ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని పొట్టన బెట్టుకుంటున్న వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడి 2015లో 90 లక్షల మంది మరణించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నయం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే కేన్సర్ ముప్పును తగ్గించవచ్చు, ఏ విటమిన్లు ఈ వ్యాధి కారక కణాలను నాశనం చేస్తాయి.. అనే దిశగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సాగిన ఓ అధ్యయనంలో కేన్సర్ కణాలను విటమిన్-సి నాశనం చేస్తోందని తేలింది.
ఆంకోటార్గెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయాన్ని ప్రచురించారు. ఇతర మందులతో పోలిస్తే.. కేన్సర్ మూల కణాలను విటమిన్-సి పదిరెట్లు ఎక్కువగా అంతం చేస్తోందని, వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటోందని సదరు అధ్యయనం తేల్చింది. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుంది.
కేన్సర్‌పై పోరాడేందుకు రోజువారీ ఆహారంలో భాగంగా ఎంత మోతాదులో విటమిన్-సి తీసుకోవాలనే విషయమై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు.

No comments:
Post a Comment