Thursday, 20 July 2017

జుట్టు రంగుతో రొమ్ము కేన్సర్‌ ముప్పు!

జుట్టుకు రంగు వేసుకునే మహిళలు రొమ్ము కేన్సర్‌ బారిన పడే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. అలాగే గర్భనిరోధానికి హార్మోనల్‌ ఇంట్రాటెరైన్‌ పద్ధతులను అనుసరించే వారిలో ఈ ముప్పు మరింత తీవ్రమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ శాస్త్రవేత్తలు ఫిన్లాండ్‌కు చెందిన 8 వేల మంది రొమ్ము కేన్సర్‌ బాధితులు, మరో 20 వేల మంది ఆరోగ్యవంతులై మహిళలపై అధ్యయనం చేశారు.







గర్భనిరోధానికి హార్మోనల్‌ ఇంట్రాటెరైన్‌ పద్ధతులను అనుసరించే వారికి కాపర్‌ టీ వంటి పద్ధతులను అనుసరించే వారి కన్నా రొమ్ము కేన్సర్‌ వచ్చే ముప్పు 52 శాతం అధికమని తేలింది. అలాగే జుట్టుకు రంగు వేసుకునే వారికి రొమ్ము కేన్సర్‌ ముప్పు 23 శాతం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు.

No comments:

Post a Comment