Sunday 10 January 2016

తీపి పానీయాలతో కేన్సర్‌ ముప్పు

నడివయసు వచ్చిన వారు ముఖ్యంగా మహిళలు ఆరోగ్య పరమైన తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. పీరియడ్స్‌ నిలిచిపోయే దశలో ఉన్న మహిళలలో ఈ ఇబ్బంది మరింత అధికమని ఇటీవల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తీపిగా ఉండే పానీయాలు, కార్బొనేటెడ్‌ సోడా ఎక్కువగా తీసుకొనే ఈ తరహా మహిళల్లో కేన్సర్‌ రిస్క్‌ ఎక్కువగా
ఉంటుందని అమెరికన్‌ వైద్య పరిశోధకులు నిర్ధారించారు. మిగిలిన మహిళలతో పోల్చుకుంటే తీయని పానీయాలు తీసుకునే నడివయసు మహిళల్లో కేన్సర్‌ వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుందం టున్నారు.

అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ వారి కేన్సర్‌ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్‌, ప్రివెన్షన్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం తీపి పానీయాలు తీసుకునే నడివయసు మహిళల్లో ఈ సమస్య 70శాతం వరకూ సంభవించే అవకాశం ఉందని తేలింది. టైప్‌-1 ఎండోమెట్రియల్‌ కేన్సర్‌తోపాటు స్థూలకాయం సమస్య తలెత్తుతాయని, సాధారణ మహిళల్లో కన్నా వీరిలో 50శాతానికి పైగా ఎక్కువ అవకాశం
ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దాదాపు 23వేల మంది నడివయసు ముఖ్యంగా పీరియడ్స్‌ ఆగిపోయే దశలో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం ఆధారంగా ఈ పరిశీలనలు చేశారు.

No comments:

Post a Comment