Friday 11 November 2016

పిల్లల వద్ద పొగ తాగితే మీకే నష్టం

లండన్: పొగతాగే వారి పక్కనవుంటే దాని చెడు ప్రభావం వారిపై కూడా వుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అయితే, ఇపుడు తాజాగా పొగతాగే వారి పక్కన కనుక పిల్లలు, యుక్తవయస్కులు వుంటే వారికి వినికిడి కొరవడుతుందని కూడా మరో అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ విశ్వవిద్యాలయం 12 సంవత్సరాలనుండి 19 సంవత్సరాల వయసుకల 1500 మంది పిల్లలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించి పొగ పీల్చిన కారణంగా నత్త ఆకారంలో వున్న వారి లోపలి చెవి భాగంలో సమస్యలు వచ్చాయని తేల్చారు. సైంటిస్టుల మేరకు, పాసివ్ స్మాకింగ్ చెవి లోపలి భాగాలకు రక్తసరఫరా ఆటంకపరచి పిల్లలకు, చెప్పేది అవగాహన చేసుకోకుండా చేస్తుందని దానితో వారు చదువులలో వెనుకబడటం, పాఠశాలలో అల్లరి చిల్లరిగా ప్రవర్తించటం చేస్తారని చెపుతున్నారు.


           సాధారణంగా ఈ వినికిడిలోపం వయసు మళ్ళిన వారిలోను లేదా పుటుకతోనే వినికిడి సమస్య వున్న వారికి వుంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మైకేల్ వీజ్ మన్ తెలియజేస్తున్నారు. పాసివ్ స్మాకింగ్ పై చేయబడిన పరిశోధనలు ఇప్పటికే ఆస్తమా, గుండె జబ్బులు, లంగ్ కేన్సర్ మొదలైన ప్రభావాలు చూపుతున్నాయని తెలుపబడింది. ప్రస్తుత అధ్యయనంకుగాను పరిశోధకులు యుక్తవయస్కులపై విస్తృత పరిశోధనలు చేశారు. పొగ తాగే వారి పక్కన వున్న పిల్లలకు, పొగతాగని వారి పక్కన వున్న పిల్లలకు మధ్య ఈ వినికిడి లోపం ఏర్పడుతోందని గుర్తించారు.

No comments:

Post a Comment