గర్భాశయ కేన్సర్ నివారణ కోసం చేసే రేడియేషన్ చికిత్సకు కేన్సర్ కణాలు బాగా స్పందించేలా బ్లూబెర్రీలు ఉపయోగపడుతాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్లూబెర్రీల సారం రేడియోసెన్సిటైజర్లలా వ్యవహరిస్తాయని, హానికరం కాని ఈ రసాయనం.. కేన్సర్ కణాలు రేడియేషన్ చికిత్సకు స్పందించేలా చేస్తాయని వెల్లడించారు.
బ్లూబెర్రీలలో రెస్వెట్రాల్(ప్రొస్టేట్ కేన్సర్‌ను అడ్డుకునే రేడియోసెన్సిటైజర్), ఫ్లెవొనాయిడ్స్ అనే రసాయనాలు ఉంటాయని, అందులో ఫ్లెవొనాయిడ్స్ ప్రతిక్షకారినిలా, శోథ నిరోధకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment