గట్టిగా శ్వాస తీసుకోండి.. ఇప్పుడు ఒకసారి వదిలి పెట్టండి.. వెరీ గుడ్, ఊపిరితిత్తుల కేన్సర్ లేదు... మీరు నిశ్చింతగా ఉండొచ్చు... ఇదేంటి అనుకుంటున్నారా..? భవిష్యత్తులో వాస్తవ రూపం దాల్చనున్న చిటికెలో పూర్తయ్యే లంగ్ కేన్సర్ పరీక్ష ఇలానే ఉండబోతోంది. ఇలా శ్వాస ద్వారా విడుదల చేసే గాలిలో ఉండే రసాయనాల ఆధారంగా పరిశోధకులు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని చెప్పేస్తారట.
కేన్సర్ కణాలు కణుతుల ఎదుగుదలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయని భావిస్తున్నట్లు అమెరికాలోని క్లీవ్ లాండ్ రెస్పిరేటరీ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ పీటర్ జే మజోన్ అంటున్నారు. తమ పరిశోధనలో వచ్చిన ఫలితాల ఆధారంగా శ్వాస ఆధారిత కేన్సర్ ను గుర్తించే పరీక్షను రూపొందించే పనిలో ఉన్నామని చెప్పారు.
No comments:
Post a Comment