జీవనశైలిలో మార్పులు.. అతిగా జంక్ ఫుడ్ తినడం.. నిద్రలేమి.. వాతావరణ కాలుష్యం.. వల్ల మనిషిని మధుమేహం(టైప్-2) ఆవహిస్తోంది. మధ్య వయస్కులే కాదు.. యువకులూ దీని బాధితులవుతున్నారు. దాని ప్రభావంతో అధిక రక్తపోటు, నరాల బలహీనత, కిడ్నీ సంబంధ వ్యాధులు, గ్లకోమా తదితర వ్యాధులు చుట్టుముడతాయి. అయితే, 50 ఏళ్ల తర్వాత మధుమేహం వస్తే క్లోమ కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ప్రభావం 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వయసు పైబడి మధుమేహానికి గురైన 36 నెలల్లో క్లోమం చుట్టూ కేన్సర్ కణితులు పుట్టి కణాలను హరిస్తుందని, దాంతో వాపు ఏర్పడి ఆ అవయవాన్ని పాడు చేస్తుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు.
65-85 మధ్య వయసున్న దాదాపు 49 వేల మంది ఆఫ్రికన్-అమెరికన్లు, లాటిన్లపై పరిశోధనలు చేయగా మధుమేహ వ్యాధిగ్రస్తులంతా క్లోమ కేన్సర్ బారిన పడ్డారన్నారు. ఈ కేన్సర్‌కు గురై ఐదేళ్ల పాటు జీవించింది కేవలం 8 శాతం కంటే తక్కువేనని తెలిపారు. వృద్ధాప్యంలో మధుమేహ సమస్య వస్తే వెంటనే క్లోమ కేన్సర్‌కు చికిత్స తీసుకుంటే మంచిదని సూచించారు. వయసు పైబడ్డాక మధుమేహం వస్తే రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్, పేగు కేన్సర్లు వచ్చే అవకాశం ఉందా అని పరిశోధనలు చేయగా వాటి ప్రభావం లేదని తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
No comments:
Post a Comment