Tuesday 18 July 2017

కేన్సర్‌ వ్యాప్తి నిరోధానికి కొత్త మార్గం?

కేన్సర్‌ కణాల్లో కొన్నింటికి ఓ అనూహ్యమైన లక్షణముంటుంది. చుట్టూ ఉన్న కేన్సర్‌ కణాలను అవి తినేస్తూంటాయి. ఈ ప్రక్రియను ఎన్‌టోసిస్‌ అంటారు. వందేళ్లుగా అందరికీ తెలిసిన ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని కేన్సర్‌ కణతుల పెరుగుదలను నిరోధించేందుకు కేంబ్రిడ్జ్‌లోని బబ్రహాం ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఎన్‌టోసిస్‌కు కణ విభజన ప్రక్రియ ఒక ప్రేరకంగా పని చేస్తోందని.. కణాలు అడ్డూ అదుపు లేకుండా విడిపోతూ ఉండటాన్ని కేన్సర్‌ అంటారు కాబట్టి.. ఈ రెండింటి మధ్య సంబంధంపై మానవ ఎపిథీలియల్‌ కణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.




సాధారణంగా ఈ కణాలు విడిపోయేటప్పుడు కూడా తమ పరిసరాలకు గట్టగా అతుక్కునే ఉంటాయి. ఒకవేళ ఇలా అతుక్కునే లక్షణం తక్కువగా ఉన్నప్పుడు ఎన్‌టోసిస్‌ లక్షణాలు అలవడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్‌ కణాల్లోనూ ఇలాంటి లక్షణాన్ని పుట్టించగలిగితే కేన్సర్‌ నెమ్మదించేలా లేదా నిరోధించేలా చేయవచ్చని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ ఓలివర్‌ ఫ్లోరే అంటున్నారు.

No comments:

Post a Comment