Sunday, 9 July 2017

కిడ్నీ కేన్సర్ ఇలా వస్తుంది

కిడ్నీ కేన్సర్ కలిగే ప్రమాదవకాశాలు కారణంగా వ్యక్తి కేన్సర్ కు గురయ్యే అవకాశాలు కూడా అధికమే. కానీ, ఇవి నేరుగా మూత్రపిండాల కేన్సర్ కలిగించవు. కిడ్నీ కేన్సర్ ను కలిగించే ప్రమాదవకాశాల గురించి తెలుసుకోటవటం వలన వీటికి దూరంగా ఉండవచ్చు లేదా ప్రారంభ దశలోనే వ్యాధి నిర్దారణ జరిపి తగిన చికిత్స అనుసరించవచ్చు. దాదాపు 75 శాతం వరకు కిడ్నీ కేన్సర్ లు 60 సంవత్సరాలు పైబడిన స్త్రీ మరియు పురుషులలో కలుగుతున్నాయని కనుగొన్నారు. ఇందులోనూ స్త్రీలతో పోలిస్తే పురుషులలో అధికంగా కిడ్నీ కేన్సర్ కు గురవుతున్నారు- కిడ్నీ కేన్సర్ కు గురైన ముగ్గురిలో ఇద్దరు పురుషులే కావటం విశేషం. ఆఫ్రికన్- అమెరికన్ లలో కూడా కేన్సర్ వ్యాధికి గురయ్యే వారి సంఖ్య అధికమే.

         వృత్తి పరమైన రసాయనాలకు బహిర్గతం అవటం వలన కూడా కేన్సర్ కలుగుతుంది. కేన్సర్ వ్యాధికి గురైన వారిలో దాదపు 2 ఇద్దరు ఇలా వృత్తి ప్రరమైన రసాయనిక కారకాల వలన పరిశోధనలలో వెల్లడైంది. స్టీల్ ప్లాంట్ లో పని చేసే వారు ఎక్కువ శాతం కోల ఓవెన్లు లకు బహిర్గతం అవటం వలన కిడ్నీ కేన్సర్ కు గురయ్యే అవకాశాలు రెట్టింపు ఉన్నాయి. అంతేకాకుండా, వృత్తి పరంగా కాడ్మియం వంటి వారికి గురయ్యే వారు కిడ్నీ కేన్సర్ ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిగరెట్ లేదా ధూమపానం అలవాటు ఉన్నవారు కిడ్నీ కేన్సర్ కు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దాదాపు కిడ్నీ కేన్సర్ కు గురయ్యే వారిలో 25 శాతం వరకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారే మరియు ఈ అలవాటు వలన ఇతర దుష్ప్రభావాలు కూడా అధికమే. సిగరెట్ తాగే అలవాటు వలన కిడ్నీ కేన్సర్ కలిగే అవకాశాలు రెట్టింపు అవుతాయి. సిగరెట్ కు దూరంగా ఉండటం వలన కిడ్నీ కేన్సర్ కే కాదు ఇతర అనారోగ్యాలకు కూడా దూరంగా ఉండవచ్చు.

No comments:

Post a Comment