Saturday, 15 July 2017

రొమ్ము కేన్సర్‌ చికిత్సకు కొత్తరకం మాత్రలు


 రొమ్ము కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే కొత్తరకం మాత్రలను శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సైక్లిన్‌ డిపెండెంట్‌ కినాస్ నిరోధకాలుగా వ్యవహరించే ఈ మందులతో దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం కూడా తక్కువే.


నోటి ద్వారా తీసుకునే ఈ మందులతో హార్మోన్‌ రిసెప్టార్‌ పాజిటివ్‌ కేన్సర్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చని రొమ్ము కేన్సర్‌ చికిత్సా నిపుణుడు ఆదిత్యా బార్దియా పేర్కొన్నారు. కేన్సర్‌ వేగంగా విస్తరించడానికి సీడీకే ఎంజైమ్‌లు తోడ్పడతాయని, తాజాగా అభివృద్ధి చేసిన కొత్తరకం మందులతో వీటికి అడ్డుకోవచ్చని చెప్పారు.

No comments:

Post a Comment