Saturday 29 July 2017

అనారోగ్య జీవనశైలితో పెద్దపేగు కేన్సర్

జీవనశైలి మార్పుల కారణంగా వస్తున్న ప్రాణాంతక సమస్యల్లో పెద్దపేగు కేన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ తరహా కేన్సర్ కేసులు పెరగటం ఏంటో ఆందోళన కలిగిస్తోన్న అంశం. అయితే సమస్యకు గల కారణాలను అవగాహన చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను నివారించటం సాధ్యమే. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్ధాలు మలంగా మారతాయి. దీనిని బయటికి పంపటమే పెద్దపేగు పని. పెద్దపేగు(కొలన్)కు సోకిన కేన్సర్ ను  కొలన్ కేన్సర్ అనీ, పెద్దపేగు చివరి భాగమైన పాయువుకు సోకితే రెక్టల్ కేన్సర్ అంటారు.




ఈ తరహా కేన్సర్ సోకినప్పుడు పేగు బిగుసుకు పోవటం, పేగులోపల తిత్తులు(పాలిప్స్) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు అసలు కనిపించక పోవచ్చు. పెద్దపేగు కేన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా రాదని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా 15 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించటం అవసరం. ఎంత ముందుగా సమస్యను గుర్తించగలిగితే అంత  సమర్ధవంతంగా దీన్ని నయం చేయవచ్చు. సమస్యను ప్రాథమిక స్థాయిలో గుర్తించే పలు ఆధునిక పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment