Friday 4 November 2016

చెడు అలవాట్లతో కేన్సర్ ముప్పు




సిటీల్లో  రోడ్ల మీద ఎలాంటి మాస్కులు, హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఒక్క గంట సేపు తిరిగితే చాలు.. ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొంది.  పెరుగుతోన్న వాహన కాలుష్యంతో కనీసం స్వచ్ఛమైన గాలి కూడా కరవైంది. హైదరాబాద్ గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాముల వరకు పర్టిక్యులేట్ మేటర్  ఉండవచ్చని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు వెల్లడిస్తున్నాయి. అది ఇప్పుడు 95 మైక్రో గ్రాములకు చేరింది.


                    జంటనగర వాసులు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనానికి వారి ఆహారపు అలవాట్లు అంటే జంక్ ఫుడ్ తినడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల వల్ల కూడా కేన్సర్ వస్తుందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, మామూలు ఆస్తమా నుంచి ఊపిరితిత్తుల కేన్సర్, గుండెపోటుతో సహా అనేక రకాల జబ్బులు వచ్చే ప్రమాదముంది. ఇక, ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల నుంచి వెలువడుతోన్న పొగలో ఉండే కాలుష్య కారకాలతో పలు రకాల కేన్సర్లు వస్తాయని వైద్య నిఫుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా కనపడుతోంది. లంగ్ కేన్సర్ రావడానికి ఇదే ప్రధాన కారణమని పల్మనాలజిస్టులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment