Thursday, 13 June 2019

రక్తదాతలకు వందనాలు

అన్నిదానాల కంటే రక్తదానం మిన్న. ఎందుకంటే మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే.. ఆ మనిషిని భూమ్మీదకు తీసుకొచ్చేది తల్లి మాత్రమే. కానీ రక్తదాత మాత్రం తనకు తెలియకుండానే ఎన్నో ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది. తాను  ఎవరికి రక్తం దానం ఇస్తున్నాడో తెలియకుండానే.. నిస్వార్థంగా ఓ ప్రాణం నిలబెట్టడం చిన్న విషయం కాదు. మనిషిలో దేవుడున్నాడని చెప్పేందుకే ఇదే అతిపెద్ద ఉదాహరణ. రెగ్యులర్ గా రక్తదానం చేస్తూ.. ఎందరికో ఊపిరి పోస్తున్న రక్తదాతలందరికీ వందనాలు. 

రక్తదానం తర్వాత..?


రక్తదానం చేస్తే ఇన్‌ఫెక్షన్లు వస్తాయనేది అపోహ మాత్రమే.. శుభ్రమైన(స్టెరైల్‌) పరికరాలు వాడితే ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.
ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తవు. రక్తదానం తర్వాత కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే చాలు.
ఒకసారి రక్తదానం చేయడానికి గంటకన్నా ఎక్కువ సమయం పట్టదు.
రక్తదానం చేసిన తర్వాత హిమోగ్లోబిన్‌ పడిపోతుందనేది కొందరి అపోహ.
ఒకసారి 400 మి.లీ కంటే తక్కువ తీసుకుంటారు. మన శరీరం దీనిని చాలా త్వరగానే భర్తీ చేసుకుంటుంది.
క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
ఇక ఎదురుచూపులు మానుకోవాలి…
మనం బతికున్నప్పుడు మన కళ్ళముందు.. మన ద్వారా మరొకరి ప్రాణం కాపాడాము అనే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేము.కానీ, చాలామంది తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బాగోలేకపోతే ఎవరు రక్తదానం చేస్తారా? అని ఎదురు చూస్తారే తప్ప మనమే ఎందుకు రక్తదానం చెయ్యకూడదు అని ఆలోచించరు.

మేము ఇవ్వలేము.. మా వల్ల కాదు..అనే ఇటువంటి ఆలోచనా విధానాలు ఇకనైనా మానాలి. మేము కూడా ఇవ్వగలము.. అనే ఆలోచన రావాలి.

మీరు కూడా రక్తదాతలు అవ్వండి..ప్రాణదాతలు కండి..

రక్తదాత ఎలా ఉండాలి..?

రక్తదాత ఎలా ఉండాలి?

రక్తదాతలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి.
45 కేజీల పైబడి బరువుండాలి.
సాధారణ స్థాయిలో బీపీ, షుగర్‌ ఉండాలి.
18-60 మధ్య వయసు కలిగిన స్త్రీ, పురుషులు రక్తదానం చేయవచ్చు.
3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు.
రక్తదానం చేయడానికి 12 గంటల ముందు, తర్వాత ఆల్కాహాల్‌ తీసుకోకూడదు.
స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకు రక్తదానం చేయకూడదు.
.
                                                                                                    -swapnika rehaప్రపంచ రక్తదాన దినోత్సవం

wecare@bajajfinserv.inప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్తంగా జూన్ 14 వ తేదిని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రజల్లో రక్తదానం యొక్క ప్రాముఖ్యతను మరియు అవగాహనను పెంచి, సరైన సమయంలో సురక్షిత రక్త లభ్యతతో ప్రపంచవ్యాప్తంగా మహిళల మరణాలను తగ్గించడం ఈ ఆరోగ్య దినోత్సవ అంతిమ లక్ష్యం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 800 మంది మహిళలు ప్రసవసమయంలో ఏర్పడే ఇబ్బందులతో మరణిస్తున్నారు. ప్రసవసమయంలో మహిళల్లో జరిగే తీవ్రరక్తస్రావం ఈ మరణాలకు గల ప్రధాన కారణం.

ప్రసవ సమయంలో తీవ్రరక్తస్రావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరణిస్తున్న మహిళలు

• ఆఫ్రికా: 34 శాతం
• ఆసియా: 31 శాతం
• లాటిన్ అమెరికా & కరీబియన్: 21 శాతం


రక్తమార్పిడి విధానానికి ఆద్యుడైన కార్ల్ ల్యాండ్ స్టీనర్ జన్మదినానికి గుర్తుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004వ సంవత్సరంలో జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరపడం మొదలుపెట్టింది. కేవలం ప్రసవ సమయంలో మహిళలకే కాకుండా, రోడ్డు ప్రమాదాలు, పెద్దాపరేషన్ల సమయంలో రోగులకు కూడా చాలా రక్తం అవసరమౌతుంది. ఇలాంటప్పుడు రక్తనిధి కేంద్రాల అవసరం ఎంతో ఉంటుంది. అందుకే ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది.