చాలా మందికి వయసు మీదపడుతున్నా తామింకా యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం చేయని ప్రయత్నాలంటూ ఉండవు. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే వారు అనుకున్నట్టుగానే కనిపించవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
వయస్సు మీద పడినా తెలియకుండా ఉండాలంటే ప్రతి రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించడంతో పాటు స్కిన్ కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చునని వారంటున్నారు.
ముఖ్యంగా, సూర్య కిరణాల నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావంతో కలిగే చర్మ వ్యాధులను నియంత్రించడంలో ద్రాక్ష పండ్లు ఎంతగానో సహకరిస్తాయట. అతినీలలోహిత కిరణాలు(యూవీ) చర్మ కణాలను సత్తువ లేకుండా చేస్తాయి.
తద్వారా చర్మం పాలిపోవడంతో పాటు వయసుమీద పడినట్లు స్కిన్ కనిపిస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా యూవీ ప్రభావాన్ని చర్మంపై సోకకుండా చాలావరకు నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment