Thursday, 10 November 2016

మీకు లంగ్‌ కేన్సర్‌ వస్తుందా?


 ధూమపానం చేసేవారికి రకరకాల కేన్సర్లు.. ముఖ్యంగా లంగ్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందనేది అందరికీ తెలిసిన పాత విషయమే. కానీ.. కొంతమంది జీవితాంతం సిగరెట్లు తాగినా రాదు. కొందరికి వస్తుంది. స్మోకర్లలో అలా ఎవరికి లంగ్‌ కేన్సర్‌ వస్తుందో ఇన్నాళ్లూ వైద్యులు సైతం చెప్పలేకపోయారు. కానీ.. దీన్ని నిర్ధారించగల సరికొత్త వైద్యపరీక్షను యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు.



సిగరెట్‌ తాగేవారి నోటి నుంచి ముక్కు నుంచి స్రావాలను సేకరించి వాటిని పరారుణ కాంతి (ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌) కింద పెడతారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లోని, నోరు, ముక్కులోని కణాలు ఒకరకమైన ప్రభావానికి గురవుతాయి. ఆ ప్రభావానికి గురైన కణాలు పరారుణ కిరణాలకు ఒకరకంగా వెలుగుతాయి. అలాకానివి మరో రకంగా వెలుగుతాయి. ఈ తేడా ఆధారంగా లంగ్‌ కేన్సర్‌ వచ్చేదీ రానిదీ అంచనా వేయవచ్చు.

No comments:

Post a Comment