కొవ్వు ఎక్కువ అవుతోంది. కాస్త తగ్గించు. మన పెద్దలు అభిమానపూర్వకంగా చెప్పే ఈ మాటలో చాలా నిగూఢార్థాలు ఉన్నాయి. అధిక కొవ్వుతో గుండెపోటుతో పాటు కేన్సర్ కూడా వస్తుందట. అదే గర్భిణులకు కొవ్వు ఎక్కువైతే వారి సంతానానికి రొమ్ము కేన్సర్ ముప్పు తప్పదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మాటలు వింటుంటే పెద్దల మాట ఎందుకు చద్దిమూటో మరోసారి గుర్తొస్తోంది కదూ.
మహిళలు గర్భంతో ఉన్నపుడు అధిక కొవ్వు ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే సంతానానికి రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఆ ప్రభావం మూడు తరాల వరకు ఉంటుందని తెలిపారు. అధిక కొవ్వు గర్భిణుల్లో జన్యు సంబంధ మార్పులు చోటుచేసుకుని రొమ్ము కేన్సర్‌కు దారి తీస్తుందని అమెరికాలోని జార్జ్‌టౌన్ లాంబార్డీ కాంప్రహెన్సివ్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.

No comments:
Post a Comment