ప్రపంచవ్యాప్తంగా లంగ్ కాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. అవగాహన కల్పించడం, కారణాలను వెంటనే గుర్తించడం చేస్తున్నప్పటికీ ఎన్నో ఏండ్లుగా ఫలితాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. అందుకే ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే వాటిని గుర్తించి, కమ్యూనిటీ స్థాయిలో నిరోధకచర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతదేశంలో ఏటా సుమారుగా 63,000 లంగ్ కాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఓ సర్వేలో నిర్థారణ అయ్యింది. అన్ని కాన్సర్ కేసుల్లోనూ స్త్రీ, పురుషుల మరణాలకు సంబంధించి 9.3 శాతం వాటికి లంగ్ క్యాన్సర్ కారణమవుతోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లంగ్‌క్యాన్సర్ గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి.
గ్లోబొకాన్ నివేదిక ప్రకారం వివిధ రకాల క్యాన్సర్‌లలో బ్రెస్ట్, సెర్వికల్, ఓరల్ కేవిటీల తరువాత లంగ్ కేన్సర్ నాలుగోస్థానంలో ఉంది. కేన్సర్ ఉదంతాలకు సంబంధించి పురుషుల్లో ఇది రెండో స్థానంలో నిలువగా, మహిళల్లో ఆరో స్థానంలో ఉంది. ఏటా భారతీయ పురుషుల్లో 53,728, మహిళల్లో 16,547 నూతన లంగ్‌క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ఉన్న భారతీయ రోగుల్లో ధూమపానం చేసే అలవాటు పురుషుల్లో 87 శాతంగా, మహిళల్లో 85 శాతంగా ఉంది. పాసివ్ టొబాకో ఎక్స్‌పోజర్‌కు గురయ్యే వారు 3 శాతంగా ఉన్నారు. అంటే అన్ని కేసుల్లోనూ 90% పొగాకు దుష్ప్రభావాలకు లోనవడం మూలాన్నే లంగ్‌క్యాన్సర్ బారిన పడుతున్నారు.

No comments:
Post a Comment