Sunday 9 July 2017

టాల్కమ్ పౌడర్ వలన కేన్సర్ వస్తుందా?



టాల్క్ అనేది ఖనిజం, దీనిని ప్రధానంగా మాగ్నీషియం, సిలికాన్ మరియు ఆక్సిజన్‌లతో తయారు చేస్తారు. టాల్కమ్ పౌడర్,  బేబీ పౌడర్ మరియు ఇతర కాస్మోటిక్ ఉత్పత్తుల్లో దీని వినియోగం అధికం. టాల్క్ ఖనిజంలోని కొన్ని అంశాలు వాటి సహజ స్థితిలో కేన్సర్ వ్యాపించే పదార్థం  రాతినారను కలిగి ఉంటాయి. అయితే, రాతినార గల టాల్క్ వినియోగం చాలాకాలం క్రితమే నిలిపివేసినట్లు చెబుతున్నారు. ప్రయోగశాలలోని చిట్టెలుక, ఎలుకలు మరియు హ్యామ్‌స్టెర్‌లపై రాతినార లేని టాల్క్‌ను ఉపయోగించి నిర్వహించిన అధ్యయనాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.  జననావయవ ప్రాంతం, శానిటరీ నాప్కిన్స్,  కండోమ్‌లు లేదా డయాఫ్రేమ్‌ల్లో ఉపయోగించడం వలన పౌడర్ యోనిలోకి ప్రవేశించి, తర్వాత గర్భాశయానికి, స్త్రీ బీజవాహిక నాళాలకు, వాటి ద్వారా అండశయాలకు చేరుకుని, అండాశయ కేన్సర్‌కు కారణం కావచ్చు.





           

 ఈ ప్రయోగాల ఫలితంగా తేలిందేమిటంటే.. రాతినార కల టాల్కమ్ తో కేన్సర్ ఖాయమని రూఢీ అయింది. కానీ ఇప్పుడు వచ్చే టాల్కమ్ పౌడర్లలో రాతినార వాడటం లేదని కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఇది నిజమా.. కాదా అనే అనుమానాలు చాలా మంది మనసుల్ని తొలుస్తున్నాయి. టాల్క్ వినియోగం, కేన్సర్ కారకానికి సంబంధించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. టాల్క్ గురించి భయం ఉన్నప్పుడు వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


No comments:

Post a Comment