Thursday, 3 November 2016

కేన్సర్ పై ముప్పేట దాడి



ఊపిరితిత్తుల కేన్సర్‌ నివారణకు శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. ఇందులో రెండు రకాల ఔషధాలను ఉపయోగించడంతోపాటు రేడియేషన్‌ చికిత్సను కూడా ఏకకాలంలో చేయిస్తే ఊపిరితిత్తుల కేన్సర్‌ను నివారించవచ్చని థామస్‌ జఫర్సన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరీక్షల్లో వెల్లడైంది. ప్రమాదకరమైన నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌  నివారణలో ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నా.. కొన్ని కేన్సర్‌ కణాలు మాత్రం రూపాన్ని మార్చుకుని శరీరంలోనే ఉంటున్నాయి.


           రెండు రకాలైన ఔషధాలను, రేడియేషన్‌ చికిత్సను ఏకకాలంలో చేయడం వల్ల కేఆర్‌ఏఎస్‌ జన్యువులోని మార్పుల వల్ల వచ్చే కేన్సర్‌లను నివారించవచ్చని వర్సిటీ ప్రొఫెసర్‌ బో లూ తెలిపారు. కేన్సర్‌ కణితులు, మెలనోమా కేన్సర్‌ నివారణకు ఉపయోగించే రెండు రకాల కేన్సర్‌ ఔషధాలను కలిపి సరికొత్త ఔషధాన్ని తయారుచేస్తున్నామని, ప్రస్తుతం ఇది వైద్య పరీక్షల దశలో ఉందన్నారు.

No comments:

Post a Comment