Sunday 16 July 2017

50 దాటిన తర్వాతే ఎక్కువగా కేన్సర్‌!

ఇన్నేళ్ల పరిశోధనల తర్వాత కూడా కేన్సర్‌ విషయంలో మనకు ప్రశ్నలే ఎక్కువ. సమాధానాలు తక్కువ. ఉదాహరణకు పొగాకు తాగేవారికి లంగ్‌ కేన్సర్‌ వస్తే- కారణం ఏమిటో మనం గమనించగలుగుతాం. జీవితంలో పొగాకు ముట్టని వాళ్లకు కేన్సర్‌ వస్తే- ఎందుకు వచ్చిందో తెలియదు. జన్యు కారణాల వల్ల రావచ్చు. జీవన శైలి వల్ల రావచ్చు. ఇక- మన దేశంలో 80 శాతం కేసుల్లో రెండో, మూడో స్టేజీల్లోనే క్యాన్సర్‌ వచ్చిందని తెలుస్తుంది. ఈ దశ లో కేన్సర్‌ నివారణ కష్టమవుతుంది. లక్షలు ఖర్చు పెట్టినా గ్యారంటీ ఉండదు. అందువల్లే కేన్సర్‌ చాలా ప్రమాదకరం.



అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వయస్సు ఉన్నవారి దాకా ఎవరికైనా రావచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే- 50 ఏళ్లు దాటిన వారికే కేన్సర్‌ ఎక్కువ వస్తోంది. ఇటీవల కాలంలో 21 ఏళ్ల వయస్సు దాటిన వారందరినీ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకొమ్మని సలహా ఇస్తున్నారు. కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారణ అవకాశాలు ఎక్కువ. చిన్న పిల్లలకు కూడా కేన్సర్‌ రావటం బాగా పెరిగింది.


No comments:

Post a Comment