Saturday 5 November 2016

ఉమ్మిలో నెత్తురు పడితే.. కేన్సరే


సాధారణంగా ఉమ్మిలో నెత్తురు ముక్కునుంచి రక్తం కారిన కొంతసేపటి తరువాతనైనా కనిపి స్తుంది, లేదా బ్రష్‌తో బలంగా దంతధావనం చేసి నప్పుడు చిగుళ్లకు గాయం కావడం వల్లనైనా కనిపి స్తుంది. లేకపోతే శ్వాస మార్గంలో ఎక్కడైనా ఇన్‌ ఫెక్షన్‌కావటం, ఇరిటేట్‌ కావటం వల్లనైనా ఉమ్మిలో నెత్తురు కనిపించవచ్చు.కళ్లెలో రక్తం పడటానికి మరొక ప్రధాన కారణం ఏమిటంటే గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తులలో ప్రయా ణించటం. ఊపిరితిత్తులకు కేన్సర్‌ సోకటం వలన కూడా కళ్లెలో రక్తం కనిపిస్తుంది. అయితే ఈ రెండు కారణాలూ చాలా అరుదు. మీరు దగ్గిన ప్పుడు లేదా ఉమ్మివేసినప్పుడు ఉమ్మిలో రక్తంలో కనిపిస్తే ఈ కింది కారణాల్లో ఏదో ఒకటి కారణమై ఉండవచ్చునని భావించాలి. కళ్లె ఏ రంగులో ఉంది? ఏ సందర్భంలో రక్తం పడింది అనే విష యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
          


 కొద్ది రోజులు, వారాలనుండి విడవకుండా కఫంలో రక్తం చారికలు కనిపిస్తుంటే ఒకప్పుడు దానిని డాక్టర్లు మొట్టమొదట టిబిగా సందేహించే వారు. సమాజంలో ఇప్పుడు టిబి చాలా వరకూ తగ్గిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ లక్షణం కనిపిస్తే క్రానిక్‌ బ్రాంకైటిస్‌ బాగా ముదిరిపోతే వచ్చే బ్రాంకిఎక్టాసిస్‌గా సందేహించడం జరుగుతుంది.బ్రాంకిఎక్టాసిస్‌లో ఊపిరితిత్తుల తాలూకు శ్వాస గొట్టాలు ఏ భాగంలోనైనా విశాలం కావడమో, బల హీనపడటమో జరుగుతుంది. ఈ రోగులకు సైనస్‌ సమస్య కూడా ఉంటుంది. మనిషికి ఒకసారి బ్రాంకిఎక్టాసిస్‌ వచ్చిందంటే శాశ్వతంగా ఉండిపో తుంది. దీర్ఘకాలం యాంటి బయాటిక్స్‌ వాడటం, ఛాతీకి ఫిజియోథెరపీ అవసరమవుతాయి.

No comments:

Post a Comment