మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. మన పెద్దవాళ్లు చెప్పే మాటల్ని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ.. ఇప్పుడు పరిశోధకులు సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి అవే నిజమని తేలుస్తున్నారు. తులసి, వేప ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కానీ గంధంలో కేన్సర్ తగ్గించే గుణం ఉందని తెలిస్తే మనమంతా ఆశ్చర్యపోవాల్సిందే. గంధం కనీసం వాడక్కర్లేదని కేవలం వాసనకే కేన్సర్ దూరమౌతుందని రీసెర్చులు చెబుతున్నాయి.
కేన్సర్ కణితులను అంతం చేయాలంటే రేడియేషన్ చికిత్స తప్పనిసరి. అయితే, మూత్రాశయ కేన్సర్‌ను అదుపులో పెట్టడానికి జర్మనీ శాస్త్రవేత్తలు వినూత్న ఆవిష్కరణ చేశారు. గంధపు సువాసనతో కేన్సర్‌ను అదుపులో పెట్టవచ్చని గుర్తించారు. గం ధపు వాసనలో ఉండే సాండ్రనాల్, సాంటనాల్ సమ్మేళనాలు కణితులపెరుగుదలను నిరోధిస్తాయని తేల్చారు.
No comments:
Post a Comment