Wednesday, 2 November 2016

కాలుష్యంతో కేన్సర్ ముప్పు



ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కేన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా ప్రపంచంలో మొత్తంలో భారతదేశంలోనే ఎక్కువగా 10 లక్షలమందికి పైగా ఉన్నారు. కేవలం వివిధ రకాల కాలుష్యాల వల్ల భారత్ లో ఏడాదిలో మరణించిన వారి సంఖ్య 14 లక్షలకు పైగా ఉంది.  చిన్న చిన్న తప్పులే పెనుముప్పులా మారి మొత్తం దేశాన్నే కాలుష్య కార్ఖానాగా మార్చాయన్నది విమర్శ కాదు వాస్తవం. వాయుకాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం, శబ్దకాలుష్యం ముఖ్యమైనది. వాయు కాలుష్యం ముఖ్యంగా పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల ఇంకా ఇప్పటికీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్టులవల్ల ఏర్పడుతోంది. మనదేశంలో ఎక్కువ మంది బాధపడుతున్న లంగ్ కేన్సర్ కు కారణం కూడా ఈ వాయు కాలుష్యమే.


                 స్వాతంత్య్రం రాకముందే మహాత్మాగాంధీ ఈ దేశ ప్రజల అపరిశుభ్రత చూసి ఆవేదనతో ఈ దేశానికి స్వాతంత్య్రం రావడం ఎంత ముఖ్యమో పరిశు భ్రత అంతకన్నా ముఖ్యమని చెప్పినా, అర్థం చేసుకోని బుద్ధిమాంద్యం మన వారసత్వం. అంతరిక్ష విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటున్న మనకు నేటికీ, దేశంలో పలు ప్రాంతాలలో బహిరంగ మల,మూత్ర విసర్జనలు, హారన్ మోతలు పంటికింద రాయిలా తగులుతున్నాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా కాలుష్యం వల్ల వచ్చేది నష్టమే. పోయేది ఆరోగ్యమే. మనకోసం, మన భవిష్యత్ తరాలకోసం కాలుష్యాన్ని అరికట్టాలి. కాలుష్యం ఇదే స్థాయిలో పెరిగితే దేశమంతా లంగ్ కేన్సర్ బారిన పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment