రొమ్ముకేన్సర్ బాధితులు చికిత్స ద్వారా కణితిని తొలగించుకున్నా ముప్పు పూర్తిస్థాయిలో తప్పినట్లుకాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కణితిని తొలగించిన రెండు దశాబ్దాల తర్వాత కూడా కేన్సర్ కారణంగా చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో రొమ్ము కేన్సర్ చికిత్స తర్వాత బాధితుల ప్రాణాపాయ ముప్పును పరీక్షించే
సరికొత్త పరీక్షను అభివృద్ధి చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ మాలిక్యులర్ పరీక్షలో బాధితులకు ప్రమాదం పెద్దగా లేదని తేలితే.. వారికి అందించే చికిత్స తీవ్రతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో చికిత్స కారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని వర్సిటీ ప్రొఫెసర్ లారా జే ఎసెర్‌మాన్ వివరించారు.
No comments:
Post a Comment