గ్లియోబ్లాస్టోమా, అక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా కేన్సర్లకు కారణం వంశపారంపర్యంగా వచ్చే డీఎన్‌ఏ మార్పులేనని స్పష్టం చేశారు.
 

2030కి రొమ్ము కేన్సర్‌ కేసులు రెట్టింపు


 దేశంలో 2030 నాటికి మహిళల్లో కొత్త రొమ్ము కేన్సర్‌ కేసుల సంఖ్య రెట్టింపు కానుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతేడాది దేశంలో 97,328 కొత్త కేసులు నమోదు కాగా, ఈ సంఖ్య మరో పదిహేనేళ్లలో 1,84,000కు పెరగవచ్చని అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు. 


భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనం మేరకు.. బెంగళూరు, చెన్నై, ముంబైలలో 35-44 ఏళ్ల మధ్యవారిలో, ఢిల్లీలో 45-54 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో రొమ్ము కేన్సర్‌ ముప్పు పెరుగుతోందని పేర్కొన్నారు.