ఒకచోట మంద్రంగా, గంభీరంగా.. ఒకచోట ఉరుకుల పరుగులతో.. పచ్చటి ప్రకృతి గుండా సాగిపోయే వేదమంటి గోదావరి.. క్రమంగా కాలుష్య కాసారంగా మారిపోతోంది. గోదావరి కాలుష్యంలో 18 శాతం మాత్రమే పరిశ్రమల వల్ల వస్తోంది. మిగిలినదంతా ప్రజలు వదిలే వ్యర్థాలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువుల వల్ల జరుగుతోంది.
ఈ ముప్పు నుంచి ప్రజలను కాపాడాలంటే.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సర్వే చేయించాలి. మానవ రహిత విమానాలు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలు, వెబ్ సెన్సర్ బేస్డ్ టెక్నాలజీల వల్ల ప్రయోజనం ఉంటుంది.
పచ్చటి పంటలతో అలరారే గోదావరి పరీవాహక ప్రాంతానికి పెనుముప్పు ముంచుకొస్తోంది. స్వచ్ఛమైన జలాలతో ఉరుకుల పరుగులిడే గోదారి తల్లి కాలుష్యకాసారంగా మారిపోతోంద. కాలకూట విషాల్లాంటి పారిశ్రామిక వ్యర్థాలు.. నిండు ప్రాణాలకు మరణశాసనం రాసే ఎరువులు, పురుగుమందుల అవశేషాలు.. ఆ జీవనదిని ప్రాణాలు తీసే విషమయ కాళింది మడుగులా మార్చేస్తున్నాయి. ఫలితం.. పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. కేన్సర్లు పెరిగిపోతున్నాయి.
No comments:
Post a Comment