Thursday 13 June 2019

ప్రపంచ రక్తదాన దినోత్సవం

wecare@bajajfinserv.in



ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్తంగా జూన్ 14 వ తేదిని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రజల్లో రక్తదానం యొక్క ప్రాముఖ్యతను మరియు అవగాహనను పెంచి, సరైన సమయంలో సురక్షిత రక్త లభ్యతతో ప్రపంచవ్యాప్తంగా మహిళల మరణాలను తగ్గించడం ఈ ఆరోగ్య దినోత్సవ అంతిమ లక్ష్యం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 800 మంది మహిళలు ప్రసవసమయంలో ఏర్పడే ఇబ్బందులతో మరణిస్తున్నారు. ప్రసవసమయంలో మహిళల్లో జరిగే తీవ్రరక్తస్రావం ఈ మరణాలకు గల ప్రధాన కారణం.

ప్రసవ సమయంలో తీవ్రరక్తస్రావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరణిస్తున్న మహిళలు

• ఆఫ్రికా: 34 శాతం
• ఆసియా: 31 శాతం
• లాటిన్ అమెరికా & కరీబియన్: 21 శాతం


రక్తమార్పిడి విధానానికి ఆద్యుడైన కార్ల్ ల్యాండ్ స్టీనర్ జన్మదినానికి గుర్తుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004వ సంవత్సరంలో జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరపడం మొదలుపెట్టింది. కేవలం ప్రసవ సమయంలో మహిళలకే కాకుండా, రోడ్డు ప్రమాదాలు, పెద్దాపరేషన్ల సమయంలో రోగులకు కూడా చాలా రక్తం అవసరమౌతుంది. ఇలాంటప్పుడు రక్తనిధి కేంద్రాల అవసరం ఎంతో ఉంటుంది. అందుకే ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది.




No comments:

Post a Comment