Friday 14 July 2017

కేన్సర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్ లను తగ్గించే ఆహార ప్రణాళికలు




కీమోథెరపీ మరియు రేడియోథెరపీలను కేన్సర్ వ్యాధి తగ్గించుటకు వాడే చికిత్సలని దాదాపు అందరికి తెలిసిందే. ఈ చికిత్సల వలన లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి, అదెలాగంటే ఈ చికిత్సల వలన శరీరంలో ఉన్న కేన్సర్ కణాలు మాత్రమే కాదు, ఆరోగ్యకర కణాలు కూడా ప్రమాదానికి గురవుతాయి. ఈ చికిత్సలలో రుచి, స్పర్శ, వాసన గ్రంధులు మరియు ఆకలి వంటివి తగ్గిపోతాయి. ఆకలిగా అనిపించకపోవటం వలన ఎక్కువగా తినలేరు మరియు తినే ఆహారం యొక్క వాసన, రుచి కూడా గ్రహించలేరు. ఫలితంగా బరువు తగ్గుతుంది. కావున రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవటం ద్వారా ఈ సమస్యలను కొద్ది వరకైనా తగ్గించుకోవచ్చు.



కీమోథెరపీ చికిత్స  ఆకలి కోల్పోతారు కావున, ఆకలి అయిన కాకపోయిన రోజు సమయానికి ఆహరం తినండి.  భోజనానికి మధ్యలో అధిక కెలోరీలు గల ఆహరం, అధిక ప్రోటీన్ లు కలిగిన చీస్, పీ నట్ బటర్, ఉడికించిన గుడ్లు, పోషకాలను అందించే డ్రింక్స్ ను తాగండి. మీరు తాగే సూప్, వండిన తృణధాన్యాలు మరియు కూరగాయలకు క్రీమ్ లేదా బటర్ కలిపటం ద్వారా తీసుకునే కేలోరీల సంఖ్య కూడా అధికం అవుతుంది. తినే మాంసానికి సోయా సాస్ తో మారినేట్ చేయటం మరియు ఫ్యాట్ లేని డ్రెస్సింగ్ ల వంటివి చాలా ఆరోగ్యకరం. అదనంగా ఉల్లిపాయ, వెల్లుల్లి, కారంపొడి, ఆవాలు మరియు కెచప్ వంటివి కొద్దిగా కలపటం వలన మీ రుచి గ్రాహకాలకు రుచి తెలుస్తుంది.

No comments:

Post a Comment