బ్రెయిన్ కేన్సర్ వచ్చే ముప్పును ఐదేళ్ల ముందుగానే గుర్తించే వినూత్న రక్తపరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణా లు పొడచూపకున్నా.. రోగాన్ని గుర్తించేలా దీనిని తీర్చిదిద్దినట్లు ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు. బ్రెయిన్ కేన్సర్ నిర్ధారణలో గ్లియోమోలు కీలక పాత్ర పోషిస్తాయట! తాజాగా అభివృద్ధి చేసిన రక్తపరీక్ష వీటిపై దృష్టి సారిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జూడిత వివరించారు.
కేన్సర్లలో ఒక్కోదానికి వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, జ్ఞాపకశక్తి క్షీణించడం, శారీరక మార్పులు, చూపు మసకబారడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాలు బయటపడ్డాక 3 నెలల వ్యవధిలో కేన్సర్‌ను గుర్తించడం సాధ్యమవుతుంది. కానీ కేన్సర్ కణితి అప్పటికే బాగా అడ్వాన్స్ దశకు చేరుకుంటుందన్నారు. కేన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజా ఆవిష్కరణ కేన్సర్ చికిత్సకు మెరుగైన ప్రత్యామ్నాయం అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment