మన చర్మంపై ఎన్నో రకాల మచ్చలు వస్తుంటాయి. కొన్ని పుట్టుమచ్చలు పెద్దయ్యాక కూడా వస్తుంటాయి. వీటితో ఎలాంటి సమస్య లేదు. కానీ కొన్ని రకాల మచ్చలు కొంచెం దురద పుట్టిస్తూ.. అసహనానికి గురిచేస్తుంటాయి. అలాంటి మచ్చల్ని తొలిదశలోనే డాక్టర్ కు చూపించాలి. ఎందుకంటే అవి ప్రమాదకరమైన కేన్సర్ కణాలు కావచ్చు. అలాంటి చర్మ కేన్సర్ కూడా తగ్గించుకోవడానికి చిట్కాలున్నాయంటున్నారు డాక్టర్లు. చాలా వ్యాధులకు కారణమైన అధిక బరువు.. చర్మ కేన్సర్ కు కూడా దారితీస్తుందని భయపెడుతున్నారు.
చర్మకేన్సర్‌తో బాధపడుతున్నారా? వెంటనే బరువు తగ్గేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అవును..! బరువు తగ్గితే చర్మ కేన్సర్ దూరమవుతుందని స్వీడన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 2వేల మంది చర్మ కేన్సర్ రోగులపై పరిశోధనలు చేయగా బరువు తగ్గినవారిలో వ్యాధి 61శాతం తగ్గినట్లు వెల్లడించారు.
No comments:
Post a Comment