Wednesday, 12 July 2017

నొప్పి లేకుండా గర్భాశయ కేన్సర్‌ నిర్ధారణ


 గర్భాశయ కేన్సర్‌ నిర్ధారణకు ఓ సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తేలికగా, ఎక్కడికైనా తీసుకెళ్లే వీలున్న ఈ పరికరంతో ఎలాంటి నొప్పి, అసౌకర్యం ఉండదని డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివరించారు. భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ నిమ్మి రామానుజన్‌ ఈ బృందానికి నేతృత్వం వహించారు.


కాగా, గర్భాశయ కేన్సర్‌ నిర్ధారణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానం బాధాకరమైందని వైద్య నిపుణులు తెలిపారు. దీంతో చాలా మంది ఈ పరీక్షకు విముఖత చూపిస్తారు. దీంతో కేన్సర్‌ బాగా ముదిరాక కానీ బయటపడదని అన్నారు. ఇది కేన్సర్‌ మరణాలను పెంచుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో తాజా పరికరంతో గర్భాశయ కేన్సర్‌ మరణాలను కనిష్ఠ స్థాయికి తగ్గించవచ్చని నిమ్మి రామానుజన్‌ తెలిపారు. పాకెట్‌ కోల్పోస్కో్‌ప గా వ్యవహరించే ఈ పరికరం సాయంతో మహిళలు సొంతంగా పరీక్ష చేసుకోవచ్చని అన్నారు.

No comments:

Post a Comment