Wednesday 9 November 2016

పాప్ కార్న్ తో జర భద్రం



పాప్ కార్న్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు. పెద్దల దగ్గర్నుంచి పిల్లల వరకు పాప్ కార్న్ కి ఫ్యాన్స్ ఎక్కువే. ఇది ఓ టైం పాస్ స్నాక్. ఒకప్పుడు మాల్స్ లోనో, సినిమా హాల్స్ లోనో పాప్ కార్న్ దొరికేది. కానీ ఇప్పుడు బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్ , పార్క్ లు ఇలా ఏ ప్లేస్ లో చూసినా పాప్ కార్న్ దొరకుతోంది. అంతేకాదు ఇప్పుడు ఇంట్లోనే టైంపాస్ కి ఐదు నిమిషాల్లో తయారుచేసుకునే విధంగా పాప్ కార్న్స్ వచ్చేశాయి. ఇందులో చాలా ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి.
      

ఇధంతా బాగానే ఉంది. కానీ టైంపాస్ కి తినే పాప్ కార్న్ భారీ మూల్యం చెల్లించమని అడుగుతోంది. అవును అసలు విషయం ఏంటంే పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మైక్రోవేవ్ పాప్ కార్న్ తో లంగ్ కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. మైక్రోవేవ్ పాప్ కార్న్ లో ఉండే డియాసిటైల్ అనే కెమికల్ వల్ల లంగ్ కేన్సర్ ప్రమాదం ఉందట. అందువల్ల మైక్రోవేవ్ పాప్ కార్న్ ను తినడం మానేయాలని హెచ్చరిస్తున్నారు. పాప్ కార్న్ ప్రియులకు బ్యాడ్ న్యూసే అయినా మానేయక తప్పదు కదా.

No comments:

Post a Comment