Tuesday, 29 November 2016

క్యాన్సర్ వ్యాధికి కూడా లింగ వివక్ష

క్యాన్సర్ వ్యాధికి కూడా లింగ వివక్ష ఉన్నట్లుంది. కాకపోతే పురుషులపై కాస్త మమకారం ఎక్కువేమో. ప్రపంచవ్యాప్తంగా 74 లక్షల మంది పురుషులకు క్యాన్సర్ వ్యాధిరాగా, 66 లక్షల మంది మహిళలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మహిళలకన్నా పురుషులకు ఎక్కువగా ఈ వ్యాధి రావడానికి కారణం ఆహారపు అలవాట్లతోపాటు ధూమ పానం, మద్యపానం కారణమని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఆశ్చర్యకరంగా బాలికలకన్నా కూడా క్యాన్సర్ వచ్చిన బాలలే ఎక్కువగా ఉన్నారు. అందుకు కారణం మాత్రం ధూమపానం, మద్యపానం కాదట. ఎందుకంటే వారికి ఈ అలవాట్లు ఉండవు కనుక.


          పురుషుల్లో ఎక్కువ కాలేయం, వీర్యగ్రంధి, పురీష నాళ క్యాన్సర్లు వస్తుండగా, మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్, కాలేయం, పురీషనాళ క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ వచ్చిన పిల్లలు జీవించే కాలం అభివృద్ధి చెందిన అధికాదాయ దేశాల్లో 80 శాతం పెరిగిందని వైద్య పరిశోధకులు తెలియజేశారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో క్యాన్సర్ బారిన పడిన పిల్లలు కనీసం ఐదేళ్లు జీవిస్తుండగా, పేద దేశాల్లో ఎక్కువ కాలం బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వారంటున్నారు. లైంగిక క్రోమోజోములు అభివృద్ధి చెందేవరకు పిల్లల్లో ఆడైనా, మగైనా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు సమానంగా ఉన్నాయని వారు చెప్పారు.

No comments:

Post a Comment