విటమిన్ - డి అంటే, ఎముకలను వ్యాధిగ్రస్తం కాకుండా కాపాడటానికీ, వాటిని దృఢపరచడానికి మాత్ర మేని ఇప్పటిదాకా అనుకుంటూ ఉండిపోయాం. అయితే, కేన్సర్ వ్యాధి నివారణలోనూ విటమిన్ - డి పాత్ర కీలకమేనని ఇటీవలి పరిశోధనలో బయటపడింది. ఇటీవలి బి.ఎమ్. జె .జర్నల్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఈ విషయానికి సంబంధించిన వివరాలే ఉన్నాయి. టోక్యోలోని నేష్నల్ కేన్సర్ సెంటర్ వారు జరిపిన ఓ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలే ఆ వ్యాసంలో వివరంగా ఉన్నాయి.
ఒకరకం విటమిన్ -డి లోని ‘ 25- హైడ్రోక్సివిటమిన్ డి- కాన్సెంట్రేషన్’ అనే ఒక మూలకం కొన్ని రకాల కేన్సర్లను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వారు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. వీరు తమ అధ్యయంలో విటిమిన్ డి నిల్వలు తక్కువగా ఉన్నవారినీ, ఎక్కువగా వారినీ పోల్చి చూశారు. అయితే, విటమిన్- డి నిల్వలు ఎక్కువగా ఉన్న వారిలో కేన్సర్ బారిన పడే వారి సంఖ్య 20 శాతం తక్కువగా ఉందని వారు వివరించారు. ప్రత్యేకించి కాలేయ కేన్సర్ బారిన పడే ప్రమాదం కూడా 50 శాతం దాకా తగ్గుతోందని కూడా పేర్కొన్నారు. ఉదయ కిరణాలు ఇంట్లోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. పూర్తిగా గది గోడల మధ్యనో ఆఫీసు గోడల మధ్యనో ఉండిపోయే వారి ఒంటి మీద ఆ కిరణాలు పడే అవకాశం ఎక్కడుంది? పనిగట్టుకుని వీధిలోకి వస్తే గానీ, ఎంతో కొంత నీరెండ మన మీద పడే వీల్లేకుండా పోతోంది. ఏమైనా ప్రకృతి సహజ ప్రభావాలకు దూరం కావడం వల్ల వచ్చి పడుతున్న ప్రమాదాలేమిటో ఒక్కొక్కటిగా ఇలా బయటడపుతున్నాయి.
dear sir very good blog blog and good health tips
ReplyDeleteTelugu News