నల్లగా ఉన్నామనే న్యూనతతో నలుగురితో కలవలేకపోతున్నారా...? అయితే మా ఫేస్‌క్రీమ్ వాడండి! తెల్లగా అవుతారు. అరె! మీరు నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నచ్చక... ఎంతకీ పెళ్లి కావడంలేదా...? అయితే మా క్రీమ్ వాడిన వారంలోనే మీకు పెళ్లి ఖాయం. మగవారి అందాన్నీ మరింత ఇనుమడింపజేసేందుకు ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేసింది సరికొత్త ఫేస్ క్రీమ్... ఇలా ఉంటాయి ఫేస్ క్రీమ్ కంపెనీల ప్రకటనలు. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోయి ఫేస్ క్రీమ్‌లు తెగ పులుమేసుకుంటున్నారా...? రంగు మారడం మాటేమోకాని ముందుగానే ముఖంపై ముడుతలు, ఆ తరువాత కేన్సర్ ఖాయం అంటున్నారు నిపుణులు. ఫేస్ క్రీం ఏ కంపెనీదైనా తయారీలోలో హైడ్రోక్వినాన్ అనే రసాయనాన్ని వాడతారు.
ఫేస్‌క్రీమ్ రాసిన చోట ఈ రసాయనం వల్ల నిగారింపు వస్తుంది. మెలనిన్ తయారు కావడం ఆగిపోయి చర్మం కింద కరల్ సెల్స్ తయారవుతాయి. రసాయనాలతో కూడిన ఈ ఫేస్ క్ర్రీమ్‌లు వాడడం వల్ల వచ్చే నిగారింపు తాత్కాలికమే. దీని వల్ల చర్యంపై ముడుతలు త్వరితంగా ఏర్పడి వృద్దాప్య ఛాయలు చిన్న వయసులోనే కనబడతాయి. దీర్ఘకాలంలో ఇది చర్మ కేన్సర్‌కు దారి తీస్తుంది. అందు వల్ల సహజంగా లభించే వృక్ష సంబంధమైన వాటితో చర్మ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి చర్మానికి అది అన్ని విధాలా మంచిది. ఇలా వచ్చిన నిగారింపు ఎక్కువకాలం నిలక డగా ఉంటుంది, సహజంగా వయసు రీత్యా ముఖంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను వాయిదా వేస్తుంది. కాంతి వంతమైన చర్మం కలిగి నవారు నల్లగా ఉన్నా అందం గానే ఉంటారనే విషయా న్ని ముందుగా గమనించాలి.
No comments:
Post a Comment