Thursday, 17 November 2016

నడకతో కేన్సర్ దూరం


రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడక.. మంచి నిద్రతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంకా ఆయుష్షును పెంచుకోవచ్చు. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండెపోటు, లివర్ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకుంటేనే ఆయుష్షును పెంచుకున్నట్లేనని.. వాటికి కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.  వాటిలో మొదటిది ఆల్కహాల్ తీసుకోకపోవడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తేనే ఆరోగ్యం ఉన్నట్టే. ఆల్కహాల్‌ను ఎంతమటుకు తగ్గిస్తే అంతమటుకు లివర్‌ను కాపాడుకోవచ్చు. ఇంకా బరువును కూడా తగ్గించుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు.          




  అలాగే వ్యాయామం రోజు వారీ పనుల్లో ఒక భాగమైపోవాలి. రోజుకు 20 లేదా అరగంటపాటు నడిస్తే గుండె నొప్పిని దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయవచ్చు. బీపీని నియంత్రించుకోవచ్చు. ఇక మూడోది పొగాకు ఉత్పత్తులను దూరంగా ఉంచడం.. తద్వారా లంగ్ కేన్సర్, గుండెనొప్పిని దరిచేరనీయకుండా చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో షుగర్ శాతాన్ని తగ్గించుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు బ్రేక్ వేయవచ్చు. ఒత్తిడిలోనుకాకుండా ప్రశాంతంగా ఉంటే హైబీపీ తరిమికొట్టవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment